Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Diwali 2024: దీపావళి రోజు కలలో ఈ వస్తువులు కనిపిస్తే చాలా మంచిదట.. అవి ఏవంటే?
మనిషికి సాధారణంగానే కలలు వస్తుంటాయి. ఆ కలల్లో కనిపించేవి కొన్నికొన్నిసార్లు నిజమవుతాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే దీపావళి రోజున కొన్ని కలలు వస్తే మాత్రం వారి దశ తిరిగినట్టే అని, అప్పటి నుంచి వారు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి కలలు వస్తే అది జరుగుతుంది, కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి కనిపించడం..
దీపావళి రోజు కలలో లక్ష్మీ దేవి కనిపిస్తే చాలా శుభప్రదమని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపావళి రోజు లక్ష్మీ దేవి కలలో కనిపిస్తే.. లక్ష్మీ దేవి మీపై సంతృప్తితో ఉన్నారని, త్వరలోనే మీపై ఆమె కటాక్షం చూపిస్తారని నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో కీర్తి, సంపద, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు రాబోతున్నాయని సూచిక అని పేర్కొంటున్నారు.

అమృత కలశం:
అమృత కలశం అంటే అమృతంతో నిండిన కుండ అని అర్ధం. స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రోజు అమృతం నిండిన కుండ కనిపిస్తే చాలా శుభప్రదం అని భావించాలట. ఈ అమృత కలశం కనిపించడం వల్ల కుటుంబంలో ఎవరైనా దీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి నయం అవుతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఆ కుటుంబంపై ఉంటుందట.
తామర పువ్వు:
దీపావళి రోజున కలలో తామరపువ్వును చూడడం అత్యంత శుభప్రదమట. ఈ మేరకు స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. కలలో తామరప్పువు కనిపిస్తే వ్యాపార వృద్ధి జరుగుతుందని, వృత్తిలో అద్భుతంగా రాణిస్తారనడానికి సంకేతమట. ఆర్ధిక భారం తొలిగి, సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతారని పేర్కొంటున్నారు.
గోధుమ లేదా వరి పంటను చూడడం..
సాధారణంగా పంటలకు సంబంధించిన కలలు వస్తుంటాయి. అయితే దీపావళి రోజున గోధుమలు లేదా వరి పంటలకు సంబంధించిన కలలు వస్తే చాలా మంచిది. చెడు సమయం ముగిసి, త్వరలోనే మీ జీవితంలో మంచి ఘడియలు వస్తున్నాయని చెప్పడానికి అది నిదర్శనం అని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఆర్ధిక లాభాలు గడించడం కూడా ఈ కల యొక్క సంకేతమని పేర్కొంటున్నారు.
కుల దైవం కనిపించినా..
దీపావళి రోజు కలలో కుల దైవం కనిపించినా చాలా శుభకాలాన్ని సూచిస్తుందట. కలలో కులదైవం కనిపిస్తే చాలా కాలంగా ఉండిపోయిన కోరికలు ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని అర్ధం చేసుకోవాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి త్వరలోనే ఉద్యోగం వస్తుందని అనడానికి ఇలాంటి కలలు సంకేతమని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు వివిధ అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని నమ్మడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని విశ్వసించే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications