Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దేవాలయాల్లో ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతారు.
సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా కొత్తగా గుడి నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని చాలా మంది భక్తులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం తెలుపుతున్నది.
గుడి లేదా దేవాలయం అనేది ఒక పుణ్య స్థలం. దేవాలయ నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను చేస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. మరి దేవాలయాలకు ఎలాంటి వస్తువులను దానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో సవివరంగా తెలుసుకుందాం...

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. ః

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

ఎలాంటి వాటిని దానం చేస్తే ఎలాంటి ఫుణ్య ఫలితం పొందుతారు..
దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

Click it and Unblock the Notifications