For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ లోనే పూజ గది ఉందా? దేవుడి ఫొటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలుండొచ్చా? పూజ గదిలోకి బొద్దింక వస్తే

|

చాలామంది వారి ఇంటి నిర్మాణం అప్పుడు అన్ని గదులు విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ

పూజగది గురించి మాత్రం అంత ఎక్కువగా పట్టించుకోరు.

కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తే, ఇంకొంతమంది కిచెన్ రూములో ఓ పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు.

మరికొంతమంది హాల్‌లోనే ఓ అల్మరాను కేటాయిస్తారు. ఇకపోతే, చాలామంది ఇళ్లల్లో అసలు పూజగది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అలాంటి వారు పూజామందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది.

బాల్కనీలో పూజగది

బాల్కనీలో పూజగది

వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది కాబట్టి, అలా చేయకపోవడం మంచిది. లివింగ్‌ రూమ్‌‌లో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో పూజమందిరాన్ని ఏర్పాటు చేసున్నట్లయితే.. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

పాలరాతితో తయారైన పూజామందిరాలు

పాలరాతితో తయారైన పూజామందిరాలు

పాలరాతితో తయారైన పూజామందిరాలు చూసేందుకు ఎంతో బాగుంటాయి. వాటి వల్ల గదికే కొత్త అందం వస్తుంది. ఫైబర్‌తో తయారైన పూజామందిరాలు కూడా బాగానే ఉంటాయి. వీటి ఖరీదు కూడా కొంచెం తక్కువే. పూజ గదిలో ఇటాలియన్‌ వైట్‌ మార్బుల్స్ లేదా సిరామిక్‌ టైల్స్ వేసినట్లయితే చాలా బాగుంటాయి.

చిన్న చిన్న చాపలు

చిన్న చిన్న చాపలు

పూజ గదిలో... ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్‌ఫామ్‌లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. ఇక, గోడలకు వినాయకుడు, రాధాకృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు. టెర్రకోట, బ్రాస్‌ దీపాలను పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు. గదిలో ఓమూలగా దీపాల స్టాండ్‌ను అమర్చినట్లయితే.. పూజగది చాలా అందంగా ఉంటుంది.

పీట వేసి

పీట వేసి

ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే.

దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించాలి.

గోడలకు వేలాడదీయాలి

గోడలకు వేలాడదీయాలి

పటాలను గోడకు వులాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు.

అలమారలలో

అలమారలలో

నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.

తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా

తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా

దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు.

ధ్యానం చేసే అలవాటు వుంటే

ధ్యానం చేసే అలవాటు వుంటే

మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును.

టాయిలెట్సు ఉండకూడదు

టాయిలెట్సు ఉండకూడదు

పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

బొద్దింక దరిద్ర దేవత వాహనం

బొద్దింక దరిద్ర దేవత వాహనం

అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను పూజగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో బొద్దింక దూరింది అంటే మనం శుభ్రంగా ఉంచలేదని అర్ధం. బొద్దింక దరిద్ర దేవత వాహనం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

మీ ఇలవేల్పు ఫోటో

మీ ఇలవేల్పు ఫోటో

అందుకని బొద్దింకలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండకూడదు. ఒక దేవతకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి కాని, రెండు మూడు పెట్టకూడదు. మీ కులదేవత యంత్రం గాని, ఫోటో గాని ఉండాలి. మీ ఇలవేల్పు ఫోటో తో పాటు ఇష్ట దేవతల ఫోటోలు రెండో మూడో ఉండచ్చుగాని, ఎక్కువ ఫోటోలు పెట్టకూడదు. పూజ గదిలో ఉండే వత్తులు, నూనె డబ్బా అన్ని కూడా చాలా శుబ్రంగా ఉండాలి.

అగరబత్తి గుచ్చిన అరటిపండు

అగరబత్తి గుచ్చిన అరటిపండు

అవి బూజు పట్టి, నూనె బాటిల్ జిడ్డు పట్టి ఉండకూడదు. దీపారదన కుందులకు మసి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. దీపం కుందుల నుంచి నూనె కారకుండా చూసుకోవాలి. దేవుడి ఫోటోలు దగ్గర ఎండిపోయిన పువ్వులు ఉంచకూడదు. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా శాంబ్రాని వాసన రావాలి. అగరబత్తి గుచ్చిన అరటిపండుని నైవేద్యం పెట్టకూడదు.

దరిద్ర దేవత కూర్చుంటుంది

దరిద్ర దేవత కూర్చుంటుంది

పెట్టిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. మనం కూర్చొని పూజ చేసిన పీట గాని, చాప గాని పూజ అయ్యి లేవగానే అవి కూడా తీసేయ్యాలి. లేకపోతే వాటి పై దరిద్ర దేవత కూర్చుంటుంది. వాడిన దీపం కుందులు కదగకుండా మళ్ళీ అందులో నూనె పోసి వెలిగించవద్దు. దేవుడి గది ఇలా ఉంటె...ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. చూడటానికి చిన్న చిన్న విషయాలే అయినా వీటి వలన ఇంటికి ఐశ్వర్యం వస్తుంది.

ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలు

ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలు

ఇక పూజగదిలో సాధారణంగా ఇష్టదేవతల ఫోటోలను ఉంచుకోవడం సంప్రదాయం. పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో దేవుడు ఫోటోలతో పాటు ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలను కూడా ఉంచుతారు. దేవుళ్ళతో పాటు వారిని కూడా స్మరిస్తూ.. పూజలు చేస్తుంటారు. అయితే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వారిని పూజించడం, స్మరించడం తప్పుకాదు. కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదు.

పూజాగదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే

పూజాగదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే

ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుంది. అందుకే వాస్తు ప్రకారం పూజగదిలో దివంగతుల ఫోటోలను ఉంచకూడదు. వాస్తు ప్రకారం పూజాగదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే ఆ ఇంటికి మంచి జరగదట. ఇంట్లో ఈశాన్య దిశగా పూజాగదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలను ఉంచాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రభావంతో ఇంట్లో ఉన్నవారికి మానసిక ప్రశాంతత ఉండదు.

మరణించిన వారి ఫోటోలు

మరణించిన వారి ఫోటోలు

మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని.. అందుకే పూజాగదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని.. మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదని.. అలా పెడితే మాత్రం కష్టాలు అనుభవించక తప్పదని, మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు అంటున్నారు.

గణపతి దేవుని విగ్రహము

గణపతి దేవుని విగ్రహము

ఇక పూజ గదిలో దేవుని పటాలు ఇలా ఉంచుకోవాలి గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతికి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు). స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీదేవతల కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు)వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే అతను కేవలం గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.

దేవుని రూంకు తాళం

దేవుని రూంకు తాళం

ఇక సాధారణంగా మన ఇళ్లలో ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. సెలవులకు ఊరెళుతున్నాం కదా అని దేవుని రూంకు తాళం వేస్తారు. అలా చేయడం వల్ల దేవుడిని మనం ఇంట్లోకి రాకుండా ఆపినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేవుడి ఫోటోల్లో ఎప్పుడు దంపతులు ఫోటోలు ఉంచాలట అలా చేయడం వల్ల జీవితంలో అపశృతులు చోటు చేసుకోకుండా ఉంటాయి.

ఇల్లే దేవాలయం

ఇల్లే దేవాలయం

దేవతలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ఫోటోలు తప్పని సరిగ్గా ప్రతిష్టించాలని సహస్త్రపురాణం చెబుతోంది. దేవుడి గదిలో ఎన్నివిగ్రహాలైన పెట్టుకోవచ్చు. గుడి కాదంటారా. ఇల్లే దేవాలయం అని పెద్దలు చెప్పారు కదా దానినే ఫాలో అవ్వండి.

English summary

importance of the puja room why we worship god at puja room only

importance of the puja room why we worship god at puja room only
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more