Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేయాలట.. అలా చేస్తే యోగ ఫలితాలు పొందొచ్చట? ఆ చెట్టు ఏంటంటే?
కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి మన దేశంలోని హిందువులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల రోజుల పాటు హిందువులందరూ భక్తి శ్రద్ధలతో శివుడు, విష్ణువు పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఎంతో నిష్ఠతో శివ, విష్ణువును పూజిస్తూ భక్తిలో మునిగితేలుతారు. అయితే ఈ కార్తీకమాసంలో ఉసిరి చెట్టును పూజిస్తుంటారు. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా పూజించడం, ఆ చెట్టు కింద భోజనం చేయడం వంటివి ఆనవాయితీగా వస్తుంది.
అయితే ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలనే ఆనవాయితీ ఎందుకు వచ్చింది? ఉసిరి చెట్టును మహా విష్ణువుగా ఎందుకు కొలుస్తారు? ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉసిరి చెట్టుకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే?
విష్ణు పురాణం ప్రకారం.. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిలు కొలువై ఉంటారని చెబుతుంటారు. దేవుళ్ళు ఉన్న కాలంలో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో అమృత బిందువులు భూమి మీద పడ్డాయని, అప్పుడే ఈ ఉసిరి చెట్టు పుట్టిందనే నమ్మకం. ఈ ఉసిరి చెట్టును భూమాతగా కూడా కొలుస్తారు.

ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఉసిరి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంపొందించి, అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి చెట్టును ధాత్రివృక్షమని కూడా పిలుస్తూ ఉంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవనిలాంటిది. అందుకే ఈ చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొంటున్నారు.
ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనం చేయాలంటే
ఉసిరి చెట్టు వేర్లలో శ్రీమహా విష్ణువు, కాండంలో శివుడు, చెట్టుపైన బ్రహ్మదేవుడు, చెట్టు కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పేర్కొంటుంటారు. అలాంటి చెట్టుకు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులలో పాటు ఈశాన్యం వంటి మూలల్లో సైతం ఎనిమిది దీపాలను వెలిగించి.. చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదిక్షణలు చేసి, ఆ చెట్టు కింద భోజనం చేయాలి. ఇలా చేయడం అత్యంత శుభసూచకంగా భావిస్తుంటారు.
అలాగే కార్తీక మసమాలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తుంటారు. ఇలా దీపం పెట్టడం వల్ల శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఇలా చేయడం వల్ల విష్ణు కటాక్షం లభిస్తుందని చెబుతుంటారు. ఉసిరి చెట్లు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలిగి పోతాయట. అలాగే దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని పండితులు చెబుతుంటారు. అలాగే నరదృష్టి కూడా ఇంటికి తగలకుండా ఉంటుందని చెబుతుంటారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications