Just In
- 6 min ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
- 1 hr ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- 2 hrs ago
రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...
- 3 hrs ago
జుట్టు రాలిపోతుందా? దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తింటే మీ జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది...
Don't Miss
- Sports
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌ల కోసం తమ స్క్వాడ్‌ను ప్రకటించిన శ్రీలంక బోర్డు
- Finance
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1534 పాయింట్లు జంప్
- News
గన్నవరం పంచాయతీ ఒట్టిదే-నియోజకవర్గ సమస్యలపైనే వెళ్లా-వంశీ కీలక వ్యాఖ్యలు
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Movies
Jr NTR పాన్ ఇండియా సినిమాలతో కళ్యాణ్ రామ్.. రెమ్యునరేషన్ ఇవ్వకుండా?
- Automobiles
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Indian Festivals Calendar 2022 :ఈ ఏడాది ముఖ్య పండుగలు, వ్రతాలు, సెలవుల తేదీలివే...
Indian
Festivals
Calendar
2022:
అప్పుడే
మనమంతా
2022
కొత్త
ఏడాదిలోకి
అడుగుపెట్టేశాం.
నూతన
సంవత్సర
వేడుకలు
అందరూ
ఘనంగా
జరుపుకున్నారు.
న్యూ
ఇయర్
పార్టీతోనే
కొత్త
క్యాలెండర్
ప్రారంభమైంది.
వీటన్నింటి
సంగతి
పక్కనబెడితే..
భారతదేశం
విభిన్న
మతాలు
కలిగిన
దేశం.
ఈ దేశంలోని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, సిక్కులు ఇతర వ్యక్తులు అనేక పండుగలు, వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇదే సమయంలో చాలా మంది తమకు ఎప్పుడు సెలవులొస్తాయా? తాము ఎప్పుడెప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుదామా అని ప్లాన్ చేస్తుంటారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో ఏయే నెలలో ఏయే పండుగలొచ్చాయి.. ఏయే రోజుల్లో వ్రతాలు జరుపుకుంటారు.. ఎప్పుడెప్పుడు సెలవులొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జనవరి నెలలో..
* జనవరి నెలలో 13, 14,15,16వ తేదీల్లో భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను జరుపుకుంటారు.
* జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటారు.
* జనవరి 23వ తేదీన సుభాష్ చంద్ర బోస్ జయంతి జరుపుకుంటారు.
* జనవరి 26వ తేదీన బుధవారం నాడు గణతంత్ర దినోత్సవం వచ్చింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మందికి సెలవు ఉంటుంది.
* జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి.

ఫిబ్రవరి నెలలో..
* ఫిబ్రవరి ఒకటో తేదీన మహా అమావాస్య వచ్చింది.
* కొత్త ఏడాదిలోని రెండో నెలలో ఫిబ్రవరి 5వ తేదీన వసంత పంచమి, సరస్వతి పూజను జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 26న మహర్షి దయానంద సరస్వతి జయంతి జరుపుకుంటారు.
* ఫిబ్రవరి 28వ తేదీన సోమవారం నాడు ప్రదోష వ్రతం జరుపుకుంటారు.

మార్చి నెలలో..
* మార్చి ఒకటో తేదీన మహా శివరాత్రి పండుగ వచ్చింది.
* మార్చి రెండో తేదీన ఫాల్గుణ అమావాస్య వచ్చింది.
* మార్చి 4న రామక్రిష్ణ జయంతిని వచ్చింది.
* మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.
* మార్చి 18వ తేదీన హోలీ పండుగను జరుపుకుంటారు.
* మార్చి 21వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు.

ఏప్రిల్ నెలలో..
* 1 ఏప్రిల్ శుక్రవారం నాడు ఛైత్ర అమావాస్య, బ్యాంకుకు సెలవు రోజు.
* 2 ఏప్రిల్ శనివారం నాడు ఉగాది పండుగ, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం
* 10 ఏప్రిల్ ఆదివారం - శ్రీరామ నవమి
* 14 ఏప్రిల్ గురువారం - ప్రదోష వ్రతం, మహావీర్ జయంతి, మాస సంక్రాంతి, అంబేద్కర్ జయంతి,
* 15 ఏప్రిల్ శుక్రవారం - గుడ్ ఫ్రైడే
* 16 ఏప్రిల్ శనివారం - హనుమ జయంతి
* 26 ఏప్రిల్ మంగళవారం - వరుదని ఏకాదశి, వల్లభాయ్ పటేల్ జయంతి
* 30 ఏప్రిల్ శనివారం - వైశాఖ అమావాస్య

మే నెలలో..
* 1 మే ఆదివారం - మే డే(అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం)
* 3 మే మంగళవారం - అక్షయ తృతీయ, ఈద్-ఉల్-ఫితర్/రంజాన్
* 7 మే శనివారం - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
* 13 మే శుక్రవారం - ప్రదోష వ్రతం
* 16 మే సోమవారం - వైశాఖ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ
* 19 మే గురువారం - సంకష్ట చతుర్థి
* 30 మే సోమవారం - జ్యేష్ఠ అమావాస్య

జూన్ నెలలో..
* 2 జూన్ గురువారం - ప్రతాప జయంతి
* 11 జూన్ శనివారం - నిర్జల ఏకాదశి
* 12 జూన్ ఆదివారం - ప్రదోష వ్రతం
* 14 జూన్ మంగళవారం - జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం/కబీర్ దాస్ జయంతి
* 24 జూన్ శుక్రవారం - యోగిని ఏకాదశి
* 29 జూన్ బుధవారం - ఆషాఢ అమావాస్య

జులై నెలలో..
* 1 జులై శుక్రవారం - జగన్నాథ రథయాత్ర
* 10 జులై ఆదివారం - దేవశయని ఏకాదశి/ఆషాఢ ఏకాదశి/బక్రీద్
* 11 జులై సోమవారం - ప్రదోష వ్రతం
* 13 జులై బుధవారం - గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ వ్రతం
* 28 జులై గురువారం - శ్రావణ అమావాస్య
* 30 జులై శనివారం - ఇస్లామిక్ నెల ప్రారంభం

ఆగస్టు నెలలో..
* 2 ఆగస్టు మంగళవారం - నాగ పంచమి
* 4 ఆగస్టు గురువారం - తులసిదాస్ జయంతి
* 8 ఆగస్టు సోమవారం - శ్రావణ పుత్రద ఏకాదశి
* 9 ఆగస్టు మంగళవారం - ప్రదోష వ్రతం
* 11 ఆగస్టు గురువారం - రక్షాబంధన్/రాఖీ
* 12 ఆగస్టు శుక్రవారం - శ్రావణ పూర్ణిమ వ్రతం
* 15 ఆగస్టు సోమవారం - స్వాతంత్య్ర దినోత్సవం/సంకష్ట చతుర్థి
* 19 ఆగస్టు శుక్రవారం - జన్మాష్టమి
* 27 ఆగస్టు శనివారం - భాద్రపద అమావాస్య
* 31 ఆగస్టు బుధవారం - గణేష్ చతుర్థి

సెప్టెంబర్ నెలలో..
* 5 సెప్టెంబర్ బుధవారం - ఉపాధ్యాయ దినోత్సవం
* 8 సెప్టెంబర్ గురువారం - ప్రదోష వ్రతం, ఓనం పండుగ
* 9 సెప్టెంబర్ శుక్రవారం - అనంత చతుర్దశి
* 10 సెప్టెంబర్ శనివారం - భాద్రపద పూర్ణిమ వ్రతం
* 13 సెప్టెంబర్ మంగళవారం - సంకష్ట చతుర్థి
* 21 సెప్టెంబర్ బుధవారం - ఇందిరా ఏకాదశి
* 25 సెప్టెంబర్ ఆదివారం - అశ్విన్ అమావాస్య
* 26 సెప్టెంబర్ సోమవారం - శరద్ నవరాత్రి

అక్టోబర్ నెలలో..
* 2 అక్టోబర్ ఆదివారం - నవరాత్రి పూజ/గాంధీ జయంతి
* 3 అక్టోబర్ సోమవారం - దుర్గా పూజ
* 4 అక్టోబర్ మంగళవారం - మహా నవమి పూజ
* 7 అక్టోబర్ శుక్రవారం - ప్రదోష వ్రతం
* 8 అక్టబోర్ శనివారం - మిలాద్ ఉన్ నబి
* 9 అక్టోబర్ ఆదివారం - మీరా బాయ్ జయంతి/వాల్మీకి జయంతి
* 24 అక్టోబర్ సోమవారం - దీపావళి/నరక చతుర్దశి/లక్ష్మీ పూజ
* 25 అక్టోబర్ మంగళవారం - కార్తీక అమావాస్య

నవంబర్ నెలలో..
* 1 నవంబర్ మంగళవారం - కన్నడ రాజ్యోత్సవం
* 4 నవంబర్ శుక్రవారం - దేవుత్తని ఏకాదశి
* 5 నవంబర్ శనివారం - ప్రదోష వ్రతం
* 8 నవంబర్ మంగళవారం - గురునానక్ జయంతి
* 12 నవంబర్ శనివారం - సంకష్ట చతుర్థి
* 23 నవంబర్ బుధవారం - మార్గశిర అమావాస్య

డిసెంబర్ నెలలో..
* 1 డిసెంబర్ గురువారం - అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం
* 3 డిసెంబర్ శనివారం - మార్గశిర ఏకాదశి
* 5 డిసెంబర్ సోమవారం - ప్రదోష వ్రతం
* 8 డిసెంబర్ గురువారం - మార్గశిర పూర్ణిమ
* 11 డిసెంబర్ ఆదివారం - సంకష్ట చతుర్థి
* 23 డిసెంబర్ శుక్రవారం - పుష్య అమావాస్య
* 25 డిసెంబర్ ఆదివారం - క్రిస్మస్
* 29 డిసెంబర్ గురువారం - గురు గోవింద సింహ జయంతి