Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
మనలో స్పూర్తినింపే కర్ణుడి గొప్ప లక్షణాలు
మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ.. కర్ణుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.
మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు మనం తెలుసుకోవచ్చు. కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన, మనలో స్పూర్తినింపే లక్షణాలు అనేకం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శక్తివంతమైన వ్యక్తి
మహాభారతంలో కర్ణుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అర్జునుడి కంటే... కర్ణుడే బలశాలి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయపడ్డాడు. అలాగే ఇంద్రుడు కూడా కర్ణుడి కవచం తొలగించి అర్జునుడికి సహాయం చేశాడు.

ఉదార స్వభావం
ఉదారస్వభావానికి కర్ణుడు చాలా ఫేమస్. కర్ణుడు బంగారపు చెవి పోగులతో జన్మించాడు. ఇవే.. అతనికి రక్షగా ఉన్నాయి. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడిని చెవిపోగులు, కవచం ఇవ్వాలని కోరాడు. కర్ణుడు ఉదారస్వభావం కలిగినవాడు కావడంతో.. వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేశాడు.

విల్లు
బాణాలు విసరడంలో కర్ణుడుకి సాటిలేరు. అర్జునుడి కంటే.. కర్ణుడే అద్భుతంగా బాణాలు వేయగలడు.

దానధర్మాలు
ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా.. కర్ణుడు ఏ మాత్రం వెనకాడడు. అయితే.. కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఇంద్రుడు దానం చేయాలని కోరాడు. తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు వివరించాడు. అయితే.. తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని కోరారు. వెంటనే కర్ణుడు దాన్ని దానం చేశారు.

కుంతీ
కురుక్షేత్ర యుద్దం తర్వాత వెంటనే కుంతీ దేవి దగ్గరకు వెళ్లిన కర్ణుడు.. తనే తన తల్లి అని వివరించాడు. పాండవుల్లో తాను పెద్దవాడు కాబట్టి.. తననే రాజు కావాలని కుంతీ సూచించింది. అయితే తాను తన స్నేహితుడిగా భావించే దుర్యోధనుడిని మోసం చేయాలనుకోవడం లేదని వివరించాడు.

విలువలు
ధుర్యోదనుడిని వదిలిపెట్టి.. పాండవుల్లో కలిసిపొమ్మని శ్రీకృష్ణుడు కూడా బతిమాలాడు. రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా ఇస్తానని చెప్పాడు. కానీ.. కర్ణుడు మాత్రం తన విలువలను నమ్మాడు. రాజ్యం కోసం ధుర్యోదనుడిని విడిచిపెట్టకూడదని భావించాడు.

పాండవుల గుణాలు
కర్ణుడు చాలా తెలివైనవాడు, నీతి, నిజాయితీ పాటిస్తాడు. చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే చాలా అందమైనవాడు. ఈ గుణాలన్నీ పాండవులకు కూడా ఉన్నాయి. సహదేవుడు తెలివి తేటలు, యుధీస్త్రీరాకి మోరల్ వ్యాల్యూస్, అర్జునుడు గొప్పగా విల్లువేసేవాడు, భీముడు శారీరక బలం కలిగిన వాడు, నకులుడు శారీరకంగా ఆకట్టుకునే వ్యక్తి. అయితే వీళ్లకు ఒక్కొక్కరికి ఉన్న గుణాలన్నీ కర్ణుడిలోనే ఉండటం విశేషం.



Click it and Unblock the Notifications
