For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయ గుజ్జుతో అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అంతా మీపైనే.. సంపద మీ ఇంటికే, జేబు నిండా డబ్బే

ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ ప్రసాందంగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరికాయ గుజ్జుతో అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అంతా మీపైనే.

By Arjun Reddy
|

డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అందరికీ ఉంటుంది. మరి ధనలక్ష్మీ అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు మహాలక్ష్మీ లక్ష్మీదేవతఅనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలామంది రకరకాలుగా మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు. అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీ సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుడు అధీనంలో ఉంటాయి. కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి.

శ్రీఫలం

శ్రీఫలం

పేరులోనే ‘శ్రీ' ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు. మెర్క్యూరీ లక్ష్మీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే దీనికి దేవి ఆకర్షితమవుతుంది.

శ్రీసూక్తం

శ్రీసూక్తం

అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే!

గవ్వలను పూజ గదిలో ఉంచితే

గవ్వలను పూజ గదిలో ఉంచితే

పిల్లలు ఆడుకునే గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి వీటిని పూజగదిలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మోతీ శంఖాన్ని మంత్ర, తాంత్రిక పూజల్లో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఇవి చాలా అద్భుతమైన శంఖంగా నమ్ముతారు. వీటిని కూడా ఇంట్లో ఉంచితే శ్రీలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట.

Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!! Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

వెండితో తయారు చేసిన విగ్రహాలు

వెండితో తయారు చేసిన విగ్రహాలు

వెండితో తయారు చేసిన గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా పవిత్రమైనవి. వీటిని రోజూ పూజిస్తే సిరిసంపదలకు లోటే ఉండదట. తాంత్రిక శాస్త్రంలో శ్రీ యంత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని యంత్రాలకు రాజుగా దీనిని పేర్కొంటారు. పూజ గదిలో ఈ యంత్రాన్ని ఉంచితే సిరి తరలివస్తుందట.

వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి పాదుకలు సరైన దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ శాశ్వతంగా ఉండిపోతుందట.

శ్రీ చక్రం

శ్రీ చక్రం

తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం' అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.

తామరపూలు

తామరపూలు

లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే. కలువ పూల విత్తనాలు దండను పూజకు వినియోగిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి నడిచివస్తుందట. అలాగే దక్షిణ దిశగా నోరు ఉండే శంఖం పూజ గదిలో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ వెలుస్తుంది.

Most Read:చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే... Most Read:చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

నేతిదీపాలు

నేతిదీపాలు

చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.

ఉసిరికాయ

ఉసిరికాయ

ఉసిరికాయంటే మహాలక్ష్మీకి ఎంతో ఇష్టం. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి అప్పులు పూర్తిగా తీర్చుకుంటారు. దీనిని మానసిక ప్రశాంతత కలుగుతుంది. మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది.

సిరిసంపదలు కలుగుతాయి

సిరిసంపదలు కలుగుతాయి

అలాగే ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ ప్రసాందంగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరికాయను పెళ్లి కాని యువతులు శుక్రవారం ముత్తయిదువులకు ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది. ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మీకి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ముతైదువులకు ఇవ్వాలి. అమ్మవారికి ఇష్టమైన ఉసిరికాయను ప్రసాదంగా పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇలా చేస్తే రావాల్సిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి.

 Most Read: మీ చేతిలోని హృదయ రేఖలో “V” అనే అక్షరం తెలిపే విషయాలు Most Read: మీ చేతిలోని హృదయ రేఖలో “V” అనే అక్షరం తెలిపే విషయాలు

English summary

invite goddess lakshmi to your home with these 10 easy steps

invite goddess lakshmi to your home with these 10 easy steps
Desktop Bottom Promotion