TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
దేవుడికి మనం కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోయి ఉంటే ఏం జరుగుతుంది?
మనం అందరం గుడి వెళ్తున్నామంటే కచ్చితంగా చేసే పని కొబ్బరి కాయ కొట్టడం. గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. అయితే భగవంతుడికి టెంకాయనే సమర్పించడానికి కొన్ని కారణాలున్నాయి.
ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి టెంకాయ కొడతాం. అందులో నీరు చాలా పవిత్రమైనది. అందుకే మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం.
పరమేశ్వరుడి మూడు కళ్లు
మనుషుల్లోని అహం పోయేందుకు కొబ్బరి కాయను కొట్టే పద్ధతిని ప్రవేశపెట్టారట. అలాగే కొబ్బరి కాయకు ఉండే మూడు కళ్లు పరమేశ్వరుడికి ఉండే మూడు కళ్లని చాలా భావిస్తారు. అయితే కొబ్బరి కాయనే కొట్టే ముందు దాన్ని శుభ్రంగా కడగాలని ఒక ఆచారం ఉంది. దీన్ని పాటించే వాళ్లు తక్కువ మంది ఉంటారు.
ఆగ్నేయ ముఖంగా ఉండాలి
అంతేకాదు టెంకాయను పెట్టి కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలి. కొందరు కొబ్బరి కాయను కొట్టిన తర్వాత దాన్ని విడదీయకుండా చేతిలో పట్టుకుంటారు. అలా చేయకూడదు. వెంటనే దాన్ని విడదీసి ఆ నీటిని ఏదైనా పాత్రలో పోయాలి. ఆ కొబ్బరినీటిని, విడిగా ఉన్న రెండు కొబ్బరి చిప్పలను దేవుడికి నివేదించాలి.
గుండ్రంగా పగలలేదని
చాలా మంది టెంకాయ గుండ్రంగా పగలలేదని, టెంకాయ కుళ్లిపోయిందని బాధపడుతుంటారు. దీని వల్ల తమకు కీడు జరుగుతుందని అనుకుంటారు. సాధారణంగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాం.
కుళ్లిపోతే ఏం కాదు
అయితే దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. అది పాపమేమీ కాదు. మీకు శని ఏమీ పట్టుకోదులెండి. మీరు కొట్టిన టెంకాయ కుళ్లి పోయింటే ఒకవేళ మీరు పూజ చేస్తూ ఉంటే దాన్ని ఆపేసి కాళ్లు చేతులు కడుక్కోని మళ్లీ పూజ ప్రారంభించండి. ఇక కొత్త వెహికిల్ కొనుక్కోని మీరు పూజ చేయిస్తుంటే కొబ్బరి కాయ చెడిపోతే వాహనాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ చేయించుకోండి.
టెంకాయలో పువ్వు వస్తే
భక్తితో కొబ్బరి కాయ కొడితే చాలు. అది కుళ్లిపోయినా మీకు ఏమీ కాదు. అదంతా అపనమ్మకం. ఒకవేళ వంకర టింకరగా పగిలితే కూడా ఎలాంటి నష్టం లేదు. ఇక టెంకాయ గుండ్రంగా పగిలితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే టెంకాయలో పువ్వు కనపడితే అది మీకు శుభాలను తీసుకొస్తుంది. నూతన వధూవరులకు త్వరగా సంతానం కలుగుతుందనడానికి ఇది ఒక సూచన. టెంకాయ నిలువుగా పగిలితే మీ ఇంట్లో వారికి త్వరలో సంతానం కలుగుతుందని సూచన.