Latest Updates
-
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.?
తథాస్తు దేవతలంటే ఎవరు? అసలు తథాస్తు దేవతలున్నారా..?
తథాస్తు లేక తధాస్థు అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేక కావాలనుకున్నప్పుడు లేక ఇతరులు దీవించినప్పుడు మనం అన్న మాటలు విన్నవారు అలాగే జరుగుగాక లేక ఇది తధ్యం అని అంటే ఖచ్చితంగా జరుగుతుందని భావించిన మన పెద్దలు తధాస్తు అని దీవెనలంధిస్తారు. అది ఎంత మాత్రం నిజమో ...ఇందులోని ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే..ః

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
తధాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తధాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటూ ఉంటారు. వీరినే తధాస్తు దేవతలు అంటారు.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
ఆలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను పలుమార్లు అనిన యెడల అట్టి దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటుంటారు. ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ వుంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ అంటూ వుంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతుంటాం. ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులూ చదువుకున్నది ఒకే శాస్త్రం. మరి ఒక వైద్యుడి హస్తవాసే బాగోవడమేమిటి ? అంటే... ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే అనుకుంటూ ఉండటం, తధాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతుంటూంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటుంటాయి.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
ఇదే విషయం చెడుకూ వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతుంటాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
అయితే దీనికి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరంగా దీనికి అర్ధం. తథా అంటే ఆ ప్రకారంగా; అస్తు అంటే కావలసినదే. అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారు ఈ మాట మీరు అంటే ముహూర్తం అనేదాన్ని విశ్వసిద్దాం ముందు. ముహూర్తబలం అంటారు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఉప్పు -నిప్పు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లు ప్రేమ ఆప్యాయతలు తవ్వి పోసుకుంటారు.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
అది ఆధునికపరమైన వివాహసంబంధాలవైపు దారితీయవచ్చును. లేదా మిత్రత్వానికి దారితీయవచ్చును. ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూసుకున్న నిమిషం వేళా విశేషం. అలాగే నిత్యమూ జపం చేసేటటువంటి వాళ్ళు పూజావిధానాలలో ఏదో ఒక లక్ష్యంతో నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వాళ్ళు అన్నమాట నిజం అయి తీరుతుంది.

నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
దేవతలు అంటే పైన వాహనాలలో తిరుగుతూ ఎవరైనా ఏమైనా అంటాడా, తథాస్తు అందాం లాగా కాదు. సినిమాలు, సీరియళ్ళు చూసి ఇలాంటి భావనలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య. మనస్సులోనే ఉంటుంది దేవత. మన మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అదే తథాస్తు. పిల్లలే ఉన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడింది తండ్రితో. ఆ తండ్రి చాలా జపం చేసేవాడు, యోగ్యుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఇలాగైతే...అని ఏదైనా అన్నాడనుకోండి, జరిగి తీరుతుంది.



Click it and Unblock the Notifications