For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాఖీ పండుగ నాడు, రాఖీ కట్టేటప్పుడు తప్పక ఉండవలసిన వస్తువులు.

రాఖీ పండుగ నాడు, రాఖీ కట్టేటప్పుడు తప్పక ఉండవలసిన వస్తువులు.

|

శ్రావణ మాసం అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. నెలంతట, ఒకదాని వెంట ఒకటిగా ఎన్నో పండుగలు వస్తాయి. ఈ మాసంలోని సోదరి సోదరుల ఉత్సవం అయిన రక్షా బంధన్ కూడా వస్తుంది. ఒక సోదరుడు మరియు సోదరి మధ్య ఉండే బంధం ఎంతో అందమైనది. మన సోదరుడు లేదా సోదరి ఒక స్నేహితుడు మరియు మార్గదర్శిని వలె జీవితంలోని ప్రతి మలుపులో మన వెన్నంటే ఉంటారు. ఎప్పటికి మనతో నిలిచి ఉండే ఒక స్నేహం, మనకు ఈ బంధం ద్వారా దొరుకుతుంది. ఈ అనుబంధాన్ని జరుపుకోవడానికి రక్షా బంధన్ సరైన రోజు.

ఈ పండుగ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత, లేఖనాల్లో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజు,సోదర సోదరి బంధానికి బలాన్ని ఇవ్వడంతో పాటు, సోదరి యొక్క శుభకామనలు, సోదరునికి రక్షణ మరియు పురోగతిని అందిస్తుంది.

Items To Keep On The Rakhi Tray

ఒక సోదరి, ఆమె సోదరుడి మణికట్టు చుట్టూ రాఖీగా పిలువబడే దారాన్ని కడుతుంది. దీనితో పాటు, ఆమె తన సోదరుడికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన దీర్ఘ ఆయిష్షు లభించాలని ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరికి, మంచి- చెడుల యందు సర్వసమయాలలో రక్షణగా నిలిచి ఉంటానని, వాగ్దానం చేస్తాడు. అంతేకాకుండా, అతను రాఖీకి బదులుగా, ఆమెకు ఒక బహుమతిని ఇస్తాడు.

ఈ సంవత్సరం రక్షా బంధన్ ఆగష్టు 26, 2018 న జరుపబడుతుంది. అయితే, రాఖీని కట్టడానికి కూడా ప్రత్యేక సమయం ఉంటుంది. ఉదాహరణకు, భద్ర కాల సమయంలో రాఖీని కట్టడం, చాలా అశుభంగా భావిస్తారు. అదేవిధంగా, రాహు కాలం మరియు యమ ఘడియాలలో కూడా రాఖీ కట్టకూడదు.

రాఖీ కట్టేటప్పుడు, ట్రేలో ఉంచుకోవలసిన వస్తువులు:

రాఖీ కట్టేటప్పుడు తప్పక గుర్తు ఉంచుకోవాల్సిన నియమాలు ఉన్నాయి. మనం సాధారణంగా పూజకు లేదా దైనందిన ఆరాధన సమయంలో వినియోగించే పవిత్రమైన వస్తువుల్ని, రాఖీ కట్టేటప్పుడు, దగ్గర ఉంచుకుంటాము. కానీ, ఇది సరైన పద్ధతి కాదని, జ్యోతిష్కుల సలహా.

కేవలం ఈ ఉత్సవంతో సంబంధం ఉన్న కొన్ని వస్తువులను మాత్రమే రాఖీ ట్రేలో ఉంచాలి. ఎందుకంటే ఆ వస్తువులకు, రాఖీ పండుగలో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. రాఖీని కాకుండా, కొన్ని ప్రత్యేక వస్తువులను మాత్రమే, ఈ ట్రేలో ఉంచాలి. రాఖీ ట్రేలో మీరు ఉంచవలసిన వస్తువుల జాబితాను మీ కోసం మేము సిద్ధం చేసాము. అవేంటో ఒకసారి చూసేయండి.

కుంకుమ: మీ పూజ ట్రేలో కుంకుమను అన్నింటికన్నా ముందుగా తప్పక ఉంచాలి. ఇది దీర్ఘ ఆయుష్షు మరియు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కుంకుమను నుదిటి మీద ధరించినప్పుడు, మనస్సు చురుకుగా మరియు స్థిరంగా ఉంటుంది. ఒక సోదరి, ఆమె సోదరుని నుదిటిపై కుంకుమతో తిలకం దిద్దితే, అది అతనికి జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని అందిస్తుంది.

అక్షతలు: పూజా కోసం వినియోగించే పసుపు బియ్యాన్ని అక్షతలు అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, విరిగిన బియ్యం గింజలను అక్షతల తయారీలో వినియోగించరాదు. అక్షతం అంటే పరాజయం లేనిదని అర్ధం; అందువల్ల, విరగని బియ్యం గింజలతో తయారు చేసిన అక్షతలను మాత్రమే రాఖీ ట్రేలో ఉంచాలి. ఇది సోదరునికి సంపదను కలుగజేస్తుంది.

కొబ్బరికాయ: కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. అది లక్ష్మి దేవికి చిహ్నం. కనుక, దీనిని కూడా తప్పక రాఖీ వస్తువుల ట్రేలో ఉంచాలి. సోదరి ఈ కొబ్బరికాయను తన సోదరుడికి ఇవ్వాలి. ఇది అతనికి, వృత్తిపరమైన పురోగతికి ద్వారాలను తెరుస్తుందని అంటారు.

రక్షా సూత్రం: ఇదివరకటి రోజులలో, ఎర్రటి పవిత్ర సూత్రాన్ని(దారాన్ని) , (ఇప్పుడు మనం రాఖీగా పిలుచుకునేది) సోదరి తన సోదరుని మణికట్టు చుట్టూ కట్టేది. కాలక్రమేణా, ఈ సూత్రం ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న రాఖీ రూపాన్ని సంతరించుకుంది. ఇది, రాఖీ ట్రేలో అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన వస్తువు. ఈ రక్షా సూత్రం లేదా ఆధునిక రాఖీ, సోదరునికి రక్షణ కల్పిస్తుంది.


మిఠాయిలు: సోదరునికి తీపిని తినిపించడం వలన, వారి మధ్య సంబంధం తీయగా ఉంటుందని నమ్మకం. ఇలా చేయడం వలన, సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమ బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. అంతేకాక, వారి ఇరువురి జీవితాలలో అదృష్టం మరియు శుభాలను తీసుకువస్తుంది.

English summary

Items To Keep On The Rakhi Tray

Raksha Bandhan is to be celebrated on August 26, 2018, and us sisters just can't wait for the moment to tie that sacred thread around the wrist of our brothers. But before that, you should make sure the right items have been kept on your rakhi tray to attract good luck in the life of your brother. Items To Include On Your Rakhi Tray
Desktop Bottom Promotion