For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jagannath Puri Rath Yatra 2022:పూరీ జగన్నాథుని విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా ఉంటాయంటే...!

|

మన భారతదేశంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథుని ఆలయం ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ఏడాది జులై మాసంలో 1వ తేదీ నుండి పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగనున్నాయి. ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడే జగన్నాథ ఆలయంలో శ్రీక్రిష్ణుడు జగన్నాథుని పేరిట కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. తనతో పాటు తన పెద్ద సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్ర ఉన్నారు. ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ప్రారంభమయ్యే ఈ రథయాత్రలో రథాన్ని ఏ యంత్రం లేదా జంతువులో లాగవు. కేవలం భక్తులు మాత్రమే లాగుతారు. అంతేకాదు ఇక్కడ జగన్నాథునితో పాటు బలరాముడు, సుభద్ర విగ్రహాలు ప్రతి సంవత్సరం కొత్త చెక్కతో తయారు చేస్తారు. ఈ మూడు విగ్రహాలు అసంపూర్తిగా ఉండటం ఆశ్చర్యకరం కాగా.. రెండో ఆలయ నీడ కూడా ఏర్పడదు. ఈ సందర్భంగా ఈ విగ్రహాలు ఎందుకని అసంపూర్ణంగా ఉన్నాయి. ఈ జగన్నాథ విగ్రహాలను ఎందుకు పూజిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పురాణాల ప్రకారం, ఇంద్రద్యుమ్న రాజు పూరీలో ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు, తను జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేసే పనిని శిల్పి విశ్వకర్మకు అప్పగించారు. విగ్రహాన్ని తయారు చేస్తున్న విశ్వకర్మ రాజు ఇంద్రద్యుమ్నుని ముందు తలుపులు వేసి విగ్రహాన్ని తయారు చేస్తానని, విగ్రహాలు చేసే వరకు ఎవరూ లోపలికి రాకూడదని షరతు విధించాడు. ఒకవేళ ఏదైనా కారణంతో ముందుగా తలుపు తీస్తే విగ్రహం తయారు చేయడం ఆపేస్తారు.

మూసిన తలుపు లోపల విగ్రహాల తయారీ పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు తలుపు వెలుపల నుండి విగ్రహాల తయారీ శబ్దం వింటూ ఉండేవాడు రాజు. ఒకరోజు రాజుగారికి లోపలి నుంచి ఎలాంటి గొంతు వినబడకపోవడంతో విశ్వకర్మ పని మానేసి వెళ్లిపోయాడని భావించాడు. ఆ తర్వాత తలుపు తెరిచి చూశాడు.

అంతే ఆక్షణం నుండి విశ్వకర్మ అక్కడి నుండి మాయమైపోయాడు. అప్పుడు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు అసంపూర్ణంగా కనిపించాయి. ఆనాటి నుంచి నేటి వరకు ఇక్కడ విగ్రహాలన్నీ ఈ రూపంలోనే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ ఇక్కడ భగవంతుడుని ఇదే రూపంలో పూజిస్తారు.

సాధారణంగా విరిగిన లేదా అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని పూజించడం హిందూ మతంలో అశుభమైనదిగా పరిగణిస్తారు. కానీ హిందువుల ఛార్ దామ్ లలో ఒకటైన పూరీలోని జగన్నాథుని విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

జగన్నాథుని రథయాత్ర ఎప్పుడంటే..
ప్రతి ఏడాది హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని రెండో రోజున నిర్వహిస్తారు. 2022లో జగన్నాథుడి రథయాత్ర జులై 01వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దేవశయని ఏకాదశి రోజున ఈ రథయాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత తొలిసారి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏడాది భక్తులకు అనుమతించే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ రథయాత్ర పది రోజుల పాటు కన్నులపండుగగా జరుగుతుంది. తలధ్వజ అని పిలువబడే బాలభద్ర రథం ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉంటుంది. మధ్యలో సుభద్ర రథం వెళ్తుంది. వీటినే దర్పదాలన లేదా పద్మ రథం అంటారు. చివరగా నంది ఘోష్ అని పిలువబడే జగన్నాథ ప్రభువు రథం కదులుతుంది. ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూసిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని, స్వేచ్ఛ లభిస్తుందని మరియు మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఇక్కడి రథయాత్రలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలను సిద్ధం చేస్తారు. అవి స్వచ్ఛమైన మరియు నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు. వీటిలో గోర్లు, ముళ్లు లేదా ఇతర లోహాలను ఉపయోగించరు. ఈ రథం మూడు రంగులలో ఉంటుంది. జగన్నాథుని రథం ఎత్తు 45 అడుగుల వరకు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు కేవలం పదిహేను రోజుల ముందు జగన్నాథుడు అనారోగ్యానికి గురయ్యాడని, ఆ దేవుడు కోలుకున్నతర్వాత ఈ ఊరేగింపు బయటకు వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

జగన్నాథుని రథయాత్ర ఎప్పుడంటే..

ప్రతి ఏడాది హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని రెండో రోజున నిర్వహిస్తారు. 2022లో జగన్నాథుడి రథయాత్ర జులై 01వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దేవశయని ఏకాదశి రోజున ఈ రథయాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత తొలిసారి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏడాది భక్తులకు అనుమతించే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ రథయాత్ర పది రోజుల పాటు కన్నులపండుగగా జరుగుతుంది.

English summary

Jagannath Rath Yatra 2022: Interesting Facts about famous chariot festival in Telugu

Here we are discussing about Jagannath Rath Yatra 2022: Interesting Facts about famous chariot festival in Telugu. Read on
Story first published: Friday, June 17, 2022, 9:30 [IST]
Desktop Bottom Promotion