Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Jaya Ekadashi 2022: జయ ఏకాదశి రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకోండి...
2022లో జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది, ఈ ఏకాదశి ప్రాముఖ్యత, వ్రతం మరియు ఉపవాస పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. 2022 సంవవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన అంటే శనివారం నాడు ఈ జయ ఏకాదశి వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జయ ఏకాదశి రోజున ప్రత్యేకమైన సంఘటనలు జరుగుతాయి. వాస్తవానికి ఏకాదశి తిథి నాడు మకరరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు కుజుడి కలయికతో మహాలక్ష్మీ యోగం కూడా ఏర్పడుతుంది.

అంతేకాదు శని గ్రహం కూడా సొంత రాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశులలో చాలా మందికి శుభఫలితాలొస్తాయి. ఇదిలా ఉండగా.. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ వ్రతాన్ని ఆచరిస్తే భూత, ప్రేత, పిశాచాల నుండి పూర్తి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు ఈరోజున ఉపవాసం ఉన్న వారు చనిపోయిన తర్వాత విముక్తి కూడా పొందుతారట. ఈ సందర్భంగా జయ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందాలంటే ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చేయకూడని పనులు..
* జయ ఏకాదశి రోజున ఆకులు, పూలు కోయరాదు.పూజకు ఒకరోజు ముందే వాటిని కోసి సిద్ధంగా ఉంచుకోవాలి.
* జయ ఏకాదశి రోజున దానం చేసిన ఆహారాన్ని అస్సలు తినకూడదు.
* జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారు ధాన్యాలు, ఎర్రని మిరపకాయలు, మసాలా వస్తువులను తినకూడదు.
* ఏకాదశి వ్రతం పాటించే వారు పాలకూర, అన్నం, తమలాపాకులు, క్యారెట్, బెండకాయ, క్యాబెజీ వంటి వాటిని తినకూడదు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని అనవసరంగా నిందలు మోసేలా చేస్తాయట.

వీటికి దూరంగా ఉండాలి..
* జయ ఏకాదశి వ్రతం చేసే వారు ఉపవాసానికి ముందు ఉల్లి, మాంసహారం, వెల్లుల్లి వంటివి తినకూడదు.
* జయ ఏకాదశి రోజున మీరు కోపం తెచ్చుకోకూడదు. ఆ వ్రతం చేసే వారి గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వారు చెడు మాటలు మాట్లాడరాదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వారు జుట్టు కట్ చేసుకోవడం, షేవింగ్ చేయడం, గోళ్లు కత్తరించుకోవడం వంటివి చేయకూడదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వేళ కుటుంబ సభ్యులు చీపురుతో శుభ్రం చేయడం వంటివి చేయరాదు.

చేయాల్సిన పనులు..
* జయ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. విష్ణుమూర్తిని ఆరాధించేందుకు ఈరోజంతా ఉపవాం ఉండాలి.
* జయ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి పూజలో పంచామ్రుతం మరియు తులసి ఆకులను సమర్పించాలి.
* జయ ఏకాదశి వంటి పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు యొక్క ఉపవాస కథను చదవండి.
* సూర్యోదయం తర్వాత ఏకాదశి ఉపవాసం ఉంటే.. ద్వాదశి రోజు ముగిసేలోపు పారాయాణం చేయాలి.
* ఇలా చేయడం వల్ల మీరు చేపట్టే పనులన్నింటిలో విజయం సాధిస్తారు.

ఇవి కూడా చేయండి..
* జయ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారు పండ్లను ఒక్కసారి మాత్రమే తినాలి.
* ఈరోజున ఎవరైనా పేదవారు దానం అడిగితే.. కాదనకుండా మీ సామర్థ్యం మేరకు.. మీకు తోచినంత దానం చేయండి.
* ఉపవాస సమయంలో దానం చేస్తే మీకు పుణ్య ఫలం వస్తుంది.
* జయ ఏకాదశి రోజున ఎవ్వరినీ నిరుత్సాహపరచకండి. మీ మాటలతో బాధపెట్టడం వంటివి చేయకండి.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. 2022 సంవవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన అంటే శనివారం నాడు ఈ జయ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
జయ ఏకాదశి రోజున ఈ పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున చేస్తే మీరు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* జయ ఏకాదశి రోజున ఆకులు, పూలు కోయరాదు.పూజకు ఒకరోజు ముందే వాటిని కోసి సిద్ధంగా ఉంచుకోవాలి.
* జయ ఏకాదశి రోజున దానం చేసిన ఆహారాన్ని అస్సలు తినకూడదు.
* జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారు ధాన్యాలు, ఎర్రని మిరపకాయలు, మసాలా వస్తువులను తినకూడదు.
* ఏకాదశి వ్రతం పాటించే వారు పాలకూర, అన్నం, తమలాపాకులు, క్యారెట్, బెండకాయ, క్యాబెజీ వంటి వాటిని తినకూడదు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని అనవసరంగా నిందలు మోసేలా చేస్తాయట.
* జయ ఏకాదశి వ్రతం చేసే వారు ఉపవాసానికి ముందు ఉల్లి, మాంసహారం, వెల్లుల్లి వంటివి తినకూడదు.
* జయ ఏకాదశి రోజున మీరు కోపం తెచ్చుకోకూడదు. ఆ వ్రతం చేసే వారి గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వారు చెడు మాటలు మాట్లాడరాదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వారు జుట్టు కట్ చేసుకోవడం, షేవింగ్ చేయడం, గోళ్లు కత్తరించుకోవడం వంటివి చేయకూడదు.
* జయ ఏకాదశి రోజున వ్రతం చేసే వేళ కుటుంబ సభ్యులు చీపురుతో శుభ్రం చేయడం వంటివి చేయరాదు.

Click it and Unblock the Notifications