ఈరోజు స్కంద షష్ఠి ఈరోజు ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం..భర్తకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.

Skanda Sashti స్కంద షష్టి అనేది ఈ హిందువుల జరుపుకునే పండగ. ఈ స్కందషష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. ఈ పండుగను దక్షిణ భారత దేశంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి. ప్రతి మాసంలో శుక్షపక్షంలో 6వ రోజు అనగా శుక్షపక్ష షష్టి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చెప్పబడినది. అందుకనే శుక్షపక్ష షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా పిలుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కుమార స్వామి, షణ్ముగ, కుమార స్వామి, మురుగన్, గుహుడు అని వివిధ రకాల పేర్లుతో పిలుచుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున నిష్టతో పూజచేయడం వల్ల సంతానం లేని వారు సంతానం పొందుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.ఇంకా ఈ రోజున నాగ దోషం, కుజదోషం ఉన్నవారు ఈ పండుగను జరుపుకుంటారు.

స్కంద షష్ఠిని సంతాన షష్ఠి లేదా కంద షష్ఠి అని కూడా అంటారు.కార్తికేయ, మురుగన్, సుబ్రహ్మణ్యం మొదలైన పేర్లతో కూడా పిలువబడే స్కంద భగవానుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు.సంతానం కలగాలని కోరుకునే వారు ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఇది కాకుండా ప్రజలు తమ పిల్లల సంతోషకరమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం స్కంద భగవానుని పూజిస్తారు.

July 2024 Skanda Sashti

సుబ్రహ్మణ్య స్వామిరికి తమిళనాట అనేక దేవాలయాలున్నాయి. వాటిలో తిరుత్తని, తిరుచందూరు, పళని, కర్ణాటకాలో కుక్కే , ఘాటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు బాగా ప్రసిద్ది చెందాయి. ఈ దేవాలయలకు కావడి మోస్తారు. మన ఆంధ్రాలో లేకపోయినా తమిళనాడులో ఇది బాగా ప్రసిద్ది చెందినది. షష్టి ఆదివారం చాలా ప్రత్యేకమైనది.

ఈ స్కంద షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల భార్య భర్తల మద్య గొడవలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెబుతారు. అంతే కాకుండా పిల్లలు దీర్ఘా ఆయుష్యును పొందడం కోసం, భర్త అపారమైన సంపదను పొందడానికి ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సకల శుభాలు జరుగుతాయి.

2024 ఆషాఢ మాసం శుక్ల పక్షం రోజున షష్ఠి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం..

July 2024 Skanda Sashti

2024 జూలై 11 గురువారు ఉదయం 10.04 నిముషాలకు శుక్షపక్ష షష్ఠి తేదీ మొదలై జూలై 12 శుక్రవారం మధ్యహ్నానం 12.33 నిముషాలకు ముగుస్తుంది. ఈ క్రమంలో జూలై 12 శుక్రవారం రోజున స్కందషష్ఠిని జరుపుకోవాలి.

స్కంద షష్ఠి పూజా విధానం
స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత ఉపవాసం ఉండాలని సంకల్పించుకోవాలి. పూజగదిలో శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్యస్వామివారి ఫోటో లేదా విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలి. తర్వాత దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. స్వామివారికి గంధం, అక్షత, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించండి. దేవుడికి నైవేద్యంగా పండ్లు మరియు పాలను సమర్పించవచ్చు. ఆ తర్వాత స్కంద షష్ఠి కథను చదవండి లేదా వినండి. చివరగా హారతి చేసి, తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. సాయంత్రం మరోసారి ఈ పద్ధతితో పూజించండి.

ఈ స్కందషష్ఠి రోజున భక్తులు స్కందపురాణం, స్కంద కవచం పఠించడం చాలా మంచిది. అంతే కాకుండా సుబ్రహ్మణ్య స్వామివారి కరాలంబవలి సూత్రం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతమాళి పఠించాలి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకోండి.

Desktop Bottom Promotion