Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
జ్యేష్ట మాసం జ్యేష్ఠ సంతానం జ్యేష్ఠ నక్షత్రం అన్నీ వేరు వేరు, జ్యేష్ఠ సంతానం ఈ విషయాలు తెలుసుకోవాలి
జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతాన వివాహం చేయవచ్చా, చేయకూడదా అని చాలా మంది సందేహపడుతుంటారు. ఈ మాసంలో సంప్రదాయం ప్రకారం, ముహూర్త శాస్త్ర ప్రకారం ఉన్న వివరణ ఏమిటో చూద్దాం. జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ పుత్రుని
జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతాన వివాహం చేయవచ్చా, చేయకూడదా అని చాలా మంది సందేహపడుతుంటారు. ఈ మాసంలో సంప్రదాయం ప్రకారం, ముహూర్త శాస్త్ర ప్రకారం ఉన్న వివరణ ఏమిటో చూద్దాం. జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ పుత్రుని, జ్యేష్ఠ పుత్రిక వివాహం చేయకూడదని చాలా మంది అంటారు. అసలు జ్యేష్ఠులు అంటే ఎవరో తెలుసుకుందాం. మొదట పుట్టిన పుత్రుడు కాని, పుత్రిక కాని జ్యేష్ఠ సంతానం అవుతారు. జ్యేష్ఠ అనేది గర్భానికి సంబంధించినదిగా పరిగణించాలి.

జ్యేష్ఠ సంతానం కాదు
గర్భస్రావమైనా, ప్రథమ సంతానం జీవించకపోయినా, తరువాతి సంతానం జ్యేష్ఠ సంతానం కాదు. అయితే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతానానికి ఇతర శుభకార్యాలు నిర్వహించడం కూడా శ్రేష్టం కాదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాగే జ్యేష్ఠ సంతానానికి జ్యేష్ఠ మాసంతో పాటు, మార్గశిర మాసం కూడా శుభకార్యాలకు మంచిది కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన, వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి వారు జన్మించిన మాసంలో జరుపకూడదు.

మినహాయింపులు కూడా ఉన్నాయి
జ్యేష్ఠ సంతానానికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదని ఉన్నా దానికి కొన్ని గ్రంథాల్లో మినహాయింపులు కూడా ఉన్నాయి. భరద్వాజ మహర్షి ప్రకారం జ్యేష్ఠ మాసంలో కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ఉండే పది రోజులు మినహాయించి మిగతా రోజుల్లో జ్యేష్ఠ సంతానానికి శుభకార్యాలు చేయవచ్చు. ముహుర్త గ్రంథాలను అనుసరించి మూడు జ్యేష్ఠలు నిషిద్ధం. వరుడూ, వధువు ఇరువురూ జ్యేష్ఠ సంతానమే అయితే జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయిన జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చు.

జ్యేష్ఠ నక్షత్రము
ఇక జ్యేష్ఠ నక్షత్రము కూడా ఉంది. నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము. జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు లేడి, స్త్రీ జాతి. జ్యేష్ఠ నక్షత్రము కలిగిన వధూవరులిద్దరూ జ్యేష్టులైనచో వారికి వివాహము నిశ్చయించరాదని శాస్త్రం చెబుతోంది.

పట్టుదల అధికం
జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదములో పుట్టినట్లయితే మీ మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. వీరికి పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.

కేతుదశ అనుకూలంగా ఉంటే
జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదములో పుట్టినవారికి
14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు.

కాస్త ఉపశమనం
21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో విద్య కంటే అలంకరణ, విలాసాల మీదకు మనసు మళ్లుతుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.

సమస్యలు ఎదురవ్వచ్చు
41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 64 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

శ్రమకు ఓర్చి పని చేయగలరు
జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదములో పుట్టిన వారికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది
జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదములో పుట్టిన వారికి పదేళ్ల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది. ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి.

త్వరగానే స్థిరపడతారు
జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదములో పుట్టిన వారికి జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 60 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

సులువుగా మార్చుకోరు
జ్యేష్ఠ నక్షత్ర మూడో పాదములో పుట్టిన వారు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.

కొంత ఉపశమనంకొంత ఉపశమనం కలుగుతుంది కలుగుతుంది
జ్యేష్ఠ నక్షత్ర మూడో పాదములో పుట్టిన వారు ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణగా విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. మాధ్యమిక విద్య నుంచి సుగమంగా సాగుతుంది. అయితే ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీదికి మనసు మళ్లుతుంది కాబట్టి.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు వెళ్లి విజయం సాధించాలి.

సకాలంలో వివాహం
జ్యేష్ఠ నక్షత్ర మూడో పాదములో పుట్టిన వారు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత కొంత సుఖం తగ్గినా 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.

మేధాసంపన్నులుగా ఉంటారు
జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదములో పుట్టిన వారి మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.

శుక్రదశ కారణంగా
రెండు సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి . 4వ తరగతి నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

31 సంవత్సరాల వరకు అభివృద్ధి
ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు మళ్లే అవకాశం ఉంటుంది కనుక.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.

అభిప్రాయాలు మార్చుకుంటారు
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన అన్ని పాదాల వారు కూడా సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు. చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి, లోపాలను ఎంచుకుంటారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. ఇక ఇతరుల నుంచి వచ్చే విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు.

తగిన వయసులో సంపాదన
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన అన్ని పాదాల వారికి శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. బాల్యం నుంచి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

పసుపు, నలుపు రంగులు
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన అన్ని పాదాల వారికి పసుపు, నలుపు రంగులు కలిసివస్తాయి. ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే సోమ, బుధవారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9వ సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు కూడా అన్ని విధాలా అనుకూలిస్తాయి. కానీ 4, 5, 6 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావు.



Click it and Unblock the Notifications











