Latest Updates
-
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా?
Jyeshtha Amavasya 2021: జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...
జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేకత మరియు విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. 2021లో జ్యేష్ఠ అమావాస్య రోజునే శని జయంతి, సూర్య గ్రహణం, సావిత్రి వ్రత పూజలు కూడా జరగనున్నాయి.

జ్యేష్ఠ అమావాస్య రోజున చాలా మంది ఉపవాసం ఉండటం.. దానం చేయడం.. దేవుళ్లకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ సంద్భంగా జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడొచ్చింది.. జ్యేష్ఠ అమావాస్య విశిష్ఠత ఏంటి.. ఈ అమవాస్య ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడంతో పాటు ఈ పవిత్రమైన రోజున ఏ పనులు చేయాలి.. ఏమి చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేకత..
హిందూ క్యాలెండర్ ప్రకారం, 2021లో జూన్ మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది జూన్ 10వ తేదీన ఏర్పడబోతోంది. ఈ అమావాస్యకు హిందూ మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజున జ్యేష్ఠ అమావాస్యతో పాటు శని జయంతి, సావిత్రి వ్రతం పూజలు కూడా జరగనున్నాయి. ఇది మాత్రమే కాదు ఈరోజునే తొలి సూర్యగ్రహణం కూడా జరగబోతోంది.

శని జయంతి..
హిందూ గ్రంథాల ప్రకారం.. జ్యేష్ఠ అమావాస్య రోజునే శని పుట్టినరోజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుడు చెడు కలిగిస్తాడని భావిస్తారు. కానీ శని జీవులలో కోపం, మెదడు పనితీరు మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడని అంటారు.

ఆంజనేయ ఆరాధన..
శని జయంతి రోజున హనుమంతుడి ఆరాధన వల్ల మంచి ఫలితం వస్తుందని పండితులు చెబుతారు. ఎందుకంటే కోపంగా ఉన్న శని దేవుడిపై హనుమంతుడు తేలికగా పట్టు సాధిస్తాడని నమ్ముతారు. అందుకే శనిని నియంత్రించడానికి ఆంజనేయుని ఆరాధన ఒక మార్గంగా భావిస్తారు. శని జయంతి రోజున శని ఆలయంలో శని మూర్తికి నూనె ఇవ్వడం కూడా తనను శాంతింపజేస్తుందని పండితులు చెబుతారు.

సూర్య భగవానుడికి నీరు..
జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఈరోజున సూర్య దేవునికి నీరు సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి కుండలో వేసి సూర్య భగవానుడికి అర్పించాలి. పేదలకు దానం చేయాలి.

ఇలా చేయకండి..
- జ్యేష్ఠ అమావాస్య రోజున మాంసాహారం తీసుకోవడం మరియు మద్యం సేవించడం వంటివి చేయకూడదు.
- ఈరోజున ఎవ్వరి నుండి డబ్బులు తీసుకోకూడదు.
- ఈరోజున కొత్త వస్తువులు కూడా కొనడం వంటివి చేయకూడదు.

ఇలా చేయండి..
- జ్యేష్ఠ అమావాస్య రోజున పీపాల్ చెట్టును ఆరాధించాలి.
- పీపాల్ చెట్టుకు ఒక దారాన్ని కట్టి, పచ్చి పాలను సమర్పించాలి.
- ఈ పవిత్రమైన రోజున గోమాత, శునకం మరియు కాకికి ఆహారం ఇవ్వాలి.
- ఈరోజున పూర్వీకులను పూజించాలి.
- నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications