For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యేష్ఠ పూర్ణిమను రైతుల పండుగ ఎందుకంటారో తెలుసా...

జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

|

హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు భూమి పూజ చేస్తారు.

Jyeshtha Purnima Vrat 2021:date, time, importance, vrat rituals and more about the day

అందుకే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అంటారు. మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం.

Jyeshtha Purnima Vrat 2021:date, time, importance, vrat rituals and more about the day

వ్యవసాయమే మన మనుగడకు జీవనాధారం.. వ్యవసాయం చేసే రైతులు పొలాల్లో దుక్కి దున్నడాన్ని 'ఏరువాక' అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని అర్థం. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సూర్యస్తమయం తర్వాత పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట.. చేస్తే సంపద కోల్పోతారట...!సూర్యస్తమయం తర్వాత పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట.. చేస్తే సంపద కోల్పోతారట...!

కాడెద్దులకు పూజలు..

కాడెద్దులకు పూజలు..

వర్ష రుతువు ఆరంభంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ రోజు అన్నదాతలు ఉదయాన్నే నిద్ర లేచి తమ కాడెద్దులను శుభ్రం చేసి వాటికి రంగులు పూసి, గజ్జలు, మెడలో గంటలతో అలంకరించి, వాటిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎద్దులకు భక్షాలు తినిపిస్తారు. అనంతరం పొలానికి వెళ్లి భూదేవికి పూజలు నిర్వహిస్తారు.

రోగాల బారిన పడకుండా..

రోగాల బారిన పడకుండా..

అనంతరం ఎద్దులకు రకరకాల రంగులు, కలర్ ఫుల్ బట్టలతో అలంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అలాగే ఎద్దులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

శుభ ఫలితాలు..

శుభ ఫలితాలు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు మొదలు పెట్టేందుకు మంచి నక్షత్రం జ్యేష్ఠ అని పండితులు చెబుతున్నారు. ఆ నక్షత్రంతో చంద్రుడు ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న సమయంలో ఏరువాక పూర్ణిమ శుభఫలితాలు అందుతాయి. అందుకే ఈరోజున తొలిసారి పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ణం అని, కన్నడంలో కారణి పబ్బం అని కూడా అంటారు.

వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ణంగా వివరించారు. సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం'.. ‘బీజవాపన మంగళ దివసం' ‘వాహన పుణ్ణాహ మంగళం' ‘కర్షణ పుణ్యహ మంగళం' అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెబుతారు.

ఏరువాక కథలు..

ఏరువాక కథలు..

హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండగ. శ్రీక్రిష్ణదేవరాయాల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుసుకుంది.

మర్రిచెట్టుకు పూజలు..

మర్రిచెట్టుకు పూజలు..

జ్యేష్ఠ మాసం రోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. వివాహం అయిన వారు ఈరోజు సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే వట వ్రుక్షానికి(మర్రి చెట్టుకు) పూజలు చేస్తారు. ఈ చెట్టుకు దారం చుడుతూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలొస్తాయట. అలాగే ఈరోజున వస్త్రదానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

English summary

Jyeshtha Purnima Vrat 2021:date, time, importance, vrat rituals and more about the day

Here we are talking about the jyeshtha purnima vrat 2021:Date, time, importance, vrat rituals and more about the day. Have a look
Desktop Bottom Promotion