For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kamika Ekadashi 2021: కామిక ఏకాదశి రోజున దీపారాధన ఇలా చేస్తే.. గత జన్మలో పాపాలు కూడా తొలగిపోతాయట...!

కామిక ఏకాదశి పూజా విధానం, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం.. తెలుగు క్యాలెండర్లో అన్ని ఏకాదశి తేదీలు ముఖ్యమైనవిగా చెబుతారు. వీటిని విష్ణు దేవునికి అంకితమిచ్చారు. ప్రతి నెలా ఏకాదశి విధిగా వస్తుంది.

Kamika Ekadashi 2021: Date, Puja Muhurat, Vrat Vidhi and Significance in Telugu

ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షం ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి సమయంలో మనసులో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

Kamika Ekadashi 2021: Date, Puja Muhurat, Vrat Vidhi and Significance in Telugu

అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీన్ని విశేషంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా కామిక ఏకాదశి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? ఈ వత్రం కథ తెలుసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Shravan Month 2021:శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి... మరి ఏ పనులు చేయాలంటే...!Shravan Month 2021:శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి... మరి ఏ పనులు చేయాలంటే...!

కామిక ఏకాదశి ముహుర్తం..

కామిక ఏకాదశి ముహుర్తం..

కామిక ఏకాదశి 2021 సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:59 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి 5వ తేదీ ఉదయం 5:45 నుండి 8:26 గంటలకు ముగుస్తుంది.

కామిక ఏకాదశి ప్రాముఖ్యత..

కామిక ఏకాదశి ప్రాముఖ్యత..

కామిక ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను శ్రీక్రిష్ణుడు స్వయంగా వివరించాడని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఎవరైనా తమ పాపాల నుండి విముక్తిని పొందడానికి ఈరోజున ఉపవాసం ఉండటం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. సాధారణంగా ప్రతి ఏకాదశికి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.

ఉపవాసం, ఆరాధన పద్ధతి..

ఉపవాసం, ఆరాధన పద్ధతి..

కామిక ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి. గంగాజలంతో ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేయాలి. శ్రీహారికి పాలు, పంచామ్రుతం, ఐదు రకాల పండ్లు, పసుపు, పువ్వులు, నువ్వులు మొదలైన వాటిని సమర్పించాలి. అనంతరం బ్రాహ్మాణులకు ఆహారం సమర్పించాలి. ఇది మీకు వీలు కాకపోతే నిరుపేదలకు మీ సామర్థ్యం మేరకు దానం చేయండి. మీరు ఏకాదశి పూజలో కచ్చితం విష్ణు సహస్రనామం తప్పకుండా పఠించాలి.

Shiva Puja:శివుడికి పొరపాటున కూడా ఈ వస్తువులతో పూజ చేయకూడదు... ఎందుకో తెలుసా...Shiva Puja:శివుడికి పొరపాటున కూడా ఈ వస్తువులతో పూజ చేయకూడదు... ఎందుకో తెలుసా...

కామిక ఏకాదశి కథ..

కామిక ఏకాదశి కథ..

పురాణాల ప్రకారం.. ధర్మవర్తనుడైన యుధిష్టిరుడు శ్రీక్రిష్ణున్ని ‘ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా' అందుకు వాసుదేవుడు సంతోషించాడు. ‘ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా ఒక పుణ్యకార్యమే. ఒకరోజు నారద మహర్షి కమలంపై సేద తీరుతున్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు. ‘ఆషాఢ క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వివరించండి. ఆరోజున అధి దేవత ఎవరు, వ్రతమును ఆచరించాల్సిన విధి విధానం గురించి తెలపండి' అని కోరారట.

ఏకాదశి మహిమ..

ఏకాదశి మహిమ..

కామిక ఏకాదశి విన్న వారికి అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు తామర పాదాలు కలిగి ఉన్న శ్రీధరుడు, హరి, మహా విష్ణువు, మాధవుడు అనే పేర్లతో పిలువబడే శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

పుణ్యఫలం..

పుణ్యఫలం..

కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయంలో ఉండే కేదరనాథుని దర్శనం కన్నా, సూర్య గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూలోకాన్ని దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమిరోజు, సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా ఎక్కువ' అని వివరించారట.

August 2021:శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో చూసెయ్యండి...August 2021:శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో చూసెయ్యండి...

గోవులను దానం..

గోవులను దానం..

కామిక ఏకాదశి రోజున గోవులను దానం చేయడం, గోమాతకు గ్రాసం వంటివి కలిపి ఇవ్వడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందట. ఇలా చేయడం వల్ల గతంలో చేసిన పాపాల నుండి కచ్చితంగా విముక్తి లభిస్తుందట. మీరు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో ఏ వ్రతాన్ని చేసి మోక్షాన్ని కూడా పొందొచ్చు. అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పటికీ యమ ధర్మరాజు కోపానికి గురికారట. కాబట్టి ఈ వ్రతాన్ని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి.

తులసి ఆకులతో..

తులసి ఆకులతో..

కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో శ్రీ మహా విష్ణువును ఆరాధించడం వల్ల వచ్చే పుణ్యం, బంగారం, వెండి, దానం చేస్తే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకులతో హరి భగవానుడిని పూజిస్తే ముత్యాలు, పుష్పరాగములు, వజ్రాలు, నీలంలతో పూజించిన దాని కన్నా ఎక్కువ సంతోషిస్తాడని పండితులు చెబుతారు. ఇలా లేత తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయట. కామిక ఏకాదశి రోజున నువ్వులు మరియు నేతి దీపాలతో ఎవరైతే విష్ణువును ఆరాధిస్తారో.. వారికి ప్రత్యేక ఫలితాలు వస్తాయట.

English summary

Kamika Ekadashi 2021: Date, Puja Muhurat, Vrat Vidhi and Significance in Telugu

Here we are talking about the Kamika Ekadashi 2021:date, puja muhurat, vrat vidhi and significance in Telugu. Read on
Story first published:Wednesday, August 4, 2021, 14:58 [IST]
Desktop Bottom Promotion