For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిరిసంపదలు పొందాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా పఠించాల్సిన కనకధార స్త్రోత్రం..!

By Lekhaka
|

లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి.

కనకథారా స్తోత్రం లేదా కనకథారా స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటి.

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya

ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంక రాచా ర్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేవు. ఇంటి ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇళ్ళంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము ఛెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి.

కనకథారా స్తోత్రం లేదా కనకథారా స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటి.

సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల, స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో, నియమ నిష్ఠలతో పారాయణం చేయాలి. ఫలితాన్ని ఆశించినవారు సాధారణంగా పెద్దల సలహాను తీసికొని, రోజుకు ఇన్నిమార్లు, ఇన్ని రోజులు అని పారాయణ చేస్తారు. స్తోత్రానికి ముందుగా ప్రార్థన, పూజ వంటి కార్యక్రమాలు, స్తోత్రం అనంతరం నైవేద్యం, హారతి, తీర్ధ ప్రసాద వితరణ వంటి ఉపచారాలు చేస్తారు. దేవాలయాలలో అర్చనలో కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తారు.

మొత్తం స్తోత్రంలో 25 శ్లోకాలున్నాయి. ఇందులో మొదటిది ("అమందానంద...") హయగ్రీవ స్తోత్రం. చివరిది ("సువర్ణ ధారా...) ఫలశ్రుతి. ఈ రెంటినీ మినహాయిస్తే 23 శ్లోకాలు.

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya

వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్,

అమందానందసందోహం బంధురం సింధురాననం.

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ,

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్,

అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా,

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః.

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః,

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని,

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా,

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః .

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్,

ఆనందకందమనిమేషమనంగతంత్రమ్,

ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం,

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః .

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా,

హారావళీవ హరినీలమయీ విభాతి,

కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా,

కళ్యాణమావహతు మే కమలాలయాయాః .

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః,

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ,

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః,

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః .

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్,

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన,

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం,

మందాలసం చ మకరాలయకన్యకాయాః.

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం

ఆనంద హేతు రధికం మధు విష్వోపి

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం,

ఇందీవరోదరసహోదరమిందిరాయాః.

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర,

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ,

దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం,

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః.

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా,

మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ,

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం,

నారాయణప్రణయినీనయనాంబువాహః.

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి,

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ,

సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై,

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై .

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై,

రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై,

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై,

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై.

నమోస్తు నాళీకనిభాననాయై,

నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ,

నమోస్తు సోమామృతసోదరాయై,

నమోస్తు నారాయణవల్లభాయై,

నమోస్తు హేమాంబుజపీఠికాయై,

నమోస్తు భూమండలనాయికాయై ,

నమోస్తు దేవాదిదయాపరాయై,

నమోస్తు శార్ఙ్గాయుధవల్లభాయై.

నమోస్తు దేవ్యై భృగునందనాయై,

నమోస్తు విష్ణోరురసిస్థితాయై,

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై,

నమోస్తు దామోదరవల్లభాయై.

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై,

నమోస్తు భూత్యై భువనప్రసూత్యై,

నమోస్తు దేవాదిభిరర్చితాయై,

నమోస్తు నందాత్మజవల్లభాయై .

సంపత్కరాణి సకలేంద్రియనందనాని,

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి,

త్వద్వందనాని దురితాహరణోద్యతాని,

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే.

యత్కటాక్షసముపాసనావిధిః,

సేవకస్య సకలార్థసంపదః,

సంతనోతి వచనాంగమానసైః,

త్వాం మురారిహృదయేశ్వరీం భజే .

సరసిజనిలయే సరోజహస్తే,

ధవళతమాంశుకగంధమాల్యశోభే,

భగవతి హరివల్లభే మనోజ్ఞే,

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్.

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట,

స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్,

ప్రాతర్నమామి జగతాం జననీమశేష,

లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్.

కమలే కమలాక్షవల్లభే త్వం,

కరుణాపూరతరంగితైరపాంగైః,

అవలోకయ మామకించనానాం,

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః.

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః,

కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే,

దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్,

ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః.

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం,

త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్,

గుణాధికా గురుతరభాగ్యభాగినో,

భవంతి తే భువి బుధభావితాశయాః.

English summary

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya

Kanakadhara Stotram To Chant On Akshaya Tritiya,Goddess Lakshmi bestows wealth, prosperity and happiness on the one who prays to her with a mind free of prejudice and other unholy thoughts. Worshipping her on Akshaya Tritiya is all the more auspicious. Kanakadhara Stotram is an excellent hymn to chant on Aksh
Story first published: Thursday, April 27, 2017, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more