For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా ఎలా మారిందో అందులో చూపించనున్నారు!21 ఏళ్ల వయస్సులో తన అనుభవాలు అవే

By Staff
|

పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. సన్నీ మంత్ర జపం చేసే ఎంతో మంది మగరాయుళ్లూ వున్నారు. ఈ అమ్మడు క్రేజ్ అలా ఉంది మరి.

కెనడియన్ బ్యూటీ

కెనడియన్ బ్యూటీ

అయితే పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి పాపులర్ స్టార్‌గా ఎదిగిన సుందరి సన్నీ లియోన్. ఈ సంచలన కెనడియన్ బ్యూటీపై ఇప్పుడు బయోపిక్ రూపొందుతోంది. తాజాగా సన్నీబయోపిక్ ట్రైలర్ రిలీజైంది. ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలో ఇప్పుడు అందాల సుందరి సన్నీలియోన్ జీవితం కూడా ఆన్ స్క్రీన్‌పై అలరించబోతోంది.

సన్నీలియోన్ పేరు కరణ్ జిత్ కౌర్

సన్నీలియోన్ పేరు కరణ్ జిత్ కౌర్

భారత సంతతికి చెందిన ఈ కెనడియన్ బ్యూటీ అసలు పేరు 'కరణ్ జిత్ కౌర్'. ఇప్పుడు ఆ పేరుతోనే సన్నీ బయోపిక్ రూపొందుతోంది. అసలు సన్నీలియోన్ పోర్న్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సన్నీ ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? ఆ తర్వాత పోర్న్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీకి సన్నీ రావడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి విశేషాలన్నీ ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారట. అయితే సన్నీ జీవితం వెండితెరపై రావడం లేదు. వెబ్ సిరీస్‌గా ఆన్‌లైన్‌లో అలరించనుంది.

కరణ్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్

కరణ్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్

'కరణ్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్' పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో సన్నీ లియోనే తన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో యంగ్ సన్నీలియోన్‌గా రైసా ఎక్స్ అనే అమ్మాయి కనిపించబోతుండగా సన్నీ భర్త డానియల్ వెబర్ పాత్రలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ నటిస్తున్నాడు. జీ5 ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా త్వరలోనే ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్‌ను చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

విమర్శలు తప్పవని హెచ్చరించారు

విమర్శలు తప్పవని హెచ్చరించారు

సన్నీలియోన్ జీవిత చరిత్ర తెరకెక్కే సందర్భంలో సన్నీ లియోన్ ఒకసారి మాట్లాడారు. తాను ఇండియా వెళ్తున్నానంటే చాలామంది పెదవి విరిచారని, ఇక విమర్శలు తప్పవని హెచ్చరించారని పేర్కొంది. అయితే అది నిజం కాదని, తనకు 21 ఏళ్లు వచ్చినప్పటి నుంచే ఇటువంటివి ఎదురయ్యాయని తెలిపింది. అవమానిస్తూ, విమర్శిస్తూ మెయిల్స్ రావడం అప్పుడే మొదలైందని సన్నీలియోన్ వివరించింది.

ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని

ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని

చాలా కుటుంబాల్లోలా తమ కుటుంబంలో కూడా కోపం, ద్వేషం, ప్రేమ, ఉద్వేగభరిత క్షణాలు ఉండేవని సన్నీ పేర్కొంది. చెడు మార్గంలోకి మళ్లకుండా తనను, తన సోదరుడిని తండ్రి తనకు చేతైనంతగా కాపాడరని వివరించింది. అయితే, 21 ఏళ్లు వచ్చే సరికి ప్రజలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడం మొదలు పెడతారని, అది చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుందని సన్నీ ఆవేదన వ్యక్తం చేసింది. తానైతే ఒక్కోసారి ఏడ్చేసేదానినని పేర్కొంది.

బిగ్ బాస్ షో ద్వారానే

బిగ్ బాస్ షో ద్వారానే

గతంలో సన్నీలియోన్ సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌' షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ఈ షో ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో ‘పోర్న్‌స్టార్‌' ఇమేజ్‌ నుంచి బయటపడగలిగారు.

ఒళ్లు కనిపించేలా ఫొటో షూట్లు

ఒళ్లు కనిపించేలా ఫొటో షూట్లు

ఇక సన్నీలియోన్ కరణ్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. సన్నీకి మేకప్‌ వేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత చిన్నతనం నుంచి ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూపించారు. మోడలింగ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం, దాని కోసం ఒళ్లు కనిపించేలా ఫొటో షూట్లు ఇవ్వడం, సన్నీ చేసే పనులు నచ్చక ఆమె తల్లిదండ్రులు తిట్టడం వంటివి చూపించారు. ఓ ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ద్వారా

ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ద్వారా

సన్నీలియన్ బయోపిక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ద్వారా జులై16 నుంచి ఈ సిరీస్‌ ప్రసారం కానుంది.కరెన్‌జిత్ కౌర్‌గా ఓ సాధారణ మధ్యతరగతి సిక్కు కుటుంబంలో కెనడాలో జన్మించిన అమ్మాయి సన్నీ లియోన్‌గా ఎలా మారిందో ఇందులో చూపించనున్నారు. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎలా ఎదిగిందో కళ్లకు కట్టనున్నారు.

జిస్మ్-2 చిత్రంలో హాట్ పెర్ఫార్మెన్స్‌తో

జిస్మ్-2 చిత్రంలో హాట్ పెర్ఫార్మెన్స్‌తో

పోర్న్ స్టార్‌గా పాశ్చాత్య దేశాల్లో ఓ వెలుగు వెలిగిన ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ బిగ్ బాస్ షో తర్వాత బూతు కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. తర్వాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. జిస్మ్-2 చిత్రంలో హాట్ పెర్ఫార్మెన్స్‌తో సన్నీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. పలు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడంతో పాటు వ్యాపార ప్రకటనలకు ప్రచారం చేసే అవకాశాలతో ఈ అమ్మడు ఇప్పుడు చాలా బిజీగా ఉంది.

ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంది

ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంది

ఆ మధ్య సన్నీ లియోన్ తన పిల్లల కెరీర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన పిల్లలు తనలా తయారు కాకూడదని, తాను ఎదుర్కొన్న కష్టాలు తన పిల్లలు పడకూడదని అంటోంది. సన్నీలియోన్ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంది. వీరి కెరీర్‌ గురించి సన్నీ లియోన్ స్పందిస్తూ, మన జీవితంలో ఏం జరిగినా ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పిల్లలు ఎదుర్కోకూడదని చెప్పింది.

ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌‌లు పంపేవారు

ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌‌లు పంపేవారు

స్వేచ్ఛగా, ఎదుటివారిని బాధపెట్టకుండా, వారు ఎంచుకున్న రంగాలను తాను ఇష్టపడినా, పడకున్నా... వారు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. అలాగే, తన జీవితంలో జరిగిన అనేక ఒడిదుడుకులను కూడా ఆమె వెల్లడించింది. 21 ఏళ్ల వయసులో తనను ద్వేషిస్తూ ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌‌లు పంపేవారని గుర్తు చేసుకుంది. ఏ దేశానికి చెందిన వారు అన్నది పక్కన పెడితే సమాజం ధోరణి అలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వయసులో అలాంటి అసభ్య పదాలు జీవితంపై చాలా ప్రభావం చూపుతాయని చెప్పింది.

చాలా కుంగిపోయేదాన్ని

చాలా కుంగిపోయేదాన్ని

తనను బాధపెడుతూ వచ్చే ఈ మెయిల్స్, మెసేజ్‌లను చూసి తాను లోలోపల చాలా కుంగిపోయానని తెలిపింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులే అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. వాస్తవానికి వారికి ఇష్టం లేని రంగం ఎంచుకున్నప్పటికీ వారు తనకు అండగా నిలిచారని తెలిపింది. అందుకే తన జీవితం ఎలా ఉన్నా ప్రేమిస్తానని తెలిపింది. ఇక సన్నీ లియోన్ అభిమానులంతా ఆ వెబ్ సిరీస్ చూడడానికి వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నారు.

English summary

karenjit kaur the untold story of sunny leone reveals the journey of a girl next door to a porn star

karenjit kaur the untold story of sunny leone reveals the journey of a girl next door to a porn star