For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Karka Sankranti 2021: కర్కాటకంలోకి సూర్యుడి సంచారం ఎప్పుడంటే...

కర్కా సంక్రాంతి యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. ఈ సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి మారే సమయాన్ని సంక్రాంతి అంటారు. ఈ సంవత్సరంలో మొత్తం 12 సంక్రాంతిలు ఉన్నాయి.

Karka Sankranti 2021 date, Shubh Muhurat, History and Significance in Telugu

అయితే వీటిలో మేషం, తుల, కర్కాటకం మరియు మకర సంక్రాంతిగా ప్రధానమైనవిగా పరిగణించబడుతున్నాయి. మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాయాణంలో ప్రయణిస్తాడు.

Karka Sankranti 2021 date, Shubh Muhurat, History and Significance in Telugu

కర్కాటక సంక్రాంతి వేళ దక్షిణయాణంలో సంచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో సూర్యుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కర్కాటక సంక్రాంతి ఎప్పుడు జరుగుతుంది.. శుభ సమయమేంటి? దీని యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

జగన్నాథుని ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే...!జగన్నాథుని ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే...!

జులై 16న

జులై 16న

హిందూ పురాణాల ప్రకారం, ఆషాడ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఇదే నెలలో చాతుర్మస వ్రతం, కామికా ఏకాదశి, కర్కాటక సంక్రాంతి వంటివి ప్రారంభమవుతాయి. ఈ నెల అంటే జులై 16వ తేదీన శుక్రవారం నాడు సూర్యుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయాన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. దీన్నే దక్షిణయాణం అని కూడా పిలుస్తారు.

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

కర్కాటక సంక్రాంతి శుభ ముహుర్తం 2021 సంవత్సరంలో జులై 16వ తేదీన అంటే శుక్రవారం నాడు ఉదయం పుణ్య కాలం 5:34 నుండి సాయంత్రం 5:09 గంటల వరకు ఉంటుది. అంటే సుమారు 11 గంటల 35 నిమిషాల పాటు ఉంటుంది. కర్కాటక సంక్రాంతి మహా పుణ్య కాలం : మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 5:09 గంటల వరకు అంటే సుమారు 2 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. సూర్యుని రవాణా జులై 16వ తేదీ సాయంత్రం 4:41 గంటలకు ప్రారంభమవుతుంది. మిధునం నుండి కర్కాటకలోకి సంచారం చేసిన తర్వాత అక్కడే ఆగస్టు 17వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

నాలుగు నెలలు..

నాలుగు నెలలు..

కర్కాటక సంక్రాంతి సమయంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణయాణం సుమారు నాలుగు పదవీకాలాల పాటు ఉంటుంది. ఇది మకర సంక్రాంతి వేడుకతో ముగుస్తుంది. ఈ సమయంలో ద్వాదశ రాశి చక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు.

Ashada Amavasya 2021: ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది... బోనాలు ప్రారంభం అప్పుడేనా?Ashada Amavasya 2021: ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది... బోనాలు ప్రారంభం అప్పుడేనా?

ఈ పనులు చేయాలి..

ఈ పనులు చేయాలి..

సూర్యుడు మిధునం నుండి కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. భక్తులు సూర్య సంక్రాంతి సమయంలో విష్ణువు, సూర్యుడు, శివుడిని పూజించాలి. సూర్య భగవానుడి మంత్రాన్ని ‘ఓం ఆదిత్యాయ నమః' 108 సార్లు జపించాలి. అలాగే రావి చెట్టును లేదా మర్రి చెట్టును నాటాలి. మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి.

కర్కాటక సంక్రాంతి చరిత్ర..

కర్కాటక సంక్రాంతి చరిత్ర..

హిందూ పురాణాల ప్రకారం కర్కాటక సంక్రాంతి సమయంలో అంటే దక్షిణ యాణంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఇదే సమయంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులు కర్కాటక సంక్రాంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పిత్రు దేవతలను ఈ సమయంలో పూజిస్తే వారికి ప్రశాంతతకు దొరుకుతుందని చాలా మంది నమ్మకం.

English summary

Karka Sankranti 2021 date, Shubh Muhurat, History and Significance in Telugu

Here we are talking about the karka sankranti 2021 date, shubh muhurat, history and significance in Telugu. Read on
Story first published:Friday, July 9, 2021, 16:16 [IST]
Desktop Bottom Promotion