Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ కార్తీకమాసంలో ఇలా చేయకపోతే.. మీకు అన్నీ కష్టాలే.. ఎందుకంటే!
ఇది కార్తీకమాసం. కార్తీక మాసం అంటేనే పూజల మాసం. శివుడు, విష్ణువుకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ నెలలో భక్తి శ్రద్ధలతో వారిద్దరికీ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తులసి కోటను పూజించి కొన్ని నివారణ కార్యక్రమాలు చేస్తే సిరి సంపదలు, ఆయుష్ ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.
అయితే చాలా మందికి తులసి కోటను ఎలా పూజించాలి, ఏ విధమైన నివారణ చర్యలు చేయాలి అనేది తెలియదు. అందుకే ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం కలుగుతుంది, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తులసికి చేయాల్సిన నివారణలు
> కార్తీక మాసంలో తులసి పూజ అనేది చాలా ప్రత్యేకం. అందుకే ప్రతీరోజు తులసి మొక్కకు నీరు పోయాలి. అలాగే రోజూ సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. లక్ష్మీ దేవి మీ పూజకు సంతోషించి మీ ఇంట్లో సుఖసంతోషాలు కలిగిస్తుందని భక్తుల నమ్మకం.

> కార్తీక మాసంలో లక్ష్మి దేవికి ప్రతిరోజూ పచ్చిపాలు, గంగాజలం సమర్పించాలి. ఇలా సమర్పించడం వల్ల.. లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుందని, అలాగే అలా సమర్పించే వారికి డబ్బుల కొరత లేకుండా చేస్తుందని పేర్కొంటున్నారు.
> కార్తీక మాసంలో ప్రధానంగా శివుడితో పాటు విష్ణుడిని కూడా పూజిస్తారు. విష్ణువు పూజలో తులసి నైవేద్యం అనేది తప్పనిసరి. ఎందుకంటే విష్ణువుకు తులసి అనేది చాలా ఇష్టమైన నైవేద్యం. అందుకే విష్ణువు పూజలు తులసి నైవేద్యం లేకపోతే ఆ పూజ అసంపూర్ణమైనదని భావిస్తుంటారు. కాబట్టి ఈసారి పూజలో విష్ణువుకు తులసి దళాలను ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది
> కార్తీకమాసంలో తులసికి పూజలతో పాటు ప్రదిక్షణలు కూడా చేయాలి. తులసి కోటకు పూజ చేసిన తరువాత 7, 11, 21, 51, 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఆ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని, జీవితంలో మార్పులు వస్తాయని ప్రతీతి
> కార్తీకమాసంలో తులసికి చేయాల్సిన నివారణ కార్యక్రమాల్లో తులసి వివాహం కూడా ఒకటి. కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసికి వివాహం జరిపించి.. గాజులు, కుంకుమ, పసుపు, కాలి మెట్టెలు, ఇతర వివాహ వస్తువులను సమర్పించాలి. దీంతోపాటు తులసి కోటకు ఎర్రటి చునారీని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భక్తులు నమ్ముతారు.
వీటితో పాటు తులసికి చేయాల్సిన కొన్ని పూజలు కూడా క్రమం తప్పకుండా చేస్తే, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే మీ అందరికీ కార్తీకమాసం శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ లక్ష్మీ దేవి కరుణ, అనుగ్రహం మీపై ఉండాలని ఆ లక్ష్మీమాతను బోల్డ్ స్కై తరుపున వేడుకుంటున్నాం.



Click it and Unblock the Notifications