For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartik Month 2021:కార్తీక మాసంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదట...!

కార్తీక మాసంలో ఆహారం విషయంలో పాటించాల్సిన పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసాన్నే దామోదర మాసం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఈ మాసం తపస్సు చేయడానికి ఉత్తమమైన సమయం. తెలుగు నెలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.

Kartik Month 2021: food rules to follow in the month of Kartik in Telugu

ఈ మాసంలో శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నెలలో పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, మారేడు దళాలు సమర్పిస్తే శివుని కటాక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాంటి కార్తీక మాసం ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమైంది.

Kartik Month 2021: food rules to follow in the month of Kartik in Telugu

ఇది వచ్చే నెల నవంబర్ 19వ తేదీతో ముగుస్తుంది. ఈ కాలంలో హిందువులు ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మహాలక్ష్మీ పూజ చేస్తారు.. మరికొన్ని ప్రాంతాల్లో కుభేరుడిని పూజిస్తారు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో గౌరీ వ్రతం మరియు గౌరీ నోములు వంటి పండుగను చేస్తారు.

Kartik Month 2021: food rules to follow in the month of Kartik in Telugu

ఈ పవిత్రమైన మాసంలో అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, పవిత్ర గ్రంథాలలో సూచించిన విధంగా అందరూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు తమ ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాబోయే చలికాలం కాబట్టి.. ఈ సీజన్లో మీరు ఇలాంటి ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదట.. ఇంతకీ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎటువంటి తీసుకోకూడదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

పాల ఉత్పత్తులు..

పాల ఉత్పత్తులు..

కార్తీక మాసంలో శరీరంలోని శక్తి స్థాయిని మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మీరు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో పంచదారకు బదులు 50 గ్రాముల బెల్లం వేసుకుని తింటే.. మీరు చాలా బలంగా మారతారు. కాబట్టి ఈ నెలలో ప్రతిరోజూ ఓ గ్లాసు పాలను తీసుకోండి.

బెల్లం తీసుకోండి..

బెల్లం తీసుకోండి..

కార్తీక మాసంలో మీ శరీరాన్ని సాధ్యమైనంత మేరకు వెచ్చగా ఉంచాలి. అందుకోసం మీరు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఇది మీ బాడీని వెచ్చగా ఉంచడంలో మరియు బిపి వంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల కాలానుగుణంగా వచ్చే దగ్గు మరియు జలుబు నుండి బాడీని సురక్షితంగా ఉంచడానికి ఈ నెలలో బెల్లం ప్రతిరోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు.

నల్ల ఉప్పు వాడండి..

నల్ల ఉప్పు వాడండి..

కార్తీక మాసంలోనే వాతావరణంలో మార్పులు జరుగుతాయి కాబట్టి.. మీరు రాత్రి వేళ నల్ల ఉప్పు మరియు రాతి ఉప్పు మిశ్రమాన్ని తయారు చేసి, వాటిని కొద్ది కొద్దిగా తీసుకోండి. ఇది మీ బాడీలో అసిడిటీని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నిరంతరం బర్ఫింగును కూడా నియంత్రిస్తుంది.

Dhanteras 2021:ధన త్రయోదశి విశిష్టతలేంటో తెలుసుకుందామా...Dhanteras 2021:ధన త్రయోదశి విశిష్టతలేంటో తెలుసుకుందామా...

గోధుమ పిండి హల్వా..

గోధుమ పిండి హల్వా..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గోధుమ పిండి హల్వాను భోగ్ గా తయారు చేస్తారు. ఈ కాలంలో గోధుమ హల్వా తీసుకోవడం వల్ల మీ బాడీ అనారోగ్యానికి గురి కాకుండా చాలా సురక్షితంగా ఉండే రక్షణ కవచంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోధుమపిండితో పాటు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మరియు ఎండు ద్రాక్షతో తయారు చేసిన ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల మీ బాడీ వెచ్చగా మరియు సురక్షితంగా ఉండటంలో సహాయపడుతుంది.

తులసి ఆకులను వాడండి..

తులసి ఆకులను వాడండి..

కార్తీక మాసంలో చాలా మంది తులసి మొక్కలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇది కాలుష్య రహితం కాబట్టి.. వీటి తాజా ఆకులను ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచించారు. వాతావరణంలో మార్పుల కారణంగా, దూళి-కణాలు మరియు బ్యాక్టీరియా ఆహారాన్ని సులభంగా కలుషితం చేస్తాయని మరియు తులసి ఆకులను ఉపయోగించడం వల్ల వాటిని సురక్షితంగా వినియోగించొచ్చు.

కూల్ వాటర్ వద్దు..

కూల్ వాటర్ వద్దు..

పవిత్రమైన కార్తీక మసంలోనే చలికాలం ప్రారంభమవుతుంది. కాబట్టి వాతావరణంలో కూడా మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మీరు కూల్ వాటర్ వంటి వాటిని తీసుకోవద్దు. అలాగే రిఫ్రిజరేటర్లోని చల్లని పదార్థాలను కూడా వాడటం తగ్గించండి. ఎందుకంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు రావొచ్చు. ఆస్తమాతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయంలో చల్లని నీటిని పూర్తిగా దూరంగా ఉండాలి.

ఉల్లి, వెల్లుల్లి తినొద్దు..

ఉల్లి, వెల్లుల్లి తినొద్దు..

ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను తీసుకోకూడదట. అలాగే మద్యం, మాంసం వంటి వాటిని నివారించాలి. అలాగే ఈ కాలంలో పొట్లకాయను తినడం వంటివి చేయొద్దు. ఈ సమయంలో ఈ పండు పక్వానికి వస్తుంది. కాబట్టి వీటిని ఈ కాలంలో ఎక్కువగా తినడం వల్ల ఇందులోని విత్తనాల్లో బ్యాక్టీరియా డెవలప్ చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చేదు గుమ్మడికాయను తినడం వల్ల ఆహారం విషంగా మారి.. ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

FAQ's
  • కార్తీక మాసం దేనికి ప్రసిద్ధి?

    హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం దీపావళి పండుగకు ప్రసిద్ధి. అలాగే ఈ నెలలో వనభోజనాలు కూడా ప్రముఖంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ నెలలో పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

English summary

Kartik Month 2021: food rules to follow in the month of Kartik in Telugu

Here we are talking about the kartik month 2021: food rituals to follow in the month of kartik in Telugu. Have a look
Desktop Bottom Promotion