For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartik Month 2021: కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...

కార్తీక మాసం 2021 సందర్భంగా.. ఈ మాసం ఎందుకని పవిత్రమైనదో.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం అశ్వీయుజ మాసం బహుళ అమావాస్య దీపావళి పండుగ తర్వాతి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

Kartik Month 2021: Reasons why Kartik month is the holiest month

హిందూ పురాణాల ప్రకారం ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందులోనూ కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో భక్తులందరూ పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ నెలలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది.

Kartik Month 2021: Reasons why Kartik month is the holiest month

అన్ని మాసాల కంటే కార్తీక మాసంలో దీపారాధన చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. ఈ సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలోనే దీపాలను ఎందుకు వెలిగిస్తారు.. దీని వెనుక ఆంతర్యమేమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా...కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా...

మట్టి దీపాలను..

మట్టి దీపాలను..

'దీపం జ్యోతిః పరబ్రహ్మ.. దీపం జ్యోతిః నమో నమః దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః' దీపం పరబ్రహ్మస్వరూపం.. పరాయణత్వం కలిగినది. పాప ప్రక్షాళన చేసే శక్తి కలది. అంతేకాదు మన ఇంట్లో సిరులు తెచ్చేది కూడా దీప జ్యోతియే! దీపం లేని ఇల్లు ప్రాణం శరీరం లాంటిదే.

సాధారణంగా దీపాలను మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది.

లక్ష్మీదేవి స్వరూపంగా..

లక్ష్మీదేవి స్వరూపంగా..

ఇలాంటి దీపాలను సాధారణంగా ఉభయ సంధ్యల్లో పెడతారు.

ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ మాసంలో అగ్ని ఆరాధాన, హోమాలు వంటివి చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఈ మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. అందుకే ఈ మాసమంతా పరమేశ్వరుని ఆలయాల్లో దీపాలను వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి వేళ..

కార్తీక పౌర్ణమి వేళ..

కార్తీక పౌర్ణమి సమయంలో పరమేశ్వరునికి, శ్రీ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులు. ఈ పవిత్రమైన పర్వదినాల్లో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అలాగే ఈరోజున కచ్చితంగా దీపారాధన చేస్తారు. ఇలా దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే కూడా మంచి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు.

దీపం ఎప్పుడు వెలిగించాలంటే..

దీపం ఎప్పుడు వెలిగించాలంటే..

కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారు జామున నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం ఆచరించి.. ఆ తర్వాత పూజా గదిలో లేదా దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంటి వద్ద అయితే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సంధ్యా దీపాన్ని వెలిగించాలి.

నదిలో వదలాలి..

నదిలో వదలాలి..

ఈ పవిత్రమైన పర్వదినాన ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. దీపాన్ని అరటి దొన్నేపై ఉంచి నదిలో ఉంచుతారు. దేవాలయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే తులసి కోట ముందు, దేవుని ముందు దీపం వెలిగించినా కూడా మంచి ఫలితం లభిస్తుందట. మీకు శివుని అనుగ్రహం తప్పక కలుగుతుందట.

అగ్గిపుల్లతో వద్దు..

అగ్గిపుల్లతో వద్దు..

కార్తీక మాసంలో శివ, కేశవులిద్దరికీ ప్రియమైనది. ఈ నెలలో దీపారాధన చేసే వారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలొస్తాయట. అయితే దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించరాదు. కర్పూరంతో కాని మండుతున్న అగర్ బత్తీతో కానీ వెలిగించాలి.. దీపం వెలిగించిన తర్వాత దీప లక్ష్మీ నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. అలాగే ఉదయం వేళ తులసి దగ్గర పెట్టే దీపం దామోదరుడికి చెందుతుందట. ఇలా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి.. మనం ఆశించిన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

FAQ's

English summary

Kartik Month 2021: Reasons why Kartik month is the holiest month

Here we are talking about the Kartik month 2021: reasons why kartik month is the holiest month. Read on
Desktop Bottom Promotion