For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartik Masam 2021: కార్తీక మాసంలో ఏ పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదో తెలుసా...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఇది నెల రోజుల పాటు అంటే నవంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతుంది.

పురాణాల ప్రకారం ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల నిద్ర నుండి మెళకువలోకి వస్తారని నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం ఈ నెలలో తారకాసురుడిని కార్తికేయుడు సంహరించారని, అదేవిధంగా మరో కథనం ప్రకారం.. సత్యభామ చేతిలో నరకాసురుని సంహారం జరగడంతో ఈ నెలలో పూజలు, ఉపవాసాలు, పండుగలు మరియు ఇతర మతపరమైన కార్యకలాపాలు పెరిగినట్లు సమాచారం. ఈ కార్తీక మాసం శరద్ పూర్ణిమ రోజు నుండి ప్రారంభమవుతుంది.

ఈ నెలలోనే ఉత్తర భారతంలో కార్వా చౌత్, ధంతేరాస్, రూప్ ఛౌడాస్, భాయ్ దూజ్, దక్షిణ భారతంలో అట్ల తద్ది, నోముల వ్రతాలు, గౌరీ పండుగ, దేశవ్యాప్తంగా దీపావళి, గోవర్దన పూజ వంటివి జరుగుతాయి. గురు పూర్ణమితో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసంలో ఏకాదశితో పవిత్రమైన మరియు శుభకరమైన పనులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఉపవాసం ఉండటం.. కొన్ని ముఖ్యమైన పనులు చేయడం రెట్టింపు ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా ఈ కాలంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

నదిలో స్నానం..

నదిలో స్నానం..

కార్తీక మాసంలో ప్రవహించే నీటిలో లేదా ఏదైనా నదిలో స్నానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేస్తే, భూమిపై ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల పుణ్యం లభిస్తుంది. మీకు ఒకవేళ ఇలా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం కుదరకపోతే.. మీరు గంగా జలం కలిపిన నీటిలో బాటిల్ లేదా ఇతర ఏదైనా వస్తువుల్లో నింపుకొని వచ్చి ఆ నీటిని మీ బకెట్లో వేసుకుని స్నానం చేయొచ్చు.

తులసి పూజ..

తులసి పూజ..

కార్తీక మాసంలో తులసి చెట్టును పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో తులసి చెట్టును అందంగా అలంకరించి.. ఆ చెట్టుకు చీరను కట్టి.. పసుపు తాడు కట్టడం వల్ల శుభఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని సానుకూల ఫలితాలు వస్తాయని, దీని వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతారు.

దీపారాధన..

దీపారాధన..

కార్తీక మాసం అంటే దీపాలకు ప్రసిద్ధి. ఈ పవిత్రమైన కాలంలో ప్రతిరోజూ సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అదే సమయంలో శ్రీ మహా విష్ణువును స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి పెరుగుతాయని.. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని చాలా మంది నమ్ముతారు.

ఇవి ఎక్కువగా తీసుకోండి..

ఇవి ఎక్కువగా తీసుకోండి..

కార్తీక మాసంలో ఉపవాసం ఉండే వారు బాడీలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ప్రతిరోజూ పాలను తీసుకోవాలి. అందులో పంచదారకు బదులు 50 గ్రాముల బెల్లం కలిపిన పాలను తీసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే మీ రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇవి తీసుకోవద్దు..

ఇవి తీసుకోవద్దు..

కార్తీక మాసంలోనే శీతాకాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. అందుకే ఈ కాలంలో చల్లని నీటిని తాగడం నివారించండి. ముఖ్యంగా ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పదార్థాలను తినడం నివారించాలి. ఇలా చేయడం వల్ల మీరు దగ్గు మరియు జలుబుకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే మద్యం మరియు పొగ తాగడం, మాంసం తినడం.. చేపలను తినడం వంటివి తగ్గించాలి.

ఈ పనులు చేయకండి..

ఈ పనులు చేయకండి..

ఈ పవిత్రమైన మాసంలో నేలపైనే ఎక్కువగా నిద్రించండి. చాలా సహనంతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కోపంగా ఉండకండి. అహం నుండి చాలా దూరంగా ఉండాలి. ఎవ్వరితోనూ వాదనకు దిగకండి. వీలైనంత మేరకు తక్కువగా మాట్లాడండి. అలాగే ఈ కాలంలో బ్రహ్మచార్యం పాటించాలి. ఒకవేళ మీరు ఈ నియమాలను పాటించకపోతే.. అశుభ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయొద్దు.

English summary

Kartik Month 2021 Rules, Do's and Don'ts

Here we are talking about the kartik month 2021 rules, do's and don'ts in Telugu. Have a look
Story first published: Friday, October 22, 2021, 12:15 [IST]