For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartik Purnima 2021 Remedies:ఈ పరిహారాలు పాటిస్తే ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలోనూ శుభ ఫలితాలొస్తాయట...!

2021లో కార్తీక పూర్ణిమ సందర్భంగా ఈ పరిహారాలు పాటిస్తే సంపద మరియు శ్రేయస్సు లభిస్తుందట.

|

హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అదే సమయంలో దేవతలకు తిరిగి మళ్లీ స్వర్గాన్ని ఇచ్చాడు.

Kartik Purnima Remedies : Do these remedies on kartika purnima for wealth and prosperity in Telugu

మరో కథనం ప్రకారం.. కార్తీక పౌర్ణమి రోజున విష్ణువు మత్స్యావతారంలో భూమిపై అడుగుపెట్టాడని.. అందుకే ఈరోజున దేవ్ దీపావళి కూడా జరుపుకుంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 19వ తేదీన అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శివుడితో పాటు విష్ణుమూర్తికి, తులసి మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు.

Kartik Purnima Remedies : Do these remedies on kartika purnima for wealth and prosperity in Telugu

ఈరోజంతా ఉపవాసం ఉంటారు. అలాగే దీపాలను దానంగా కూడా ఇస్తారు. ఇలా చేయడం వల్ల వందల రెట్లు మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా దానఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!

గంగా నదిలో స్నానం..

గంగా నదిలో స్నానం..

కార్తీక పూర్ణిమ రోజున పవిత్రమైన గంగా-యమున నదిలో స్నానం చేయాలి. ఒకవేళ మీరు నివసించే ప్రాంతాల్లో నదులు లేకపోతే ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. అది కూడా కుదరకపోతే.. నదిలో నుండి కొన్ని నీళ్లను ఓ బాటిల్ లేదా ఇతర పాత్రలో తీసుకుని.. మీరు స్నానం చేసే బకెట్ నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో అద్రుష్టం కూడా రావొచ్చు.

ప్రధాన ద్వారం వద్ద..

ప్రధాన ద్వారం వద్ద..

కార్తీక పూర్ణిమ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని పోసి పసుపుతో స్వస్తిక్ చేయండి. అలాగే మామిడి ఆకులతో తోరణం కట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని.. మీకు సంపదకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని పండితులు చెబుతారు.

దీప దానం..

దీప దానం..

కార్తీక పూర్ణిమ రోజున గంగాజీ ఘాట్ వద్ద దీపం వెలిగించాలి. అలాగే దీప దానం చేయడం విశేషంగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అదే సమయంలో మీ ఇంట్లో అద్రుష్టం కూడా వస్తుంది. అలాగే కొత్త బట్టలు ధరించి వస్త్రాలను లేదా అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శుభ ఫలితాలొస్తాయి.

Kartik Purnima 2021:కార్తీక పౌర్ణమి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే సమస్యలు తొలగిపోతాయట..!Kartik Purnima 2021:కార్తీక పౌర్ణమి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే సమస్యలు తొలగిపోతాయట..!

తులసిపూజ..

తులసిపూజ..

కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసి చెట్టుకు ఉసిరితో వివాహం కూడా జరుపుతారు. అలాగే కార్తీక పూర్ణిమ రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించిన తర్వాత మట్టితో తిలకం వేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

శివునికి ప్రత్యేక పూజలు..

శివునికి ప్రత్యేక పూజలు..

కార్తీక పూర్ణిమ రోజున ఆ పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. పురాణాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజునే ముఖ్యంగా త్రిపురాసన్ అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున శివలింగంపై పాలు, పెరుగు, నెయ్యి, తేనే మరియు గంగాజలంతో పంచామ్రుతాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడని పండితులు చెబుతారు.

రావిచెట్టు ఆకులపై దీపారాధన..

రావిచెట్టు ఆకులపై దీపారాధన..

కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే ఈ మాసం విష్ణువు మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ సమయంలో ఈ దేవుళ్లను పూజిస్తే.. వివాహంలో ఏదైనా జాప్యం ఉంటే, విష్ణువు మరియు మాతా లక్ష్మీని పూజించాలి. ఎందుకంటే పిత్రు దోషం లేదా గ్రహణ దోషం ఉండటం వల్ల వివాహంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే కార్తీక పౌర్ణమి రోజున నదిలో లేదా చెరువులో రావి చెట్టు ఆకులపై దీపం వెలిగించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు వస్తాయి.

FAQ's
  • కార్తీక పౌర్ణమి రోజున పాటించాల్సిన పరిహారాలు ఏమిటి?

    పురాణాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి రోజున పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి.. ఇంటికి మామిడాకులతో తోరణం కట్టాలి. పసుపుతో గుమ్మాన్ని శుభ్రం చేయాలి. దీపాలను దానం చేయాలి. శివునికి, తులసికి ప్రత్యేక పూజలు చేయాలి.

  • 2021లో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది?

    2021 సంవత్సరంలో నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి పండుగ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 18వ తేదీ మధ్యాహ్నం నుండే ఈ పండుగ వేడుకలు మొదలయ్యాయి.

English summary

Kartik Purnima Remedies : Do these remedies on kartika purnima for wealth and prosperity in Telugu

Here we are talking about the kartik purnima 2021 Remedies : Do these remedies on kartika purnima for wealth and prosperity in Telugu. Read on
Desktop Bottom Promotion