Just In
- 18 min ago
Benefits of Green Tea for Skin:గ్రీన్ టీతో ఆరోగ్యమే కాదు.. అందాన్నీ పెంచుకోవచ్చు.. అదెలాగో చూడండి...
- 37 min ago
మీ జుట్టుకు ఆయిల్ ఎలా శిక్షణ ఇవ్వాలో ఇక్కడ మీ గైడ్ ఉంది
- 3 hrs ago
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? ఇది ప్రమాదకరమా?
- 7 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
Don't Miss
- Sports
నా టార్గెట్ ఒలింపిక్స్ మెడల్.. మేరీ కోమ్‌తో పోటీనా? ఆ చాన్సే లేదు: నిఖత్ జరీన్
- Finance
Business Ideas: నర్సరీల ద్వారా రూ. లక్ష వరకు ఆదాయం: ఉపాధి హామీ పథకంతో లింక్
- Technology
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- News
జగనన్న దావోస్ వెళ్లలేదు? లండన్ వెళ్లారు??
- Movies
Karthika Deepam నిరుపమ్ నాకు పడటం అదృష్టం.. నీకు దురదృష్టం.. హిమతో శౌర్య
- Automobiles
రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...
హిందూ మతం ప్రకారం.. కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసం ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్య పరంగానూ ఎంతో ముఖ్యమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి పరమ పవిత్రమైన మాసం ఇది.
ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. అయితే ఈ నెలలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆ ఒక్క రోజు కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తారు.
ఎందుకంటే ఈ మాసంలో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలతో ఈ నెల రోజుల పాటు పండుగ వాతావరణమే ఉంటుంది. అయితే కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు? అందులోనూ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Kartika
Masam
2021
:కార్తీక
మాసంలో
సోమవారం
ఉపవాస
నియమాలేంటో
తెలుసా...

ఆ చెట్టు కిందే ఎందుకంటే..
ఉసిరి చెట్టును క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రి చెట్టు అని అంటారు. అంతేకాదు ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం. పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో.. శ్రీ విష్ణుమూర్తి కూడా అక్కడే నివాసం ఉంటాడు. అందుకే మన పెద్దలు ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలంటారు.

అసాక్షి భోజనమే..
మనలో చాలా మంది ప్రతిరోజూ అసాక్షి భోజనాలు చేస్తూ ఉంటాం. అంటే సమయం దాటాక తినడం.. అతిథులకు, బ్రహ్మచారులకు పెట్టకుండా తింటూ ఉంటాం. కొన్నిసార్లు బయటి ఆహారాన్ని ఇంట్లోకి తెచ్చుకుని తింటాం. ఇంకొన్నిసార్లు దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టకుండా తింటూ ఉంటాం. ఇలా మొత్తం తొమ్మిది రకాల భోజనాలు ఉన్నాయి. ఇందులో కేవలం రెండు రకాల భోజనాలే అమోదయోగ్యమైనవి. అందులో ఒకటి ఇంట్లో వంట చేసుకుని తినేది.. మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా మనం నిత్యం తినే భోజనమంతా అసాక్షి భోజనమే.

అలా తినడం వల్ల..
మనలో చాలా మంది సాధారణ సమయాల్లో తినేటప్పుడు అటు ఇటు తిరుగుతూ తినడం గానీ.. మరి కొంతమంది వ్యక్తులు మంచంపై కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అయితే అలా భోజనం చేయడం వల్ల వారిలో కలి పురుషుడు ప్రవేశిస్తాడట. మనం ఎల్లప్పుడూ లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువు యొక్క స్వరూపంగా భావించే ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామి వారి ప్రసాదంగా పరిగణించబడుతుందట. అంతేకాదు ఆ సమయంలో మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడిని తరిమేస్తుందని పెద్దలు చెబుతారు.
Kartik
Month
2021:
కార్తీక
దీపాన్ని
అగ్గిపుల్లతో
వెలిగించరాదు...
మరి
ఎలా
వెలిగించాలో
చూసెయ్యండి...

సంపూర్ణ ఆరోగ్యం..
కార్తీక మాసంలో వనభోజనం, ఆత్మీయ సమ్మేళనం వంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల కుటుంబసభ్యులు, కమ్యూనిటీల మధ్య బంధం బలపడటమే కాదు.. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుందట. అందుకే కార్తీక మాసంలో సహపంక్తి భోజనాలు ఎక్కువగా చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన ఆహారం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశ్యం.

పురాణాల ప్రకారం..
కార్తీక మాసంలో వన భోజనాల వల్ల ఆధ్యాత్మికతతో పాటు ఆనందం, ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున నైమి శారణ్యంలో మునులంతా నూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీక పురాణంలో ప్రస్తావించారు. నాడు మహర్షులు ఆచరించిన వనభోజనాలను నేటికీ ఆనవాయితీగా పాటిస్తున్నారు.

మంచు కురిసే సమయంలో..
మన దేశంలో ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వ్రుక్ష జాతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి, ఆ చెట్టు కింద వండిన ఆహారాన్ని అక్కడే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో ప్రత్యేకంగా ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాల్లో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు. అలాగే పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది.

ఉసిరి చెట్టు గాలి వల్ల..
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో కేవలం భోజనాలే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ ను పిల్లలు, పెద్దలలో ఉన్న ప్రతిభను వెలికితీసే క్రీడా పోటీలు, అంతాక్షరి వంటి పోటీలు నిర్వహించడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో కొన్ని చెట్ల ద్వారా వీచే గాలులు, ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.

వనభోజనాలకు..
ఈ వనభోజనాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సాక్షాత్తు శ్రీక్రిష్ణుడు, బలరాముడు తమ స్నేహితులతో కలిసి వనభోజనానికి వెళ్లేవారు. వారు కూడా వనభోజనం నేపథ్యంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసేవారట. ఈ సమయంలో కొన్ని మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వ్రుక్ష జాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని కూడా వనసమారాధన అందిస్తోంది. చూశారు కదా.. వనభోజనం ఎందుకు చేస్తారో.. ఉసిరి చెట్టు వద్దే ఎందుకు చేస్తారో తెలిసింది కదా.. మీరు కూడా వెంటనే ఈ మాసంలో వనభోజనాలకు సిద్ధం కండి.. ఆ మధుర క్షణాలను ఆనందించండి.
కార్తీక మాసంలో వనభోజనంలో భాగంగా సహపంక్తి భోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టును క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రి చెట్టు అని అంటారు. అంతేకాదు ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం. పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో.. శ్రీ విష్ణుమూర్తి కూడా అక్కడే నివాసం ఉంటాడు. అందుకే మన పెద్దలు ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలంటారు.