For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2021: దీపాలను వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసా...

దీపాల పండుగ వేళ దీపాలను వెలిగించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.

|

దీపావళి అంటేనే దీపాల పండుగ. అందుకే దీనిని దీపోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీపాల వెలుగులతో ఈ లోకం నిండిపోతుంది. అయితే సాధారణంగా ప్రపంచంలోని హిందువులందరూ తమ ఇళ్లల్లోని పూజ గదిలో మరియు దేవాలయాల్లో దేవుడి ఎదుట దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు.

Know Scientific Reasons and Benefits About Lighting Diya

మరికొంతమంది ఉదయం మరియు సాయంకాలం దీపాలను వెలిగిస్తూ ఉండారు. మరికొందరు రాత్రి, పగలు దీపం వెలుగుతూ ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం.

Know Scientific Reasons and Benefits About Lighting Diya

అంతేకాదు శుభకార్యాల సమయంలో.. ఏదైనా కొత్త పనులు ప్రారంభించే సమయంలో కూడా దీపాలను వెలిగించడాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్క కార్యక్రమానికి దీపం ఎందుకని వెలిగిస్తారు..

Know Scientific Reasons and Benefits About Lighting Diya

ఈ సంప్రదాయం ఎప్పటి నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ మతంలో ప్రతిరోజూ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...

మతపరమైన కారణం..

మతపరమైన కారణం..

దీపం అనేది అనుకూలత(పాజిటివ్)కు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ఈ దీపం వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. హిందూ మతం ప్రకారం, దీపం వెలిగించడానికి కారణం ఏంటంటే.. అజ్ణానం అనే చీకటిని తొలగించి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం. అదే సమయంలో దీపాలను నెయ్యితో వెలిగిస్తే.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని.. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. అదొక్కటే కాదు.. తాంత్రిక పూజలను విజయవంతం చేయడానికి నెయ్యి దీపం మరియు నూనె దీపాన్ని ఉపయోగిస్తారు.

వాతావరణంలో మార్పులు..

వాతావరణంలో మార్పులు..

దీపం వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. వీటి వల్ల రక్తకణాలు ఉత్తేజమవుతాయి.

ఆవు నెయ్యిలో..

ఆవు నెయ్యిలో..

దీపంలో వెలిగించేందుకు ఆవు నెయ్యినే ఎందుకు వాడాలంటే.. అందులో సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే.. అది వాతావవరణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.

Diwali 2020 : ఈ దీపావళికి మీ ఇంటిని ఎలా డెకరేట్ చేయాలో చూసెయ్యండి...Diwali 2020 : ఈ దీపావళికి మీ ఇంటిని ఎలా డెకరేట్ చేయాలో చూసెయ్యండి...

సానుకూల శక్తి..

సానుకూల శక్తి..

దీపం వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది. మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన దేశీ నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి.. సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. మరో విశేషమేమిటంటే.. దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది.

దీపం ఎక్కడుంటుందో..

దీపం ఎక్కడుంటుందో..

దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి అనేది మాయమవుతుంది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం, ఏ మంచి పని చేసినా.. లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా దీపాన్ని వెలిగించడంతో ఆ పనిని ప్రారంభిస్తారు. దీపం పాపప్రక్షాళన కూడా చేస్తుంది. ఎందుకంటే దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది.

చీకటి మాయం చేయడమంటే..

చీకటి మాయం చేయడమంటే..

దీపం వెలుగుతో చీకటి మాయమవ్వడమే కాదు.. మనలోని అంధకారాన్ని.. మన మనసులోని చెడు భావం అంటే అంధకారాన్ని కూడా తొలగించే శక్తివంతమైనది దీపం. ఇంతటి అద్భుత శక్తి గల దీపం లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం.. ఆరాధిస్తాం. దీపానికి నమస్కరించడమే కాదు.. ప్రదక్షిణలు చేసి పండుగ చేసుకోవడమే దీపావళి పండుగ.

దేవతలకు ప్రతీకగా..

దేవతలకు ప్రతీకగా..

పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని సకల ప్రాణ కోటి మనుగడుకు ఉపకరించే కాంతిని అందిస్తోంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు, రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతిదేవిగా పురాణాలు చెబుతున్నాయి.

జీవితంలో ఎదుగుదలకు..

జీవితంలో ఎదుగుదలకు..

అంతటి మహత్యం ఉన్న దీపాన్ని వెలిగించడమంటే.. జీవిత ఎదుగుదలకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడమని పెద్దలు చెబుతారు. కావున దీపావళి రోజుతో పాటు కార్తీక పౌర్ణమినాడు దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

FAQ's
  • 2021లో దీపావళి పండుగ ఎప్పుడొచ్చింది?

    2021 సంవత్సరంలో దీపావళి పండుగ నవంబర్ 4వ తేదీన వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 5వ తేదీన కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

English summary

Know Scientific Reasons and Benefits About Lighting Diya

We all know the spiritual significance of lighting a diya. Today, we shed light on the scientific reasons that you would not know.
Desktop Bottom Promotion