ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక, దాని తర్వాత అసలైన పండుగ మొదలవుతుంది. అదే ఉట్లు కొట్టడం. కృష్ణాష్టమి మరుసటి రోజు ఆలయ ప్రాంగణాల్లో ఉట్లు కొట్టడం నిర్వహిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు ఎందుకు కొడతారు.? దీని వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి.. తెలుసుకుందాం..

know the spiritual reasons why Utti is broken during Krishnashtami

జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టడం అనే సంప్రదాయం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగుతుంది. చిన్ని కృష్ణుడి లీలలను, ఆయన స్నేహభావాన్ని గుర్తుచేసుకునే అద్భుతమైన సాంప్రదాయం ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఉట్ల వేడుక సందర్భంగా యువకుల మధ్య ఉండే ఉత్సాహం అంతాఇంతా కాదు. అయితే ఈ ఉట్టి కొట్టడం వెనుక కొన్ని కారణాలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు ఉన్నాయి. అవేంటంటే..

Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!

కృష్ణ లీలలు

శ్రీకృష్ణావతారం ద్వాపరయుగంలో చిన్ని కృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్లలో పాలు, పెరుగుతో పాటు ముఖ్యంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వెన్నను దొంగిలించి గుట్టుచప్పుడు కాకుండా తినేవాడు. అంతేకాకుండా దొంగతనం తన మీదకు రాకుండా ఇంట్లోని అత్తాకోడళ్ల మూతికి రాసి తప్పించుకునేవాడు. ఇలా బాలకృష్ణుడి లీలలు ఎన్నో. అందుకే శ్రీకృష్ణుడి చిలిపి పనుల నుంచి తమ వెన్న కుండలను రక్షించుకోవడానికి గోపికలు తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. కుండలను ఇంట్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న 'ఉట్టి’ మీద దాచి ఉంచేవారు.

గోపికలు ఇలా ఉట్టిపైన కుండలు దాచినా చిలిపి కృష్ణుడు వెనక్కి తగ్గేవాడు కాదు. తన బాల స్నేహితులను పిలిచి ఒకరిపై ఒకరు ఎక్కి హ్యూమన్‌ పిరమిడ్‌లాగా ఏర్పడి.. అంత ఎత్తులో ఉన్న ఉట్టిని అందుకుని వెన్నను దొంగిలించేవాడు. అలా దొంగిలించిన వెన్నను గోపాలురతో కలిసి పంచుకుని తినేవాడు. బాలకృష్ణుడి లీలలను స్మరించుకంటూ అలనాటి జ్ఞాపకాలను ప్రతియేటా కృష్ణాష్టమి సందర్భంగా రీక్రియేట్‌ చేసేవారు. ఈ కార్యక్రమంలో యువకులంతా పోటీపడటం ఆసక్తికరంగా ఉంటుంది.

know the spiritual reasons why Utti is broken during Krishnashtami

ఐక్యత, స్నేహభావం

కృష్ణాష్టమి మరుసటి రోజు ఆయన లీలలను గుర్తు చేసుకుంటూ ఉట్టి కొట్టడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. సమాజంలో ఐక్యత, జట్టు కృషి, స్నేహ భావం, పరస్పర సహకారాన్ని ఈ వేడుక పెంపొందిస్తుంది. ఎత్తయిన ఉట్టిని ఒంటరిగా ఎవరైనా అందుకోలేరు. అందుకే స్నేహితులంతా సాయంతో పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు ఉట్టి కొట్టడం సాధ్యమవుతుంది. ఐక్యత, స్నేహభావాన్ని ఈ సమాజానికి చాటిచెప్పడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం.

రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.!

ఉట్టిలో ఏముంటుందో తెలుసా..

ఉట్టి వేడుకలో భాగంగా మట్టికుండకు రంగులు అద్దుతారు. పాలు, పెరుగు, స్వచ్ఛమైన వెన్న, పసుపు నీళ్లు పూలు, చిల్లర నాణేలను కుండలో నింపుతారు. అందనంత ఎత్తులో ఉట్టి కడతారు. ఎవరైనా ఉట్టి కొట్టేటప్పుడు వారిని డిస్టర్బ్‌ చేస్తూ చుట్టుపక్కల వాళ్లు నీళ్లు చల్లి ఆటపట్టిస్తుంటారు. ఎట్టకేలకు ఉట్టి కొట్టిన తర్వాత కుండలోంచి కిందపడిన వెన్న, కుండ పెంకులను ప్రసాదంగా శుభప్రదంగా భక్తులు స్వీకరిస్తారు.

Story first published: Friday, September 4, 2026, 10:46 [IST]
Desktop Bottom Promotion