Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Krishna Janmashtami 2023: కృష్ణాష్టమి నాడు చేయకూడని పనులేంటో తెలుసా...
దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో మరియు ఉత్సాహంతో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున, ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటారు. కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు, కృష్ణుడిని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని దాటుకుంటూ అతన్ని నందుని ఇంటికి చేర్చాడు.
విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడు. ఈ సంవత్సరం జన్మాష్టమి, సెప్టెంబర్ 6, 2023న జరుపుకోబోతున్నారు. కృష్ణ భక్తులు చాలా మంది, ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. కొందరు శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రాప్తికై, కొన్ని నియమాలను అనుసరిస్తారు. ఈ రోజు చేయకూడని కొన్ని పనులను గురించి, ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులను కోయడం :
జన్మాష్టమి రోజున, తులసి ఆకులను కోయరాదు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది. అయితే, తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడానికైతే మాత్రం, కోయవచ్చు.
పేదవారిని అగౌరపరిచేలా ప్రవర్తించరాదు:
కృష్ణుడు అందరిని ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రేమిస్తాడు. అతని ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు. కనుక ఈ రోజున, పేదలను అవమానించడం, కృష్ణుడిని అసంతృప్తికి లోనుచేస్తుంది. పేదవారిని అగౌరవ పరచడం, శని దేవునికి కోపాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ రోజున అగౌరవపరచకుండా, పేదలను సత్కరించాలి. వీలైతే, జన్మాష్టమి నాడు పేదలకు విరాళం ఇవ్వాలి.

చెట్లను నరకడం:
జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా దురదృష్టకరం అని భావిస్తారు. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. మహాభారతం యొక్క ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు తాను అన్నింటా మరియు అంతా ఉన్నానని, ఆయనలో అంతా ఉన్నాడని తెలిపాడు. కనుక, ఈ రోజున మనం ఎవరికైనా హాని తలపెట్టే, ఆలోచన కూడా చేయకూడదు.
మాంసాహారాన్ని భుజించరాదు:
హిందూమతం ప్రకారం, భక్తులు మాంసాహార ఆహారాన్ని తీసుకోరాదు. చతుర్మాస సమయంలో, మాంసాహారం నుండి దూరంగా ఉండాలి. నాలుగు నెలల చతుర్మాస సమయంలో, విష్ణువు నిద్రిస్తున్నందున, శివుడు ఆ బాధ్యతలను తాను తీసుకుంటాడు. జన్మాష్టమి రోజున, మద్యం కూడా సేవించరాదు.
భౌతిక సంబంధాలు:
జన్మాష్టమి నాడు బ్రహ్మచార్యం పాటించాలి. ఈనాడు శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. ఈ రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి. ఈ రోజున, బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయి.
ఆవును అగౌరవపరచడం:
కృష్ణుడిని తరచుగా గోపాలకుడిగా చిత్రీకరిస్తారు. అతను తన చిన్ననాటి సమయంలో, ఆవులతో దూడలతో ఆడుతున్న చిత్రాలు, ఆయనకు ఆవులు ఎంత ప్రియమైనవో తెలియజేస్తున్నాయి. ఆవులను పూజించే వ్యక్తికి, తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆవులను అగౌరవపరిస్తే, కృష్ణుడిని అసంతృప్తికి గురిచేసినట్లే! జన్మాష్టమి రోజున, ఒక గోశాలకు విరాళము ఇవ్వడం, లేదా ఒక గాయపడిన ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిది.



Click it and Unblock the Notifications