Latest Updates
-
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.!
ఈ ఏడాది లక్ష్మీ నారాయణ యోగం ఎప్పుడు? ఏ రాశులకు లాభాలు...!
లక్ష్మీ నారాయణ యోగం వేళ ఈ రాశులకు అనేక లాభాలు...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఏదో ఒక గ్రహం లేదా కొన్నిసార్లు ఎక్కువ గ్రహాలు ప్రతి ఒక్క నెలలో తమ స్థానాన్ని మారుతూ ఉంటాయి.

ఇలా తమ దిశను మార్చుకునే సమయాన్ని రాశి మార్పు ప్రక్రియ అంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో శుక్రుడు మేష రాశి నుండి వృషభరాశిలోకి జూన్ 18వ తేదీన అంటే శనివారం రోజున సంచారం చేయనున్నాడు. అయితే ఇదే రాశిలో ఇప్పటికే బుధుడు కూడా నివాసం ఉంటున్నాడు. శాస్త్రాల ప్రకారం, శుక్రుడు మేధస్సు, ప్రేమ వంటి వాటికి ప్రతీకగా పరిగణిస్తారు. బుధుడిని తెలివితేటలు, బిజినెస్, కమ్యూనికేషన్ సంబంధించిన వాటికి ప్రతీకగా భావిస్తారు. ఇలా ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరగినప్పుడు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా అరుదైన సంఘటనగా పరిగణిస్తారు. ఇలా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల రాశిచక్రాలపై మంచి ప్రభావం ఉంటుందట. ఈ సమయంలో చాలా మందికి అనేక సమస్యల నుండి పరిష్కారం లభిస్తుందట. ఇదిలా ఉండగా ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారికి అత్యద్భుతమైన ఫలితాలు రానున్నాయట. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
శుక్రుడు మేష రాశి నుండి ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో బుధుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సుమారు 20 రోజుల వరకు శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు ఊహించిన లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో కొన్ని శుభవార్తలను వింటారు. మీ ఆదాయం కూడా పెరగొచ్చు. ఈ సమయంలో మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీకు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి కూడా లక్ష్మీ నారాయణ యోగం సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఉండే వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో పైఅధికారుల మద్దతు లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తారు. నిరుద్యోగులకు కూడా ఈ కాలంలో ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఉద్యోగాన్వేషణ కూడా ముగిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమచారాం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న మరియు ఊహాలకు సంబంధించినది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications