For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు? ఈ గ్రహణం వల్ల ఎవరిపై ప్రభావం పడుతుందంటే...!

చివరి చంద్ర గ్రహణం తేదీ, సమయంతో మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

|

2020 సంవత్సరంలో చివరి చంద్ర గ్రహణం నవంబర్ 30వ తేదీన ప్రారంభమవుతుంది. చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు ఈ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు సమానంగా లేదా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని సైన్స్ చెబుతోంది.

Last Lunar Eclipse of 2020 Date, Time, Sutak Kaal And other details in Telugu

ఈ చంద్ర గ్రహణం మన భారతదేశంలో నవంబర్ 30వ తేదీన అంటే కార్తీక పౌర్ణమి రోజున సోమవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది సుమారు ఐదు గంటల పాటు కొనసాగనుంది. సరిగ్గా 5:22 గంటల దగ్గర ముగిసే అవకాశం ఉంది.

Last Lunar Eclipse of 2020 Date, Time, Sutak Kaal And other details in Telugu

ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు చంద్ర గ్రహణాలు ఏర్పడాల్సి ఉండగా.. ఇప్పటికే మూడు చంద్ర గ్రహణాలు ముగిశాయి. అందులో ఒకసారి సంపూర్ణ చంద్ర గ్రహణం, రెండోసారి పాక్షికంగా..

Last Lunar Eclipse of 2020 Date, Time, Sutak Kaal And other details in Telugu

మూడోసారి పెనుంబ్రల్, నవంబర్ 30న చివరి చంద్ర గ్రహణం మరోసారి పెనుంబ్రల్ గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం అంటే ఏమిటి? ఇది ఎందుకు ఏర్పడుతుందనే విషయాలను తెలుసుకుందాం...

చంద్ర గ్రహణం 2020 : ఆ సమయంలో ఈ పనులు చేస్తే మీరు ఎన్ని లాభాలు పొందుతారో తెలుసా...!చంద్ర గ్రహణం 2020 : ఆ సమయంలో ఈ పనులు చేస్తే మీరు ఎన్ని లాభాలు పొందుతారో తెలుసా...!

పెనుంబ్రాల్ అంటే..

పెనుంబ్రాల్ అంటే..

పెనుంబ్రాల్ అంటే సగం నీడ. ఇది ఒక కాంతి వనరు. ఈ సందర్భంలో సూర్యుడు, భూమి ఒక వస్తువుపై కప్పబడి ఉంటుంది. సూర్యుని కాంతి భూమి నేరుగా చంద్రుని ఉపరితంపై పడకుండా నిరోధించినప్పుడు పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

చివరి మూడు గ్రహణాలు..

చివరి మూడు గ్రహణాలు..

ఇంతకుముందు ఏర్పడిన చంద్ర గ్రహణాలు జనవరి 10వ తేదీన, జూన్ 5వ తేదీన మరియు జులై 4వ తేదీన సంభవించాయి. ఇక చివరిదైన చంద్ర గ్రహణం ఈ నెల 30వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఇది మొదటగా పెరూ రాజధాని లిమాలో తెల్లవారుజామున 2:32 గంటల(స్థానిక సమయం)కు పెనుంబ్రల్ నీడను చూపిస్తుంది.

పురాణాలతో..

పురాణాలతో..

మన దేశంలో గ్రహణం అంటే చాలా మందికి చాలా రకాల అపొహలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఈ సమయం చాలా చెడ్డదని చాలా మంది హిందువులు భావిస్తారు. అయితే చంద్ర గ్రహణం కనిపించకపోతే హిందువులకు మతపరమైన ఆచారాలేవీ వర్తించవని పెద్దలు చెబుతుంటారు.

చంద్ర గ్రహణ ప్రభావం..

చంద్ర గ్రహణ ప్రభావం..

జ్యోతిష్యశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం నవంబర్ 30వ తేదీన వచ్చే చంద్ర గ్రహణం చివరి చంద్ర గ్రహణం అని.. ఇది వృషభరాశి మరియు రోహిణి నక్షత్రాలను ప్రభావితం చేస్తుందని దీని వల్ల అన్ని రాశిచక్రాల వారిపై ప్రభావం పడుతుంది.

ఉపచాయ గ్రహణం..

ఉపచాయ గ్రహణం..

ప్రతి గ్రహణానికి సూతక్ కాలం ఉంటుంది. ఈ సమయంలో దేవునికి సంబంధించిన మంత్రాలు జపించి ధ్యానం చేయాలని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. రాబోయే చంద్ర గ్రహణంలో, సూతక్ కాలం చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఇది ‘ఉపచాయ' గ్రహణం.

మనకు కనిపిస్తుందా..

మనకు కనిపిస్తుందా..

ఈ చంద్ర గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే.. ఈ అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రహణం సూర్యుడి అస్తమించే కంటే ముందే ముగిసిపోతుంది. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు ఉత్తరఖాండ్ వంటి రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.

ఎక్కడ కనిపిస్తుంది..

ఎక్కడ కనిపిస్తుంది..

ఈ చంద్ర గ్రహణం ఎక్కువగా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary

Last Lunar Eclipse of 2020 Date, Time, Sutak Kaal And other details in Telugu

Here we talking about the last lunar eclipse of 2020 date, time, sutak kaal and other details in telugu. Read on, 2020.
Desktop Bottom Promotion