కర్మ సిద్ధాంతం గురించి ఆసక్తికర అంశాలు ?

By Nutheti

కర్మ అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. అలాగే మన పెద్దవాళ్లు కూడా అనేక సందర్భాల్లో కర్మ అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి ? కర్మ సిద్ధాంతం వాస్తవమేనా ? కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుందా ? ఇలాంటి సందేహాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ స్టోరీ.

అసలు ఈ కర్మ సిద్ధాంతం ఎలా వచ్చింది అంటే.. కర్మ అనేది సంస్కృత పదం. మనం చేసే ప్రతి పనికి దానికి తగిన ఫలితం వస్తుందని కర్మ సిద్ధాంతం వివరిస్తుంది. సాధారణంగా మనం ఏదైనా నెగటివ్ పాయింట్ లో ఆలోచించినా.. పని చేసినా.. మాట్లాడినా.. అదే నెగటివ్ ఎనర్జీ మనకు వర్తిస్తుంది. అయితే కర్మ అనేది శిక్ష మాత్రం కాదు. ఈ కర్మ సిద్ధాంతం గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు, తెలియని విషయాలేంటో చూద్దాం..

కర్మ సిద్ధాంతం ?

కర్మ సిద్ధాంతం ?

కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కానీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మరికొందరికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సినది జరగక మానదు అనేది ప్రధాన ఉద్ధేశ్యం. అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. జరిగేది ఆపలేరు. జరగనిది మన ప్రయత్నం చేసినా జరగదని అర్థం.

గొప్పతనం

గొప్పతనం

ఏ భావాన్ని వ్యక్తం చేస్తే.. అదే విధంగా ఫలితం పొందుతాం. అంటే పనికి తగ్గ ఫలితం తిరిగి వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరు సంతోషం, ప్రశాంతత, ప్రేమ, స్నేహం కోరుకుంటారు. మనస్పూర్తిగా కోరుకుంటే.. ప్రేమను, సంతోషాన్ని, ప్రశాంతతను, నిజమైన స్నేహితులను పొందగలుగుతాం.

కర్మ ఎలా వచ్చింది

కర్మ ఎలా వచ్చింది

జీవితం కేవలం తనంతట తాను జరగదు. మన పాత్ర ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంది. ఈ విశ్వంలో మనం ఒక భాగం. కాబట్టి చుట్టు ఉన్నవాళ్లతో పోల్చుకోకుండా.. మీకు నచ్చినట్టు మీరు ఉండాలి.

మానవత్వం

మానవత్వం

ఏదైనా మార్పు కోరుకున్నప్పుడు దాన్ని అంగీకరించాలి. ప్రతి ఒక్కరిలో శత్రువుని చూసినా, మీలో నెగటివ్ లక్షణాలు ఉన్నా.. జీవితంలో ఎదగలేరు. అలాగే ఎంతో కాలం ఉండలేరు. మానవత్వంతో మెలిగినప్పుడే జీవితంలో పైకి రాగలరు.

అభివృద్ధి

అభివృద్ధి

ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం అలవరచుకోవాలి. చుట్టు ఉన్న మనుషులు కాదు, ప్రదేశాలు కాదు, వస్తువులు కాదు.. ముందు మనలో మార్పు రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ముందుగా మనల్ని మనం మార్చుకుంటే.. మన ఆలోచనలు, మనసు కూడా మార్పును అంగీకరిస్తుంది.

బాధ్యత

బాధ్యత

మన జీవితంలో ఏదైనా తప్పు జరిగింది అంటే.. దానికి ఖచ్చితంగా మనలో తప్పు ఉందని అర్థం. మన చుట్టూ ఉన్న వాటికి మనం అద్దం లాంటి వాళ్లం. అలాగే మనకు చుట్టూ ఉన్నది అద్దం లాంటిది. అంటే మనం చేసే పనిని బట్టి ప్రతిఫలం తిరిగివస్తుంది. ఇది విశ్వంలోని వాస్తవం. మన జీవితంలో మనకున్న బాధ్యతలను మనం ఖచ్చితంగా స్వీకరించాలి.

అనుసంధానం

అనుసంధానం

ఈ విశ్వంలో ప్రతి ఒక్కదానికి అనుసంధానం ఉంది. ప్రతి అడుగు మరో అడుగును ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరు మొదటి పని పూర్తి చేయాలి. మొదటి పని చేయకుండా.. చివరి పని చేయడం గొప్పతనం కాదు.. గుర్తింపు కూడా కాదు. ఇచ్చిన పని పూర్తి చేయడానికి కష్టపడాలి.

దృష్టి

దృష్టి

ఒకేసారి రెండు విషయాలు ఆలోచించలేరు. ఒకవేళ మన దృష్టి ఆధ్యాత్మిక విలువలపై ఉన్నప్పుడు.. అదేసమయంలో ఎక్కువ ధనం సంపాదించాలనే కాంక్ష ఉండటం సరికాదు.

ఆతిథ్యం లేదా అతిథి సత్కారం

ఆతిథ్యం లేదా అతిథి సత్కారం

తాము నేర్చుకున్న విషయాన్ని నలుగురికి నేర్పించాలి. అలాగే ఏ విషయాన్నైనా తాము జీవితంలో నమ్మినప్పుడు.. దాన్ని ప్రదర్శించి వివరించడానికి ఇష్టపడతారు.

ఇక్కడ, ఇప్పుడు

ఇక్కడ, ఇప్పుడు

ప్రస్తుతం జరుగుతున్న విషయం గురించి ఆలోచించాలి. జరిగిపోయిన వాటిని మరిచిపోవాలి. గతంలోని ఆలోచనలు, గత ప్రవర్తన, గతంలోని కలలను వదిలిపెట్టాలి. ప్రస్తుతం ఎలా ఉన్నాం.. ఏం చేయాలి అన్న విషయాలనే మనసులో పెట్టుకోవాలి.

మార్పు

మార్పు

మనలో ఖచ్చితంగా మార్పు రావాలి. పాత విషయాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే కొత్త జీవితం ఆనందంగా, కోరుకున్నట్టు ఉంటుంది.

ప్రతిఫలం పొందాలంటే ఓర్పు అవసరం

ప్రతిఫలం పొందాలంటే ఓర్పు అవసరం

ఏ విషయంలోనైనా ప్రతిఫలం పొందాలంటే.. నిరంతర కృషి అవసరం. నిరంతర కృషితో పాటు ఓర్పు చాలా అవసరం. తాము చేయాల్సిన పని చేస్తున్నప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది. అలాగే.. తమకు ప్రతిఫలం ఎప్పుడొస్తుందో కూడా వాళ్లు చేసే పనిని బట్టి అర్థమవుతుంది.

ప్రాముఖ్యత

ప్రాముఖ్యత

ఎంత కష్టపడితే అంత ప్రతి ఫలం పొందుతారు. కర్మ అనేది పాజిటివ్ థింకింగ్ ని, పాటిజివ్ పనులను సూచిస్తుంది.

ఒకే ఒక్క సిద్ధాంతం

ఒకే ఒక్క సిద్ధాంతం

సృష్టిలో మొత్తానికి ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే. అదే కర్మ సిద్ధాంతం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటారు. మన భావనలే మన యదార్ధాలవుతాయని వివరించేదే కర్మ సిద్ధాంతం.

కాబట్టి మన ప్రవర్తన బావున్నప్పుడే, మన ఆలోచనలు బావున్నప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు దక్కుతుంది.

Story first published: Thursday, December 10, 2015, 11:30 [IST]
Desktop Bottom Promotion