Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
2017 కొత్త సంవత్సరంలో తులా రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..
ప్రతి ఒక్కరు తమతమ రాశులకు సంబంధించిన విశేషాల్ని, దోషపరిహారాల్ని తెలుసుకుని, వాటిని ఆచరించి సుఖశాంతులు పొందవచ్చు. రాశి చక్రమంలో ఏడో రాశి అయిన తులరాశికి 2017లో ఎలా ఉండబోతోందో ..పరిష్కార మార్గాలేంటో తెలు
భూలోకంలో మానవులందరి మీదా నవగ్రహాల ప్రభావం వుంటుంది. మానవులు గతజన్మలో చేసిన కర్మల ఆధారంగా వారి పాపపుణ్యాలను అనుసరించి తిరిగి జన్మిస్తూ వుంటారు. అయితే మానవ జన్మ ఎత్తిన వారందరూ ఒకే విధంగా వుండరు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలతో జన్మిస్తారు. ఇలా మానవులు జన్మించిన జనన సమయం ఆధారంగా తత్కాల గ్రహస్థితులని అనుసరించి దైవజ్ఞులు ఆ మనిషికి జాతకలగ్నాన్ని నిర్ణయిస్తారు. ఈ లగ్నాలు 12 విధాలుగా వుంటాయి. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకరం కుంభం, మీనం అని రాశులు కూడా 12 వుంటాయి. ప్రతీ మనిషీ ఈ 12 రాశులలో ఏదో ఒక రాశికి చెందినవాడవుతాడు.
ఈ 12 రాశులు 12 రకాల స్వభావాలు కలిగి వుంటాయి. వీటి అనుగుణంగా ఆయా రాశులలో జన్మించినవారు ఆ రాశికి సంబంధించిన స్వరూప స్వభావాలు కలిగి వుంటారు. ఈ 12 రాశులమీద ఆదిత్యాది సప్తగ్రహాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ వుంటాయి.
ప్రతి ఒక్కరు తమతమ రాశులకు సంబంధించిన విశేషాల్ని, దోషపరిహారాల్ని తెలుసుకుని, వాటిని ఆచరించి సుఖశాంతులు పొందవచ్చు. రాశి చక్రమంలో ఏడో రాశి అయిన తులరాశికి 2017లో ఎలా ఉండబోతోందో ..పరిష్కార మార్గాలేంటో తెలుసుకంుదాం మనం ఈరోజు తెలుసుకుందాం...

తులా రాశి వారి ఫలితాలు
తులారాశి : చిత్త 3, 4 పాదములు, స్వాతి 1,2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు
ఆదాయం -14 వ్యయం-11 పూజ్యత- 6 అవమానం-1

. కుటుంబీకుల మధ్య సంబంధబాంధవ్యాలు మెరుగవుతాయి.
ఈ రాశివారి గోచారం పరీక్షించగా ''శాంతంబయిన సఫలమౌ సకల కార్యంబుల్'' అన్నట్లు కార్యసాధనలో ఓర్పు, విజ్ఞతతో వ్యవహరించవలసి ఉంటుంది. ధనాభివృద్ధి కానవచ్చినా ఏ మాత్రం ధనం నిల్వ చేయలేదు. కుటుంబీకుల మధ్య సంబంధబాంధవ్యాలు మెరుగవుతాయి.

. మీరంటే ఒక ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది.
తలపెట్టిన శుభకార్య యత్నాలు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆదరణ పెరుగుతుంది. మీరంటే ఒక ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది.

తోటివారితో లౌక్యంగా వ్యవహరించి పనులు చక్కపెట్టుకోవడం మంచిది.
తల, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి పనిఒత్తిడి, భారం అధికమవుతుంది. తోటివారితో లౌక్యంగా వ్యవహరించి పనులు చక్కపెట్టుకోవడం మంచిది. వ్యాపార విస్తరణ యత్నాలలో సఫలీకృతులవుతారు. నూతన విద్యారంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

విద్యార్థుల్లో పోటీతత్వం అధికమవుతుంది. ఇనుము, సిమెంట్, కలప రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. స్త్రీలు ఓర్పు, నేర్పుతో ముందుకు సాగవలసి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు అధిక శ్రమ అవసరం.
విద్యార్థుల్లో పోటీతత్వం అధికమవుతుంది. ఇనుము, సిమెంట్, కలప రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. స్త్రీలు ఓర్పు, నేర్పుతో ముందుకు సాగవలసి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు అధిక శ్రమ అవసరం.

నిరుద్యోగులు ఊహించని అవకాశాలు లభిస్తాయి
నిరుద్యోగులు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారు పొందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

న్యాయసంబంధమై విషయాల్లో ఒక స్థిరనిర్ణయానికి రాగలుగుతారు
కిరాణ, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారు వ్యాపారస్తులకు శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు లభిస్తాయి. న్యాయసంబంధమై విషయాల్లో ఒక స్థిరనిర్ణయానికి రాగలుగుతారు. స్థిరాస్తి అభివృద్ధి లేదా కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. అధికయత్నం చేసి సఫలీకృతులు కండి.

ళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
భాగస్వామ్య వ్యాపారుల్లో పరస్పర అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంది. సాహిత్య, కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.

ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు.
రాజకీయాల్లో వారు ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రత్యర్థులను ఓడించ గలుగుతారు. వాణిజ్య రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు.

ఆడంబరముగా ఖర్చు చేయుట జరుగును.
భోజన సౌఖ్యభంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, సంఘములో గౌరవము, పలుకుబడి, రాజకీయములలో రాణించుట, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, బాకీలు వసూలగుట, కొత్త వ్యక్తులతో స్నేహములు, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, ఆడంబరముగా ఖర్చు చేయుట జరుగును. దైవభక్తి పెరుగును. ప్రయాణములు చేయునపుడు జాగ్రత్త అవసరము. నిర్లక్ష్యము పనికిరాదు.

మిక్కిలి అనుకూల స్థానము,
మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, ఉత్సాహము తగ్గుట, భార్య, పిల్లలతో చికాకులు, కన్ను ముక్కు చెవి, పంటికి సంబంధించిన బాధలు, అనారోగ్యం, పైవారి వలన మాటలు పడుట, ఉద్యోగస్తులకు చికాకులు, తలంచిన కార్యములకు ఆటంకములు, అపనిందలు, బంధువులతో విరోధము, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు సొమ్ము సమకూరి అవసరములు తీరును.

నవగ్రహ ప్రదక్షణ
అక్టోబర్ వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన సర్వదా శుభం కలుగుతుంది.

హనుమాన్ చాలిసా పఠించడం వల్ల, లక్ష్మీ నారాయణుని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.
ఈ రాశివారు హనుమాన్ చాలిసా పఠించడం వల్ల, లక్ష్మీ నారాయణుని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.

వైక్రాంతమణి ధరించిన పురోభివృద్ధి పొందుతారు.
చిత్తనక్షత్రం వారు జాతి పగడం, స్వాతి నక్షత్రం వారు ఎర్రగోమేధికం, విశాఖనక్షత్రం వారు వైక్రాంతమణి ధరించిన పురోభివృద్ధి పొందుతారు.

చిత్తా నక్షత్రం వారు తాటిచెట్టును,
చిత్తా నక్షత్రం వారు తాటిచెట్టును, స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టును దేవాలయాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటినట్లైతే అభివృద్ధి కానవస్తుంది.

గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. పెండింగు వ్యవహారములు పూర్తి అగుట, పాతబాకీలు వసూలగుట, భూ గృహ మార్పులు, వృత్తి ఉద్యోగ వ్యాపారములో ఊహించని మార్పులు, గర్వభంగం, ఇబ్బందుల నుండి కొంతవరకు తప్పించుకోగలుగుట. నూతన పధకములు ప్రారంభించుట, వాగ్దానములు నెరవేర్చ లేకపోవుట, విమర్శలకు గురి అవుట. Read more at: http://telugu.oneindia.com/jyotishyam/yearly-raasi-phala/libra-year-horoscope-thula-rasi-190760.html
గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. పెండింగు వ్యవహారములు పూర్తి అగుట, పాతబాకీలు వసూలగుట, భూ గృహ మార్పులు, వృత్తి ఉద్యోగ వ్యాపారములో ఊహించని మార్పులు, గర్వభంగం, ఇబ్బందుల నుండి కొంతవరకు తప్పించుకోగలుగుట. నూతన పధకములు ప్రారంభించుట, వాగ్దానములు నెరవేర్చ లేకపోవుట, విమర్శలకు గురి అవుట.

సంసారంలో సుఖము పొందుతారు, ఏ పని తలపెట్టినా ప్రారంభములో చికాకులు కలిగి కష్టముమిూద నెరవేరుట,
శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, ఏ పని తలపెట్టినా ప్రారంభములో చికాకులు కలిగి కష్టముమిూద నెరవేరుట, అకారణ కలహములు ఏర్పడినా మధ్యవర్తుల ద్వారా అనుకూలంగా పరిష్కారమగుట, వ్యాపారాభివృద్ధి, ధనాదాయం, పాతబాకీలు వసూలగుట, ఆఫీసులలో జరగవలసిన పనులు నెరవేరుట, చేయు పనులు, వ్యాపార వ్యవహారములలో లాభనష్టములు సమానముగా నుండుట, తండ్రిగారికి అనారోగ్యం.

మనసులో ఆనందము పొందుతారు
మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శ్రమకు తగిన ఫలితము, ప్రభుత్వము వారిచే ప్రశంసలు పొందుట, సంఘములో గౌరవము, పలుకుబడి, ఉన్నత-పదవులను పొందుట, నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, కుటుంబ సౌఖ్యము, బాకీలు వసూలగుట, వ్యాపార వ్యవహారములందు కలిసివచ్చుట, ధనలాభం, ఆర్థికంగా అభివృద్ధి, సుఖసంతోషములు చేకూరును.



Click it and Unblock the Notifications











