Latest Updates
-
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.!
ఆస్ట్రాలజీ ప్రకారం, శరీరం మీద ఏబాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుంది..
బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా వున్నది.
హిందూ సంప్రదాయాల ప్రకారం బల్లి పైన పడితే దోహంగా భావించి తలకి స్నానం చేస్తారు. వీలు కుదరకపోతే కనీసం పసుపు నీటిని అయినా జల్లుకుంటారు. అదీ కుదరక పోతే కంచిలో బంగారు బల్లిని తాకిన వారిని ముట్టుకుంటారు. మరి బల్లి ఏఏ శరీర భాగాలపై పడితే ఏం జరుగుతుందో తెలుసుకుందామా... శాస్త్రంలో మగవారికి ఒక విధంగా ఆడవారికి ఒక విధంగా ఉంటుంది . ఆ వివరాలు మీ కోసం స్లైడ్ షోలో పొందుపరిచాం.

తలపైన బల్లి పడితే
ఆడవారికి తలపైన బల్లి పడితే జీవితానికి ప్రమాదం వాటిల్లుతుందట కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మగవారికి తలపైన పడితే మీతో ఎవరో గొడవపడడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుందట.

స్త్రీలకు చెవిదగ్గర
స్త్రీలకు చెవిదగ్గర, చెంప దగ్గర పడితే - శుభము

తొడ
తొడ వెనుక - విషభయం
ముందు తొడమీద- సుఖం
స్త్రీకి తొడమీద - వ్యభిచారం

చేతి
రెక్కలయందు - ప్రయత్న కార్య భంగం
అరచేతియందు - ద్రవ్య లాభం
మోచేతియందు - సహాయనాశనం
మణికట్టు దగ్గర - గర్వ భంగం
గోళ్ళయందు - జంతు భయం
చంకలో - ప్రేతభయం
వెన్నున - శత్రుభయం

కుడిచెంప
ఆడవారి కుడి చెంపపై బల్లి పడితే వీరికి మగ శిశువు జన్మిస్తాడట. మగవారికి కనుక కుడి చెంపపై బల్లి పడినట్లయితే వీరికి ఒక చెడు వార్త చేరుతుంది.

కుడి చెవి
ఆడవారికి కుడిచెవి పై బల్లి పడితే ఒక లక్కీ ప్రైజ్‌ని బహుమతిగా పొందుతారు.

పై పెదవిపై
ఆడవారి పై పెదవిపై బల్లి పడితే వీరు ఎవరితోనైనా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నారని సూచన. మగవారిపై పడితే కూడా ఇదే సూచిస్తుంది.

కింద పెదవిపై
ఆడవారి కింద పెదవిపై బల్లి పడితే కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదే మగవారు అయితే ప్రైజ్ మనీని గెలుచుకుంటారు.

రెండు పెదాలపై
ఆడవారైతే సమస్యలను ఎదుర్కొంటారు మగవారు అయితే స్నేహితులు లేదా బంధువుల నుండి మరణ వార్త వింటారు.

వెనుక బాగం, గోర్లు
ఆడవారి వెనుక బాగాన బల్లి పడినట్లయితే మరణ వార్త వింటారు. గోర్లపై పడితే మీతో ఎవరో గొడవకి దిగుతారు.



Click it and Unblock the Notifications