For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తుశాస్త్ర అనుసారం మీ ఇంటికి తాళం వెయ్యండి!

వాస్తుశాస్త్ర అనుసారం మీ ఇంటికి తాళం వెయ్యండి!

|

వాస్తుశాస్త్ర ప్రకారం, మీ ఇంటి భద్రతకై ఉపయోగించే తాళం కప్పలకు ప్రాముఖ్యత ఉందని మీకు తెలుసా? ఆ తలుపు ఉన్న దిక్కు, ప్రవేశ ద్వారం మొదలైన అంశాలను ఏ విషయంగా పరిశీలించాలి. వాస్తు శాస్త్రం భారతదేశంలో ఉద్భవించింది. దీనిని చాలామంది పాటిస్తారు.

వాస్తు శాస్త్రంలోని వివిధ విభాగాల్లో, గృహానికి సంబంధించిన వివిధ అంశాలను గురించి చర్చించారు. ఇంటిని ఏ విధంగా నిర్మించాలు అనే విషయం దగ్గర నుండి, ఏ దిక్కులో ఏ వస్తువులను అమార్చాలి అనే విషయాలను గురించి కూలంకషంగా చర్చించారు.

ఈ రోజు, మీ కొరకు, వాస్తుశాస్త్ర ప్రకారం, ఏ రకమైన తాళం కప్పలు వాడాలి అనే విషయానికి సంబంధించిన సమాచారం అందిస్తున్నాం.

తూర్పు:

తూర్పు:

సూర్యుడు తూర్పు దిక్కుకి అధిపతి. కనుక, ఈ దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు ఎరుపు రంగులో రాగితో తయారైనవి అయ్యి ఉండాలి. ఇలా చేస్తే ఆ ప్రదేశానికి అవసరమైన రక్షణ చేకూరుతుంది. ఇలా చేస్తే ఆ ఇల్లు దొంగతనాల బారిన పడకుండా ఉంటుంది.

పడమర:

పడమర:

శని పశ్చిమానికి అధిపతి, కనుక ఈ దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు నలుపు రంగులో ఇనుముతో తయారైనవి అయ్యి ఉండాలి. తాళం కప్ప బరువుగా ఉండేట్టు చూసుకోండి. రాగి తాళం కప్పలను ఈ దిశలో వాడరాదు.

ఉత్తరం:

ఉత్తరం:

ఈ దిక్కున ఉపయోగించే తాళాలు ఇత్తడివి అయ్యి ఉండాలి. ఇంకే లోహం వాడరాదు. మీరు గుర్తుపెట్టుకోదగ్గ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు ఎరుపు రంగులో లేదా దానికి దగ్గరి రంగులో ఉండాలి. ఒక వేళ పెద్ద గదులు లేదా పరిశ్రమలు ఈ దిక్కులో ఉంటే, ఐదు తాళం కప్పలను ఉపయోగించడం సురక్షితం.

దక్షిణం:

దక్షిణం:

దక్షిణ దిక్కున వేయడానికి పంచాలోహాల తాళం కప్పలను వాడండి. ఇవి ఎరుపు రంగులో బరువుగా ఉండాలి. ఇలా చేస్తే ఆస్తుల సురక్షితంగా, దొంగల బారిన పడకుండా ఉంటాయి.

ఈశాన్యం:

ఈశాన్యం:

పసుపురంగు లో ఉండే తాళం కప్పలు, ఈ దిక్కులో వాడటం శుభప్రదం. ఈ తాళం కప్పలు బరువుగా ఉండాలి. ఎరుపురంగుతో కూడిన తాళం కప్పలను ఈ దిక్కులో ఉండే గదులకు వేయవచ్చు. -

వాయువ్య మరియు నైరుతి:

వాయువ్య మరియు నైరుతి:

వాయువ్య దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు బరువుగా, వెండి రంగులో ఉండాలి. నైరుతికి అధిపతి రాహువు కనుక,ఈ దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు గోధుమరంగులో ఉండాలి.

గుర్తుపెట్టుకోవాల్సిన ఇతర వాస్తవాలు:

గుర్తుపెట్టుకోవాల్సిన ఇతర వాస్తవాలు:

1.ఒక తాళం కప్ప యొక్క తాళం చెవులు కనిపించకుండా పోయినట్లైతే, అటువంటి తాళం కప్పలను ఇంట్లో ఉంచరాదు. అవి అశుభాన్ని కలుగజేసి, ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాన్ని పెంచుతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.వీటిని పరిష్కారం దొరకని సమస్యలకు సంకేతంగా వాస్తు శాస్త్రం చెబుతోంది.

2. శబ్దం చేసే తాళం కప్పలను ఇంట్లో ఉంచకండి. ఆ తాళం కప్పలకు బదులుగా కొత్తవాటిని తీసుకురండి లేదా వాటినే శబ్దం రాకుండా బాగుచేయించండి.

3. మీరు కనుక తాళం కప్పలను పారేయాలి అనుకుంటే, పారేసేముందు అవి తాళం వేయబడకుండా ఉన్నాయని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ తాళం వేసి ఉన్నట్లైతే, తెరచాక పడియండి.

4. ఇంటిలోని పూజగదికి తాళం ఉండరాదు.

5. ఎవరికైనా బహుమతిగా తాళం కప్ప మరియు చెవి ఇస్తే చాలా మంచిదని అంటారు. అది ఒక వ్యక్తి యొక్క రక్షణ మరియు భద్రతను పెంపొందిస్తుంది.


English summary

Lock Your Property As Per Vastu

Lock Your Property As Per Vastu,Do you know that using the wrong kind of locks for your house might result into increasing the number of chances of thefts? Depending on the direction, you should use a particular kind of lock, so that safety is ensured as per Vaastu.
Story first published: Tuesday, July 3, 2018, 17:14 [IST]
Desktop Bottom Promotion