For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

lohri 2023: భోగి పండుగ నాడు మీకు భోగభాగ్యాలు కలగాలంటే...

ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట.

|

చాంద్ర మాసం పాటించే హిందువులు సౌర మానం ప్రకారం జరుపుకునే పర్వదినాలలో అతి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే పర్వదినాన్నే భోగి పండుగ అంటారు. ఈరోజున దక్షిణయానానికి చివరి రోజుగా, అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజుగా జరుపుకుంటారు. ఇదే రోజున సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

Lohri 2023

ఈ సమయంలో రైతులకు పంట చేతికి వచ్చి వాటి భోగభాగ్యాలను అనుభవించడానికి వీలు కల్పించింది. అందుకే ఈ పండుగకు భోగి అని నామకరణం చేశారు. భోగి అంటే సుఖమైన అనుభవం గల కల పండుగ అని అర్థం. ఈ సందర్భంగా భోగి పండుగ నాడు మనందరికీ భోగభాగ్యాలు కలిగేందుకు ఏయే పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

<strong>సంక్రాంతి స్పెషల్ 2020 : పొంగల్ రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం...!</strong>సంక్రాంతి స్పెషల్ 2020 : పొంగల్ రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం...!

భోగి మంటల్లో..

భోగి మంటల్లో..

భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలి. మీ ఇంట్లోని పాత వస్తువులలో పనికి రాని వాటిని భోగి మంటల్లో వేసేయాలి. అలాగే ఏవైనా విరిగిపోయిన వస్తువులు, స్టోర్ రూమ్ లో ఉండే వస్తువులను భోగి మంటల్లో వేసేయాలి. దీని వల్ల మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు.

నువ్వుల నూనెతో...

నువ్వుల నూనెతో...

తెల్లవారు జామునే నిద్ర లేవాలి. స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను కచ్చితంగా మీ శరీరానికి రాసుకోవాలి. అలాగే శనగపిండితో నలుగు పెట్టుకోవాలి. ముందుగా నువ్వుల నూనె మీ బాడీ అంతా కాళ్ల దగ్గర నుండి ముఖం వరకు మొత్తం రాసుకోవాలి. అరగంట తర్వాత మీరు స్నానం చేయాలి.

దరిద్ర దేవత దరి చేరదు..!

దరిద్ర దేవత దరి చేరదు..!

కుంకుడు కాయలనే తలకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాయలంటే దరిద్ర దేవతకు చాలా చికాకు వేస్తుందట. కుంకుడు కాయలలో ఉండే చేదును భరించలేక.. మీరు ఎప్పుడు అయితే కుంకుడు కాయలు మీ తలకు పెట్టుకుంటారో.. అందులో ఉండే రసం మీ శరీరంపై ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణం నుండి దరిద్ర దేవత వెంటనే వెళ్లిపోతుందట.

మకర సంక్రాంతి 2020 : ఈ రాశుల వారికి సంపద పెరిగిపోతుందట...!మకర సంక్రాంతి 2020 : ఈ రాశుల వారికి సంపద పెరిగిపోతుందట...!

పిప్పిని రాసుకోకూడదు..

పిప్పిని రాసుకోకూడదు..

అయితే కుంకుడుకాయ పిప్పిని ఎప్పటికీ మీ శరీరానికి వేసుకోకూడదు. కుంకుడుకాయ గుజ్జును మాత్రమే మీ బాడీకి అప్లై చేయాలి.

సంక్రాంతి స్పెషల్ 2020 : బరిలో దిగే పందెం కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో తెలుసా...సంక్రాంతి స్పెషల్ 2020 : బరిలో దిగే పందెం కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో తెలుసా...

ఉతికిన బట్టలు..

ఉతికిన బట్టలు..

ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట. అయితే కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కచ్చితంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.

మీరు నమ్మే దేవుడిని..

మీరు నమ్మే దేవుడిని..

భోగి పండుగ రోజున మీరు నమ్మిన దేవుడిని పూజించాలి. మీకు నచ్చిన ఆలయానికి వెళ్లాలి. ఈ పండుగకు ఒక్కటే కాదు.. ఏ పండుగకు అయినా మీరు నమ్మిన దేవుడిని పూజించాలి.

సంక్రాంతి స్పెషల్ 2020 : కుక్కుట శాస్త్రం ప్రకారం ఈ కోళ్లు కచ్చితంగా గెలుస్తాయట...!సంక్రాంతి స్పెషల్ 2020 : కుక్కుట శాస్త్రం ప్రకారం ఈ కోళ్లు కచ్చితంగా గెలుస్తాయట...!

భోగి పళ్లు..

భోగి పళ్లు..

పిల్లలకు, యువతకు నచ్చే పండుగల్లో భోగి మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామునే నిద్ర లేచి.. చలికి వణుకుతూ భోగి మంటలు వేయడానికి పిల్లలు, యువత తెగ ఉత్సాహం చూపుతారు. ఆ రోజున పెద్దలందరూ తమ పిల్లలపై భోగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారు. దీన్ని శ్రీమన్నారాయణ ఆశీర్వాదంగా భావిస్తారు.

భోగి పళ్లు ఎలా వేయాలంటే..

భోగి పళ్లు ఎలా వేయాలంటే..

మీ పిల్లలను తూర్పు వైపున కూర్చోబెట్టాలి. భోగి పళ్లలో చామంతి పూలరేకులు, బంతిపూల రేకులు, అక్షింతలు, నాణేలు కలిపి వారి తలపై వేయాలి. ఇది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఈ మంత్రాన్ని జపించాలి..

ఈ మంత్రాన్ని జపించాలి..

భోగి పళ్లు వేసి ఆశీర్వదించే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి..

‘‘ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ

ధనధాన్య అఖండ విద్యాసిద్ధి, ఐశ్వర్యసిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఆయుషు సిద్ధి కరయా

శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా‘‘

ఈ విధంగా చేస్తే మీ పిల్లలు సంతోషంగా, ఆనందంగా ఉంటారు.

English summary

Lohri 2023 Date, Muhurat and significance

Sankranthi is a Major Festival celebrated in most parts of the South India. This festival is celebrated for 4 days. Each day has its own significance. The First day of Sankranthi festival is Bhogi. Bhogi is the first day of four- day sankranthi festival Andhra Pradesh and Karnataka.
Desktop Bottom Promotion