Just In
- 27 min ago
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
- 2 hrs ago
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- 5 hrs ago
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- 6 hrs ago
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
Don't Miss
- News
50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే
- Movies
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Lohri 2021 : భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా...
హిందూ పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల వారు "భోగి" పండుగను జరుపుకుంటారు.
సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2021లో జనవరి 13వ తేదీ భోగి పండుగ వచ్చింది. ఈ సమయంలో పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగురోజుల పాటు జరుపుకునే ఈ పండుగను.. తెలంగాణలో మాత్రం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు రోజుల పాటు ఈ పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామాల్లోని వీధులలో, కూడళ్లలో భోగి మంటలు వేస్తారు.
అందులో పాత పుల్లలు, చెక్కముక్కలు, ఇంట్లో పనికి రాని వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత ఏమిటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
భోగి పండుగ నాడు మీకు భోగభాగ్యాలు కలగాలంటే...

భోగి మంటలు ఎందుకంటే..
భోగి మంటలను ఎందుకు వేస్తారంటే.. ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆరోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

బొమ్మల కొలువు..
ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే ఇష్టం. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

భోగి పళ్లు..
దీనికి ప్రతిగా వారంతా భోగి(రేగి)పళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. ఈ సమయంలో రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.
Happy Makar Sankranti 2021 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

సూర్యుని రూపంగా..
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

నువ్వుల నూనెతో...
భోగి పండుగ సమయంలో తెల్లవారు జామునే నిద్ర లేవాలి. స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను కచ్చితంగా మీ శరీరానికి రాసుకోవాలి. అలాగే శనగపిండితో నలుగు పెట్టుకోవాలి. ముందుగా నువ్వుల నూనె మీ బాడీ అంతా కాళ్ల దగ్గర నుండి ముఖం వరకు మొత్తం రాసుకోవాలి. అరగంట తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత మీ దరి చేరదు..! కుంకుడు కాయలనే తలకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాయలంటే దరిద్ర దేవతకు చాలా చికాకు వేస్తుందట. కుంకుడు కాయలలో ఉండే చేదును భరించలేక.. మీరు ఎప్పుడు అయితే కుంకుడు కాయలు మీ తలకు పెట్టుకుంటారో.. అందులో ఉండే రసం మీ శరీరంపై ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణం నుండి దరిద్ర దేవత వెంటనే వెళ్లిపోతుందట.

ఉతికిన బట్టలు..
ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట. అయితే కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కచ్చితంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.