For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lohri 2022 : భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా...

భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల వారు "భోగి" పండుగను జరుపుకుంటారు.

Lohri 2021: Date, Significance And Puja Vidhi Of This Festival

సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది. ఈ సమయంలో పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

Lohri 2021: Date, Significance And Puja Vidhi Of This Festival

ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగురోజుల పాటు జరుపుకునే ఈ పండుగను.. తెలంగాణలో మాత్రం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు రోజుల పాటు ఈ పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామాల్లోని వీధులలో, కూడళ్లలో భోగి మంటలు వేస్తారు.

Lohri 2021: Date, Significance And Puja Vidhi Of This Festival

అందులో పాత పుల్లలు, చెక్కముక్కలు, ఇంట్లో పనికి రాని వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత ఏమిటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భోగి పండుగ నాడు మీకు భోగభాగ్యాలు కలగాలంటే...భోగి పండుగ నాడు మీకు భోగభాగ్యాలు కలగాలంటే...

భోగి మంటలు ఎందుకంటే..

భోగి మంటలు ఎందుకంటే..

భోగి మంటలను ఎందుకు వేస్తారంటే.. ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆరోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

బొమ్మల కొలువు..

బొమ్మల కొలువు..

ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే ఇష్టం. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

భోగి పళ్లు..

భోగి పళ్లు..

దీనికి ప్రతిగా వారంతా భోగి(రేగి)పళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. ఈ సమయంలో రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

Happy Makar Sankranti 2022 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!Happy Makar Sankranti 2022 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

సూర్యుని రూపంగా..

సూర్యుని రూపంగా..

బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

నువ్వుల నూనెతో...

నువ్వుల నూనెతో...

భోగి పండుగ సమయంలో తెల్లవారు జామునే నిద్ర లేవాలి. స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను కచ్చితంగా మీ శరీరానికి రాసుకోవాలి. అలాగే శనగపిండితో నలుగు పెట్టుకోవాలి. ముందుగా నువ్వుల నూనె మీ బాడీ అంతా కాళ్ల దగ్గర నుండి ముఖం వరకు మొత్తం రాసుకోవాలి. అరగంట తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత మీ దరి చేరదు..! కుంకుడు కాయలనే తలకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాయలంటే దరిద్ర దేవతకు చాలా చికాకు వేస్తుందట. కుంకుడు కాయలలో ఉండే చేదును భరించలేక.. మీరు ఎప్పుడు అయితే కుంకుడు కాయలు మీ తలకు పెట్టుకుంటారో.. అందులో ఉండే రసం మీ శరీరంపై ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణం నుండి దరిద్ర దేవత వెంటనే వెళ్లిపోతుందట.

ఉతికిన బట్టలు..

ఉతికిన బట్టలు..

ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట. అయితే కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కచ్చితంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.

English summary

Lohri 2022: Date, Significance And Puja Vidhi Of This Festival

Lohri is considered to be one of the significant festivals for people belonging to the northern states of India. Since the festival is observed a day before Makar Sankranti and therefore, the festival will be observed on 13 January 2021.
Desktop Bottom Promotion