Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
lohri 2023: భోగి పండుగ నాడు మీకు భోగభాగ్యాలు కలగాలంటే...
ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట.
చాంద్ర మాసం పాటించే హిందువులు సౌర మానం ప్రకారం జరుపుకునే పర్వదినాలలో అతి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే పర్వదినాన్నే భోగి పండుగ అంటారు. ఈరోజున దక్షిణయానానికి చివరి రోజుగా, అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజుగా జరుపుకుంటారు. ఇదే రోజున సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ సమయంలో రైతులకు పంట చేతికి వచ్చి వాటి భోగభాగ్యాలను అనుభవించడానికి వీలు కల్పించింది. అందుకే ఈ పండుగకు భోగి అని నామకరణం చేశారు. భోగి అంటే సుఖమైన అనుభవం గల కల పండుగ అని అర్థం. ఈ సందర్భంగా భోగి పండుగ నాడు మనందరికీ భోగభాగ్యాలు కలిగేందుకు ఏయే పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

భోగి మంటల్లో..
భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలి. మీ ఇంట్లోని పాత వస్తువులలో పనికి రాని వాటిని భోగి మంటల్లో వేసేయాలి. అలాగే ఏవైనా విరిగిపోయిన వస్తువులు, స్టోర్ రూమ్ లో ఉండే వస్తువులను భోగి మంటల్లో వేసేయాలి. దీని వల్ల మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు.

నువ్వుల నూనెతో...
తెల్లవారు జామునే నిద్ర లేవాలి. స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను కచ్చితంగా మీ శరీరానికి రాసుకోవాలి. అలాగే శనగపిండితో నలుగు పెట్టుకోవాలి. ముందుగా నువ్వుల నూనె మీ బాడీ అంతా కాళ్ల దగ్గర నుండి ముఖం వరకు మొత్తం రాసుకోవాలి. అరగంట తర్వాత మీరు స్నానం చేయాలి.

దరిద్ర దేవత దరి చేరదు..!
కుంకుడు కాయలనే తలకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాయలంటే దరిద్ర దేవతకు చాలా చికాకు వేస్తుందట. కుంకుడు కాయలలో ఉండే చేదును భరించలేక.. మీరు ఎప్పుడు అయితే కుంకుడు కాయలు మీ తలకు పెట్టుకుంటారో.. అందులో ఉండే రసం మీ శరీరంపై ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణం నుండి దరిద్ర దేవత వెంటనే వెళ్లిపోతుందట.

పిప్పిని రాసుకోకూడదు..
అయితే కుంకుడుకాయ పిప్పిని ఎప్పటికీ మీ శరీరానికి వేసుకోకూడదు. కుంకుడుకాయ గుజ్జును మాత్రమే మీ బాడీకి అప్లై చేయాలి.

ఉతికిన బట్టలు..
ఈ పండుగకు సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎవరైతే ఈ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారో వారందరికీ ఈ ఏడాది పొడవునా కొత్త బట్టలకు లోటు ఉండదట. అయితే కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కచ్చితంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.

మీరు నమ్మే దేవుడిని..
భోగి పండుగ రోజున మీరు నమ్మిన దేవుడిని పూజించాలి. మీకు నచ్చిన ఆలయానికి వెళ్లాలి. ఈ పండుగకు ఒక్కటే కాదు.. ఏ పండుగకు అయినా మీరు నమ్మిన దేవుడిని పూజించాలి.

భోగి పళ్లు..
పిల్లలకు, యువతకు నచ్చే పండుగల్లో భోగి మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామునే నిద్ర లేచి.. చలికి వణుకుతూ భోగి మంటలు వేయడానికి పిల్లలు, యువత తెగ ఉత్సాహం చూపుతారు. ఆ రోజున పెద్దలందరూ తమ పిల్లలపై భోగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారు. దీన్ని శ్రీమన్నారాయణ ఆశీర్వాదంగా భావిస్తారు.

భోగి పళ్లు ఎలా వేయాలంటే..
మీ పిల్లలను తూర్పు వైపున కూర్చోబెట్టాలి. భోగి పళ్లలో చామంతి పూలరేకులు, బంతిపూల రేకులు, అక్షింతలు, నాణేలు కలిపి వారి తలపై వేయాలి. ఇది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఈ మంత్రాన్ని జపించాలి..
భోగి పళ్లు వేసి ఆశీర్వదించే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి..
‘‘ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ
ధనధాన్య అఖండ విద్యాసిద్ధి, ఐశ్వర్యసిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఆయుషు సిద్ధి కరయా
శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా‘‘
ఈ విధంగా చేస్తే మీ పిల్లలు సంతోషంగా, ఆనందంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
