Latest Updates
-
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.!
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.?
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి ఆగమనానికి మరో మూడు రోజులు సమయం మాత్రమే ఉంది. కాలనీలు, వీధుల్లో మండపాల్లోనే కాదు.. మన ఇళ్లలో పూజ గదుల్లోనూ చిట్టి గణేశుడిని కొలువుదీర్చుతాం. అయితే మండపాల్లో వినాయకుడు పదిరోజులు పూజలందుకుంటాడనే విషయం తెలిసిందే. కానీ ఇళ్లలో అన్ని రోజుల పాటు ఉంచరు. కొందరు 3, 5, 7 ఇలా కొన్ని రోజుల పాటు పూజలు చేసుకుంటారు. మరి సంప్రదాయం ప్రకారం గణపతిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే శుభప్రదమో తెలుసుకుందాం..

ఈ ఏడాది సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి పండుగ మొదలవుతుంది. ఆ రోజు నుంచి పూజలు మొదలు అనంత చతుర్ధశి సెప్టెంబర్ 25న జరిగే నిమజ్జనం ప్రకారం లంబోదరుడు విశేష పూజలు అందుకుంటారు. మండపాల్లో వివిధ అవతారాలు, ఆకారాల్లో బొజ్జ గణపయ్య కొలువుదీరుతూ విశేషంగా ఆకట్టుకుంటాడు. ఆనందం, శ్రేయస్సు, జ్ఞాన సంపాదనతో పాటు ఆటంకాల నుంచి కాపాడమని భక్తులు పూజిస్తారు. పది రోజుల పూజల తర్వాత సంప్రదాయబద్ధంగా గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఈ క్రమంలో ఇళ్లలో కొలువుదీరే గణపతిని ఎన్ని రోజులు పూజించాలనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.

ఒకటిన్నర రోజులు
చాలా వరకు ఇళ్లలో పూజ గదిలో వినాయకుడిని ఒకటిన్నర రోజుల పాటు పూజిస్తారు. అంటే వినాయకచవితి రోజు ప్రతిష్ఠించిన తర్వాత ఆ రోజు పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మరుసటి రోజు ఉదయం పూజ అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇది కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. తక్కువ రోజులు ఉంచినంత మాత్రాన పూజ ప్రాముఖ్యత తగ్గిపోదని పండితులు అంటున్నారు. మీ ఇళ్లలో ఈ సంప్రదాయం ఉంటే అందుకు అనుగుణంగా పూజ, నిమజ్జనం చేయవచ్చు.

మూడు రోజుల పూజలు
మరికొందరు తమ ఇళ్లలో గణేశుడిని మూడు రోజుల పాటు పూజిస్తారు. మూడో రోజు ఆచారం ప్రకారం నిమజ్జనానికి తీసుకెళ్తారు. కుటుంబీకులందరూ ఐకమత్యంగా లంబోదరుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు. ఈ పద్ధతిని సాంప్రదాయంగా పాటిస్తుంటారు. మరికొందరు మూడు రోజుల పూజ అనంతరం నిమజ్జనం చేయకుండా దగ్గరలోని గణేశ్ మండపం వద్ద ఉంచుతారు.

ఐదు రోజుల సంప్రదాయం
కొన్ని కుటుంబాల్లో వినాయకుడి విగ్రహానికి ఐదు రోజుల పాటు కూడా పూజలు నిర్వహించే సంప్రదాయం ఉంది. వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన తర్వాత ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాల అనంతరం విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూజలు చేసే వీలు, సదుపాయం ఉన్నవారు పదిరోజుల పాటు కూడా తమ ఇంట్లోనే ఉంచి పూజిస్తారు.
గణేశుడిని మన పూజ గదిలో కొలువుదీర్చినంత మాత్రాన పది రోజులు పూజ చేయాలనే సంప్రదాయం ఏమీ లేదు. కొన్ని కుటుంబాలు, ప్రాంతాల్లో సంప్రదాయాలకు అనుగుణంగా గణనాథుడిని పూజించి నిమజ్జనం చేసి మళ్లీ వినాయకచవితి వరకు ఆ ఆధ్యాత్మిక క్షణాలను మదిలో దాచుకుంటారు.



Click it and Unblock the Notifications
