For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువరాణిని కిడ్నాప్ చేసిన చిలిపి కృష్ణుడి.. ఆసక్తికర లవ్ స్టోరీ..!

కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కూడా.. ఒక యువరాణిని తన పెళ్లికి ముందు కిడ్నాప్ చేయాడు ? ఎందుకు కిడ్నాప్ చేశాడు ? ఎవరిని కిడ్నాప్ చేశాడు ? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

By Swathi
|

సినిమాల్లో, సీరియల్స్ లో చూసే కిడ్నాపులు, డ్రామాలు, ఎత్తుకెళ్లి పెళ్లిచేసుకునే సీన్సన్నీ కేవలం ఇప్పటికి పరిమితం అయినవి కాదు. ఒకసారి చిలిపి కృష్ణుడిని గుర్తుచేసుకోండి. తాను ఎంతగానో ఇష్టపడే రుక్మిణీని కూడా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడట.

Lord Krishna Kidnapped Princess Rukmini

అల్లరి, చిలిపి పనులు, కొంటె పనులకు పెట్టింది పేరు కృష్ణుడు. బావిలో స్నానాలు చేస్తున్న గోపికల బట్టలు ఎత్తుకెల్లడం నుంచి, వాళ్ల మట్టి కుండలు పగలగొట్టడం వంటి అల్లరి పనులు.. చాలా ఆసక్తికరంగా ఉంటారు. కానీ మీకు తెలుసా.. కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కూడా.. ఒక యువరాణిని తన పెళ్లికి ముందు కిడ్నాప్ చేయాడు ? ఎందుకు కిడ్నాప్ చేశాడు ? ఎవరిని కిడ్నాప్ చేశాడు ? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

విదర్భ రాజు

విదర్భ రాజు

విదర్భ రాజుకి ఇద్దరు పిల్లలు. యువరాజు రుక్మి, యువరాణి రుక్మిణి. కంసుడు రుక్మి స్నేహితుడు. శ్రీకృష్ణుడికి బద్ధ శత్రువు. ఇతను కంసుడిని సన్నిహితుడైన శిశుపాలుడు రుక్మి సోదరి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని భావించాడు.

శ్రీకృష్ణుడి గురించి

శ్రీకృష్ణుడి గురించి

రుక్మిణి తన చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడి శౌర్యం గురించి అనేక కథలు వినింది. అతననినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. శిశుపాలుడిని తనకిచ్చి పెళ్లి చేయాలని తన సోదరుడు నిర్ణయించాడని తెలిశాక.. పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడిని చేసుకోవాలి లేదా చనిపోవాలని నిర్ణయించుకుంది.

ప్రేమ గురించి

ప్రేమ గురించి

తాను ఎంతగానో నమ్మే చెలికత్తే సునంద, బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణుడికి ఓ లేఖ రాయమని వివరించింది. ఈ లేఖలో తన ప్రేమను, శ్రీకృష్ణుడి తన భర్తగా భావించానని వివరించింది. అంతేకాదు పెళ్లికి ముందే తనను తీసుకెళ్లిపోవాలని కోరింది. అయితే తన కుటుంబ సభ్యులను చంపకుండా.. తనను తీసుకెళ్లాలని వివరిస్తుంది.

శ్రీకృష్ణుడు కూడా

శ్రీకృష్ణుడు కూడా

మరోవైపు శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి అందం గురించి చాలా విన్నాడు. అతను ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ తన విరోధి అయిన కంసుడు వాళ్ల కుటుంబానికి స్నేహితుడు కావడంతో.. ఆ విషయం గురించి ప్రస్తావించలేదు.

కిడ్నాప్

కిడ్నాప్

సినిమా స్టైల్లో రుక్మిణిని శ్రీకృష్ణుడు కిడ్నాప్ చేశాడు. బలరాముడి సహాయం తీసుకుని.. రుక్మిణిని తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అపహరించుకుని వస్తాడు.

రుక్మి

రుక్మి

రుక్మిణి సోదరుడు రుక్మికి శ్రీకృష్ణుడే ఆమెను అపహరించుకునిపోయాడని తెలిసి.. శ్రీకృష్ణుడిని చంపైనా ఆమెను వెనక్కి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. కానీ తన కుటుంబ సభ్యులను చంపనని శ్రీకృష్ణుడు రుక్మిణికి మాట ఇవ్వడం వల్ల అతన్ని వదిలిపెడతాడు.

శిక్ష

శిక్ష

అయితే రుక్మిణి సోదరుడి జుట్టుని కత్తిరించి, మీసాలను సగం కట్ చేసి అవమానపరుస్తాడు. ఆ తర్వాత అతన్ని వదిలిపెడతాడు.

వివాహం

వివాహం

ఆ తర్వాత రుక్మిణిని ద్వారాకాకు తీసుకెళ్లిన శ్రీకృష్ణుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇలా కిడ్నాప్ చేసి..రుక్మిణిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు.

English summary

Lord Krishna Kidnapped Princess Rukmini On The Day Of Her Marriage!

Lord Krishna Kidnapped Princess Rukmini On The Day Of Her Marriage! Jarasandha, the ruler of Magadha was also Rukmi's friend and wished for this alliance.
Desktop Bottom Promotion