For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరుమల తిరుపతి ఆలయాన్ని ఆగస్టు 11 నుంచి మూసేస్తున్నారు, మూసివేసినప్పుడు లోపల ఏం చేస్తారో తెలుసా?

చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా ఆలయాన్ని ఎక్కువ రోజులు మూసివేయనున్నారు. టీటీడీ ఆలయాన్ని ఆగస్టు 11 వతేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 17 వ తేదీ వరకు మూసేస్తున్నారు.

|

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా ఆలయాన్ని ఎక్కువ రోజులు మూసివేయనున్నారు. టీటీడీ ఆలయాన్ని ఆగస్టు 11 వతేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 17 వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే తిరుపతి దేవస్థానం గురించి ప్రపంచం మొత్తం తెలుసు.

బాలా లయ సంప్రోక్షణ

బాలా లయ సంప్రోక్షణ

తిరుపతి ఆలయంలో అష్ట బంధన బాలా లయ సంప్రోక్షణ చేపడుతున్న కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.ఒకవేళ ఆగస్టు 10వ తేదీ స్వామివారి దర్శనం ఉన్నా కూడా అప్పటి వరకు క్యూ లైన్ లో ఉండే వారికి మాత్రమే ఉంటుంది. ఆగస్టు 17వ తేదీన ఉదయం 6 నుంచి మళ్లీ స్వామి వారి దర్శనం ఉంటుంది.

ఆరు రోజుల పాటు మూసివేస్తారు

ఆరు రోజుల పాటు మూసివేస్తారు

మొత్తానికి తిరుపతిలోని తిరుమల కొండపైన ఉన్న వెంకటేశ్వర ఆలయాన్ని ఆరు రోజుల పాటు మూసివేస్తారు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా సంప్రోక్షణ అనే పవిత్రమైన కార్యక్రమం చేస్తారు.

ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పూజారులు మాత్రమే ఆ సమయంలో ఆలయంలోనే ఉంటారు.

భక్తుల సంఖ్య మరింత పెరిగింది

భక్తుల సంఖ్య మరింత పెరిగింది

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయాన్ని కొన్ని రోజుల పాటు మూసి వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడంతో కొండపైకి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. రోజూ లక్షలాది మందికి ఆలయాన్నిసందర్శిస్తున్నారు.

1958లో దీన్ని ప్రారంభించారు

1958లో దీన్ని ప్రారంభించారు

మహా సంప్రోక్షణలో భాగంగా దేవస్థానం అన్ని రకాల సేవల్ని కూడా నిలిపివేసింది. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు జయ విజయలను దాటనివ్వరు. అలాగే ఆలయ సిబ్బందినీ రాములోరి మేడ వరకే అనుమతిస్తారు. పుష్కరాల మాదిరిగానే తిరుమతి తిరుపతిలోని వేంకటేశ్వరుడికి పన్నెండు ఏళ్లకొకసారి చేసేది అష్టబంధన బాలా లయ మహా సంప్రోక్షణ.

1958లో దీన్ని ప్రారంభించారు. 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మహా సంప్రోక్షణలో భాగంగా ఆలయంలో కొన్ని మరమ్మతులు కూడా చేస్తారు. చాలా రకాల పూజలు కూడా నిర్వహిస్తారు.

వేదాలతో దిక్కులు పెక్కటిళ్లుతాయి

వేదాలతో దిక్కులు పెక్కటిళ్లుతాయి

ఇందులో అష్టబంధనం కార్యక్రమం చాలా ముఖ్యమైనది. వందలాది రుత్వికులు, వేద పండితులు, వేద విద్యార్థులతో నిర్వహించే కొన్ని కార్యక్రమాలను చూసే భాగ్యం ఉండదు కానీ వేదమంత్రాలతో దిక్కులు పెక్కటిళ్లుతాయి. శ్రీవారిని కుంభంలోకి ఆహ్వానించడం కీలకఘట్టం. కుంభానికి శక్తి నింపడం, చివరి రోజున కుంభాన్ని తిరిగి స్వామి లోకి పంపడం మహా సంప్రోక్షణలో కీలక ఘట్టాలు. మనకు ఇవన్నీ చూసే భాగ్యం ఉండదు.

2530 కోట్ల కంటే ఎక్కువగా బడ్జెట్

2530 కోట్ల కంటే ఎక్కువగా బడ్జెట్

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏటా సుమారు 35 మిలియన్ల మంది సందర్శిస్తారు. ఇక ప్రపంచంలోని ధనిక దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఏటా రూ. 2530 కోట్ల కంటే ఎక్కువగా శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ ఉంటుంది. రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల ఆలయాన్ని సందర్శిస్తారు.

తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్ ను మొదట ఆలయానికి సంబంధించిన ఐదు మంది నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఈ సభ్యుల సంఖ్య పద్దెనిమిది మందికి పెరిగింది. ఇక మీరు ఆగస్టు 10 నుంచి 17 వ తేదీల మధ్యలో తిరుమలకు వెళ్లాలనుకుంటే మాత్రం మీ పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిది.

English summary

lord venkateswara tirumala tirupati temple to remain closed for six days from august

lord venkateswara tirumala tirupati temple to remain closed for six days from august
Story first published:Tuesday, August 7, 2018, 12:02 [IST]
Desktop Bottom Promotion