For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lunar Eclipse 2023 fasting rules: చంద్ర గ్రహణం వేళ ఏయే పనులు చేయాలి.. ఏవి చేయకూడదో ఇప్పుడే తెలుసుకోండి...

|

2023 సంవత్సరంలో మే నెలలో మరికొన్ని గంటల్లో తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ మొదటి చంద్ర గ్రహణం సూర్య గ్రహణం ఏర్పడిన 15 రోజుల తర్వాతే ఏర్పడనుంది. ఇదే రోజున బుద్ధ పూర్ణిమ కూడా రావడం మరో విశేషం.

Lunar Eclipse fasting rules: What to eat, what to avoid during chandra grahan in Telugu

మే నెలలో 5వ తేదీన అంటే శుక్రవారం నాడు ఉదయం 7:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు పూర్తవుతుంది. రెండో చంద్ర గ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడనుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి.

Lunar Eclipse fasting rules: What to eat, what to avoid during chandra grahan in Telugu

ఈ చంద్ర గ్రహణానికి సరిగ్గా తొమ్మిది గంటల ముందుగా సూతక్ కాలం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ కాలంలో భూమి యొక్క వాతావరణం కలుషితం అవుతుంది.

Lunar Eclipse fasting rules: What to eat, what to avoid during chandra grahan in Telugu

ఈ చంద్ర గ్రహణం సమయంలో 5వ తేదీన జరిగే చంద్రగ్రహణం భారత్ లో కనిపించదు కాబట్టి ఇక్కడ సూతక్ కాలం ఉండదు. అయితే గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రం సూతక్ కాలం వర్తిస్తుంది. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!

గ్రహణానికి ముందు..

గ్రహణానికి ముందు..

చంద్ర గ్రహణం ప్రారంభం కాకముందే మీరు తినే ఆహారాల్లో తులసి ఆకులను తప్పకుండా వేయాలి. ఇక గ్రహణం కనిపించే సమయంలో అంటే సూతక్ కాలం వర్తించే ప్రాంతాల్లో గర్భిణులు ఇంటి నుండి అస్సలు బయటకు వెళ్లకూడదు. గ్రహణ సమయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకరాదు. మీ ఇష్టదేవుడిని మాత్రం స్మరించుకోవాలని పండితులు చెబుతున్నారు.

గ్రహణం వేళ..

గ్రహణం వేళ..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఘన రూపంలో అయినా లేదా ద్రవ రూపంలో అయినా సూతక్ కాలంలో తినడాన్ని నిషేధించారు. అయితే పిల్లలు, రోగులు, వయోజనులు అవసరమైతే సూతక్ కాలంలో కొంత ఆహారాన్ని తీసుకోవచ్చు.

Chandra Grahan 2022:ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది?Chandra Grahan 2022:ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది?

ఇవి చేయొద్దు..

ఇవి చేయొద్దు..

గ్రహణం సమయంలో నూనె మసాజ్, నీళ్లు తాగడం, మలమూత్ర విసర్జనలకు వెళ్లడం, జుట్టు దువ్వడం, పళ్లు తోముకోవడం మరియు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా నిషేధించబడ్డాయి. అలాగే గ్రహణం సమయంలో గోర్లు కత్తిరించుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీని వల్ల అశుభ ఫలితాలొస్తాయి. అలాగే కత్తులు, ఫోర్క్ ఇతర పదునైన వస్తువులను వాడొద్దు.

గ్రహణం తర్వాత..

గ్రహణం తర్వాత..

చంద్ర గ్రహణం ముగిసిన వెంటనే ప్రతి ఒక్కరూ విధిగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. గోధుమలు, బియ్యం, ఇతర త్రుణ ధాన్యాలు మరియు ఊరగాయలు వంటి ఆహార పదార్థాలను వండుకోవాలి. అలాగే గ్రహణం తర్వాత మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి.

FAQ's
  • 2022లో తొలి చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?

    2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన అంటే సోమవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం ప్రభావం ఇక్కడ ఉండదు. అయితే చంద్ర గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Lunar Eclipse fasting rules: What to eat, what to avoid during chandra grahan in Telugu

Here we are talking about the Lunar Eclipse 2023 fasting rules: What to eat, what avoid during chandra grahan in Telugu. Read on
Desktop Bottom Promotion