Just In
- 1 hr ago
జూలై 12 నుండి మకరరాశిలోకి శని సంచారం; రాబోయే 6 నెలలు, శని ఈ రాశులపై కోపంగా ఉంటారు..జాగ్రత్త!!
- 4 hrs ago
Dandruff problem: మౌత్ వాష్ వల్ల చుండ్రు పూర్తిగా పోతుంది... వెంటనే ట్రై చేయండి...
- 6 hrs ago
Asthma: ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే..ఈ ప్రధాన సమస్యలతో పాటు ప్రాణాంతకం అని తెలుసుకోండి..
- 11 hrs ago
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
Don't Miss
- Finance
Cheque New Rules: చెక్కు రూల్స్ మారాయి.. అలా చేయకపోతే చెక్కులు రిజెక్ట్ అవుతాయి.. ఎప్పటి నుంచి అమలులోకంటే..
- Sports
MS Dhoni Birthday:పాక్ అధ్యక్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను మహీ ఎందుకు తీసేసాడంటే.?
- News
ముప్పవరపు వెంకయ్యనాయుడు విషయంలో స్పష్టత వచ్చినట్లేగా?
- Movies
Bimbisara నైజాం హక్కులను దక్కించుకున్న దిల్ రాజు.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ డీల్!
- Automobiles
కొత్త 2022 కియా సెల్టోస్ టెలివిజన్ కమర్షియల్ రిలీజ్.. ఇది భారత మార్కెట్లో విడుదలయ్యేనా?
- Technology
టెక్నో స్పార్క్ 8P బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Lunar Eclipse 2022 fasting rules: చంద్ర గ్రహణం వేళ ఏయే పనులు చేయాలి.. ఏవి చేయకూడదో ఇప్పుడే తెలుసుకోండి...
2022 సంవత్సరంలో మే నెలలో మరికొన్ని గంటల్లో తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ మొదటి చంద్ర గ్రహణం సూర్య గ్రహణం ఏర్పడిన 15 రోజుల తర్వాతే ఏర్పడనుంది. ఇదే రోజున బుద్ధ పూర్ణిమ కూడా రావడం మరో విశేషం.
మే నెలలో 16వ తేదీన అంటే సోమవారం నాడు ఉదయం 7:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు పూర్తవుతుంది. రెండో చంద్ర గ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడనుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి.
ఈ చంద్ర గ్రహణానికి సరిగ్గా తొమ్మిది గంటల ముందుగా సూతక్ కాలం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ కాలంలో భూమి యొక్క వాతావరణం కలుషితం అవుతుంది.
ఈ చంద్ర గ్రహణం సమయంలో 15వ తేదీన ఆదివారం రోజున ఉదయం 10:58 గంటలకు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. తర్వాతి రోజున అంటే సోమవారం నాడు ఉదయం 11:58 గంటలకు పూర్తవుతుంది. ఈ తొలి చంద్ర గ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక్ కాలం అనేది చెల్లుబాటు కాదు. అయితే గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రం సూతక్ కాలం వర్తిస్తుంది. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Lunar
Eclipse
May
2022
Astrology
:ఈ
ఏడాది
తొలి
చంద్ర
గ్రహణం
వేళ
ఈ
రాశులకు
చాలా
కష్టాలు...!

గ్రహణానికి ముందు..
చంద్ర గ్రహణం ప్రారంభం కాకముందే మీరు తినే ఆహారాల్లో తులసి ఆకులను తప్పకుండా వేయాలి. ఇక గ్రహణం కనిపించే సమయంలో అంటే సూతక్ కాలం వర్తించే ప్రాంతాల్లో గర్భిణులు ఇంటి నుండి అస్సలు బయటకు వెళ్లకూడదు. గ్రహణ సమయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకరాదు. మీ ఇష్టదేవుడిని మాత్రం స్మరించుకోవాలని పండితులు చెబుతున్నారు.

గ్రహణం వేళ..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఘన రూపంలో అయినా లేదా ద్రవ రూపంలో అయినా సూతక్ కాలంలో తినడాన్ని నిషేధించారు. అయితే పిల్లలు, రోగులు, వయోజనులు అవసరమైతే సూతక్ కాలంలో కొంత ఆహారాన్ని తీసుకోవచ్చు.
Chandra
Grahan
2022:ఈ
ఏడాది
సంపూర్ణ
చంద్ర
గ్రహణం
ఎప్పుడు?
ఎక్కడ
కనిపిస్తుంది?

ఇవి చేయొద్దు..
గ్రహణం సమయంలో నూనె మసాజ్, నీళ్లు తాగడం, మలమూత్ర విసర్జనలకు వెళ్లడం, జుట్టు దువ్వడం, పళ్లు తోముకోవడం మరియు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా నిషేధించబడ్డాయి. అలాగే గ్రహణం సమయంలో గోర్లు కత్తిరించుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీని వల్ల అశుభ ఫలితాలొస్తాయి. అలాగే కత్తులు, ఫోర్క్ ఇతర పదునైన వస్తువులను వాడొద్దు.

గ్రహణం తర్వాత..
చంద్ర గ్రహణం ముగిసిన వెంటనే ప్రతి ఒక్కరూ విధిగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. గోధుమలు, బియ్యం, ఇతర త్రుణ ధాన్యాలు మరియు ఊరగాయలు వంటి ఆహార పదార్థాలను వండుకోవాలి. అలాగే గ్రహణం తర్వాత మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి.
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన అంటే సోమవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం ప్రభావం ఇక్కడ ఉండదు. అయితే చంద్ర గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...