For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gupt Navratri 2021:గుప్త నవరాత్రి ఎప్పుడు? అమ్మవారిని ఎలా ఆరాధిస్తే అనుగ్రహం లభిస్తుంది...!

గుప్త నవరాత్రి 2021 యొక్క పూజా విధి మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

హిందూ మతంలో మాఘ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చే నవరాత్రులు ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయి.

Magha Gupt Navratri 2021 : Dates, Puja Vidhi and Significance in Telugu

సాధారణంగా సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వచ్చినప్పటికీ, చైత్ర మరియు శారద నవరాత్రుల సమయంలో ప్రజలు ఎక్కువగా వేడుకలను జరుపుకుంటారు. అయితే మాఘ మరియు ఆషాఢ మాసాలలో కూడా నవరాత్రుల పండుగ వస్తుంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు.

Magha Gupt Navratri 2021 : Dates, Puja Vidhi and Significance in Telugu

ఈ సమయంలో తాంత్రిక మరియు అరుదైన శక్తులను పొందాలనుకునేవారికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి గుప్త నవరాత్రులు ఈ నెలలో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి.. ఈ సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధిస్తే.. ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mauni Amavasya 2021:ఈ అమావాస్య రోజున ఏమి దానం చేస్తే శుభఫలితాలొస్తాయో తెలుసా...Mauni Amavasya 2021:ఈ అమావాస్య రోజున ఏమి దానం చేస్తే శుభఫలితాలొస్తాయో తెలుసా...

శుభ సమయం..

శుభ సమయం..

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం గుప్త నవరాత్రులు ఫిబ్రవరి 12వ తేదీన అంటే శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి.

అభిజిత్ ముహుర్తం ఉదయం 8:34 నుండి రాత్రి 9:55 గంటల వరకు.. మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి 13:12 గంటల వరకు ఉంటుంది.

ఏయే రూపాల్లో..

ఏయే రూపాల్లో..

ఈ గుప్త నవరాత్రుల్లోని తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని ఈ రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు.

ఫిబ్రవరి 12న తొలిరోజు కాళికా దేవి..

ఫిబ్రవరి 13న రెండో రోజు త్రిపుర తారా దేవి

ఫిబ్రవరి 14న మూడో రోజు సుందరీ దేవి

ఫిబ్రవరి 15న నాలుగో రోజు భువనేశ్వరి దేవి

ఫిబ్రవరి 16న ఐదో రోజు మాతా చిత్రమాస్తా త్రిపుర దేవి

ఫిబ్రవరి 17న ఆరో రోజు భైరవి దేవి

ఫిబ్రవరి 18న ఏడో రోజు మాధుమతి దేవి

ఫిబ్రవరి 19న ఎనిమిదో రోజు మాతా బాగలముఖి దేవి

ఫిబ్రవరి 20న తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా అలంకరించి పూజిస్తారు.

అమ్మవారి అనుగ్రహం కోసం..

అమ్మవారి అనుగ్రహం కోసం..

ఈ గుప్త నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేయాలి. పురాణాల ప్రకారం, ఈ సమయంలో తాంత్రిక మరియు అఘోరాలు అర్థరాత్రి వేళ దుర్గాదేవిని ఆరాధిస్తారట. సాధారణ భక్తులైతే దుర్గాదేవి విగ్రహం లేదా ఆ తల్లి చిత్రపటం ఎదుట ఎర్ర సింధూరం మరియు బంగారు పూసల ఆభరణాలను ఉంచి, కొబ్బరినీళ్లతో పాటు ఐదు రకాల పండ్లను ఆ తల్లి పాదాల వద్ద ఉంచి పూజిస్తారు. అలాగే దుర్గాదేవికి ఎర్రని రంగులో పువ్వులని అర్పిస్తే శుభఫలితాలుంటాయని పండితులు చెబుతుంటారు. అనంతరం ఆవ నూనెతో దీపం వెలిగించి ‘ఓం దున్ దుర్గాయ్ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

మౌని అమావాస్య రోజున ఆ నది నీళ్లు అమృతంలా మారిపోతాయా?మౌని అమావాస్య రోజున ఆ నది నీళ్లు అమృతంలా మారిపోతాయా?

ప్రత్యేక పూజలు ఎందుకంటే..

ప్రత్యేక పూజలు ఎందుకంటే..

గుప్త నవరాత్రులు తంత్ర సాధనకు ముఖ్యమైన సమయంగా భావిస్తారు. ఒక నిర్దిష్ట కాలంలో విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు, దేవతల యొక్క శక్తి తగ్గిపోతుంది. అప్పుడు యమ లేదా వరుణిడి ఆధిపత్యం భూమి పెరుగుతుంది. అలాంటి సమయంలోనే విపత్తులు మరియు బీభత్సం నుండి బయటపడేందుకు దుర్గాదేవిని గుప్త నవరాత్రుల సమయంలో పూజిస్తారు. ఈ సమయంలో దుర్గాదేవిని పూజించడం వల్ల వీటితో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయట.

శత్రువుల నుండి విముక్తి..

శత్రువుల నుండి విముక్తి..

ఈ గుప్త నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించే సమయంలో దుర్గా సప్తశతి, దుర్గా చాలిసా మరియు దుర్గా సహస్రణం పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయని, గుప్త నవరాత్రి అద్భుతమైన శక్తులను సాధించడంతో పాటు సంపద పెరుగుతుందని.. మరీ ముఖ్యంగా శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని.. ప్రసవానికి కూడా అనుకూలంగా ఉంటుందని చాలా మంది నమ్మకం.

ఉత్తమ ప్రయోజనాలు..

ఉత్తమ ప్రయోజనాలు..

గుప్త నవరాత్రి సమయంలో దేవత యొక్క కోపాన్ని తగ్గించేందుకు ఆషాఢ నవరాత్రి లేదా గుప్త నవరాత్రి వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయి. భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు.

English summary

Magha Gupt Navratri 2021 : Dates, Puja Vidhi and Significance in Telugu

Here we are talking about the Magha Gupt Navratri : Dates, puja vidhi and significance in Telugu. Read on,
Story first published:Thursday, February 11, 2021, 17:10 [IST]
Desktop Bottom Promotion