Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కుంభమేళా సమయంలో మీ ఇంట్లో పిల్లలు పుడితే..ఈ పేర్లు పెట్టుకుంటే మంచిది!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో గత నెలలో ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రి( ఫిబ్రవరి 26)వరకు కొనసాగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 50 కోట్లమందికిపైనే ప్రయాగరాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళా సమయంలో పుణ్యస్నానం చేసేందుకు ప్రయాగరాజ్ వెళ్లిన కొంతమంది మహిళలు అక్కడే పిల్లలి జన్మనిచ్చారు.
గర్భవతి అయిన మహిళలు కొందరు ఇటీవల మహా కుంభ స్నానానికి వచ్చారు. ఆ సమయంలో పురిటి నొప్పులు రావడంతో వారిని సెక్టార్-2లో ఉన్న 100 పడకల సెంట్రల్ హాస్పిటల్ లో చేర్చించగా మొత్తంగా 14మంది పిల్లలు అక్కడ జన్మించారు. మొదటి బిడ్డ డిసెంబర్ 29, 2024న జన్మించగా, ఆ శిశవుకి కుంభం అని పేరు పెట్టారు.

14 మంది నవజాత శిశువులు జన్మించడం ఒక ప్రత్యేకమైన యాదృచ్చికం కారణంగా మహా కుంభమేళా 2025 చారిత్రాత్మకంగా మారింది. వీరిలో 8 మందిఅబ్బాయిలు 6 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎలాంటి ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవం ద్వారా జన్మించారు. వీరికి కుంభ, గంగా, యమునా, నంది వంటి పేర్లు పెట్టారు. అయితే మహాకుంభమేళా కొనసాగుతున్న సమయంలో మీ ఇంట్లో పిల్లలు పుడితే వారికి కూడా మతవిశ్వాసాలకు కి సంబంధించిన పేరు పెట్టాలనుకుంటే మీ బిడ్డకు మంచి చేసే కొన్ని పేర్లను ఇక్కడ చూడండి.
మహా కుంభం పవిత్రత, మతతత్వం, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే కొన్ని పేర్లు ఇవే
అబ్బాయిలు పుడితే ఈ పేర్లు
కుంభ: కుంభ అంటే కుండ. కుంభాన్ని పవిత్ర కలశం అని కూడా పిలుస్తారు.
ప్రయాగేష్ - ప్రయాగరాజ్ ప్రభువు
పార్థివ్ - పవిత్ర భూమితో సంబంధం కలిగి ఉన్నవాడు
పుణ్యేష్ - సద్గుణాల ప్రదాత
తీర్థేష్ - తీర్థయాత్రలకు ప్రభువు
తపేష్ - తపస్సు చేసేవాడు
శరణేష్ - ఆశ్రయం ఇచ్చేవాడు (విష్ణువు)
మహదేవ్ - శివుని పేరు
శివాంశ్ - శివుని భాగం
దివ్యాన్ష్ - దైవత్వం కలిగినవాడు
జలధర్ - నీటిని పట్టుకున్నవాడు
గంగాధరుడు - గంగను (శివుడు) పట్టుకున్నవాడు
యమునేష్ - యమునా నది దేవుడు
నంది - శివుడిని మోసే ఎద్దు పేరు
శంకర్ - శివుడి పేరు
హరి - శివుడు, విష్ణువు పరాసుల మిశ్రమ రూపం
సింధు - సముద్రం, విశాలతకు చిహ్నం
అశ్వత్థ - పవిత్రమైన రావి చెట్టు
ఉజ్జ్వల్ - ప్రకాశించేవాడు, స్వచ్ఛతకు చిహ్నం
సత్యం - సత్య మార్గంలో నడిచేవాడు
హరిదత్తుడు - శ్రీ హరి
వేదాంశం - వేదాలలో భాగం
సంగ్మేష్ - సంగమ దేవుడు
ఆదిత్య - సూర్యుని పేరు
అమ్మాయిల పేర్లు
త్రివేణి - మూడు నదుల సంగమం
సంగమిత - సంగంతో సంబంధం కలిగి ఉంటుంది
దీక్ష - మతపరమైన ఆచారానికి చిహ్నం
సౌమ్య - సున్నితమైన, ప్రశాంతమైన
సరస్వతి - జ్ఞానం,అభ్యాసకు చిహ్నాం
యమునా - పవిత్ర యమునా నది పేరు
గంగా - పవిత్ర నది గంగా
అర్చిత - పూజకు అర్హమైనది
భవ్య - దివ్యమైన, అందమైన
సంధ్య - సాయంత్రం పవిత్ర సమయం
ఆరాధ్య - పూజనీయమైన
మంజరి - పూల మొగ్గ
అమృతం - అమృతంతో చేసిన
శివాని - దుర్గాదేవి పేరు
నర్మద - నది పేరు నర్మద
కావేరి - దక్షిణ భారతదేశ పవిత్ర నది
వినీత - వినయానికి చిహ్నం
కల్పన - సృజనాత్మకతకు దేవత
అద్విత - ఇతరుల నుండి భిన్నమైనది
చారులత - అందం, స్వచ్ఛతకు చిహ్నం
ముక్తా - ముత్యం, స్వచ్ఛతకు చిహ్నం
తులసి - పవిత్ర మొక్క
అన్విత - స్వీయ-సాక్షాత్కారాన్ని పొందినవారు
రిత్విక - పవిత్రమైన ఆచారాలను ఆచరించేవారు



Click it and Unblock the Notifications