కుంభమేళాకి వెళ్తున్నారా? ఈ చెట్టుని చూడటం మర్చిపోవద్దు..ప్రపంచంలోనే ఇలాంటిది లేదు!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఘనంగా కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ప్రయాగరాజ్ వెళ్తే కల్పవృక్షంగా పిలువబడే ఓ చెట్టుని కూడా తప్పక సందర్శించాల్సిందే.

పురాణాలలో కల్పవృక్షాన్ని సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన దివ్య వృక్షంగా పరిగణిస్తారు. వేల సంవత్సరాల పాటు జీవించే కల్పవృక్షాన్ని కోరికలు తీర్చే వృక్షంగా కూడా పరిగణిస్తారు. ప్రపంచంలోని రెండవ పురాతన కల్పవృక్షం ప్రయాగ్‌రాజ్‌ నగర శివార్లలో ఉండే ఝూసీ అనే టౌన్ లో ఉంది. ఈ చెట్టు వయస్సు 800 సంవత్సరాల పైనే ఉంది. ప్రజలు ఈ చెట్టుని బుధబాబా అని పిలుచుకుంటారు.

maha kumbh mela 2025 world second oldest kalpavriksh has been alive for 800 years in prayagraj jhusi

ఆఫ్రికాలో మొదటిది

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI) శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ప్రయాగ్‌రాజ్, బారాబంకిలో ఉన్న కల్పవృక్షం రెండు చెట్లు 800 సంవత్సరాల నాటివని గుర్తించారు.. మూడవ పురాతన కల్పవృక్షం శ్రీలంకలోని మన్నార్ పట్టణంలో ఉంది, దీని వయస్సు 750 సంవత్సరాలు. ప్రపంచంలో అత్యంత పురాతన కల్పవృక్షం ఆఫ్రికాలో ఉంది, దాని వయస్సు రెండు వేల సంవత్సరాలు. యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోస్కోపీ (AMS) టెక్నిక్ నుండి పొందిన రేడియోకార్బన్ ఆధారంగా ఈ చెట్ల వయస్సుని అంచనా వేశారు శాస్త్రవేత్తలు.

ప్రయాగ్‌రాజ్‌లోని ఝూసీలో ఉన్న కల్పవృక్షంతో పాటుగా బారాబంకిలోని కింటూర్‌లో ఉన్న కల్పవృక్షం దాదాపు 1200 సంవత్సర కాలంలో పెరగడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చెట్టు ఆఫ్రికన్, అరబ్ నావికులు.. హిందూ మహాసముద్రపు తీర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి వచ్చిన పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ ఆక్రమణదారుల ద్వారా భారతదేశానికి చేరుకుందని నమ్ముతారు.

ప్రయాగ్‌రాజ్ చెట్టు 14 మీటర్ల ఎత్తు ఉంటుంది
కల్పవృక్షం గంగా నది ఎడమ ఒడ్డున ఉన్న భారీ మట్టి దిబ్బపై విస్తరించి ఉంది. దీని వెడల్పు 21.2 మీటర్లు, ఎత్తు 14 మీటర్లు. బారాబంకి జిల్లాలోని కింటూర్ గ్రామ సమీపంలో ఉన్న పారిజాతం 13.7 మీటర్ల ఎత్తు, దానివెడల్పు 14.10 మీటర్లు.

నీరు లేకపోవడం వల్ల శక్తి ప్రభావితమవుతుంది
కల్పవృక్షం చెక్కలో నీటి శాతం దాదాపు 79 శాతం ఉంటుంది, దాని కారణంగా అది నిటారుగా ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌, బారాబంకిలో ఉన్న కల్పవృక్ష నీటిమట్టం తగ్గుముఖం పట్టడం ఆందోళనకరం.

ఔషధ గుణాలతో నిండి ఉంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కల్పవృక్షంలో పుష్కలంగా అమైనో ఆమ్లాలు, నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి, ఆవు పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్నాయి. కీటకాలను పారద్రోలే ప్రత్యేకత దీనికి ఉంది.

గంగానది కీలక పాత్ర
ఈ కల్పవృక్షాన్ని సజీవంగా ఉంచడంలో గంగానది సారవంతమైన భూమి కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అడాన్సోనియా డిజిటాటా జాతికి చెందిన ఈ చెట్టు దక్షిణాఫ్రికాలోని సవన్నా ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడి వాతావరణం ఇక్కడికి భిన్నంగా ఉంటుంది. కానీ, గంగాజలంలో లభించే మూలకాలు దానికి ప్రయోజనకరంగా ఉన్నాయి. వేసవిలో సూర్యకిరణాలు ఇసుకపై పడినప్పుడు ఈ చెట్టు సవన్నా లాంటి వాతావరణాన్ని పొందుతుంది. ఇది దాని జీవితకాలాన్ని పెంచడంలో ముఖ్యమైన అంశం.

Story first published: Friday, January 31, 2025, 10:00 [IST]
Desktop Bottom Promotion