Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మహా శివరాత్రి 2026.. జాగారం ఎందుకు చేయాలి? ఈ పర్వదినం వెనుకున్న అసలైన రహస్యం ఇదే!
శివ అంటే మంగళం అని, రాత్రి అంటే చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టేదని అర్థం. హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తాయి, పోతాయి. పగటి పూట జరుపుకునే పండుగలు సంబరాలకు ప్రతీకలైతే, రాత్రి పూట జరుపుకునే మహా శివరాత్రి మాత్రం ఆధ్యాత్మిక సాధనకు, అంతర్ముఖ ప్రయాణానికి వేదిక.
మహా శివరాత్రి 2026 ఎప్పుడు?
2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15, ఆదివారం నాడు మహా శివరాత్రి జరుపుకుంటారు. ఆదివారం సూర్యునికి (శివ స్వరూపానికి) ప్రీతిపాత్రమైన రోజు కావడం వల్ల ఈసారి శివరాత్రి మరింత విశేషమని పండితులు చెబుతున్నారు.

అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం?
మహా శివరాత్రి వెనుక ప్రధానంగా మూడు ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.
లింగోద్భవం: బ్రహ్మ, విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చినప్పుడు శివుడు ఆద్యంతాలు లేని అగ్నిస్తంభంగా అంటే శివలింగంగా ఆవిర్భవించాడు. ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. అందుకే ఈ రోజున శివలింగానికి చేసే అభిషేకం అనంతమైన ఫలితాలను ఇస్తుంది.
శివపార్వతుల కళ్యాణం: నిరాకారుడైన పరమశివుడు, శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవిని వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు ఇదేనని భక్తుల నమ్మకం.
నీలకంఠుడు: లోక రక్షణ కోసం క్షీరసాగర మథనంలో పుట్టిన విషాన్ని శివుడు మింగి, తన కంఠంలో దాచుకున్న రోజు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయనకు నిద్ర రాకుండా ఉండేందుకు దేవతలందరూ రాత్రంతా భజనలు చేశారు. అదే మన జాగరణ సంప్రదాయం.
జాగరణ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
శివరాత్రి కేవలం మతపరమైన నమ్మకం మాత్రమే కాదు దీని వెనుక సైన్స్ కూడా ఉంది. ఈ రోజున గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ప్రకృతిలో శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది.
రాత్రంతా వెన్నెముకను నిటారుగా ఉంచి నిద్రపోకుండా కూర్చోవడం వల్ల, ఈ శక్తి మన శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేస్తుందని యోగులు చెబుతారు. ఇది మనిషిని శారీరక, మానసిక రుగ్మతల నుండి విముక్తి చేసి, జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది.
ఈ రోజు ఏం చేయాలి
శివుడు అభిషేక ప్రియుడు. ఆడంబరాలు ఆయనకు అక్కర్లేదు. కేవలం భక్తితో చేసే చిన్న చిన్న కార్యాలు ఆయనకు ప్రీతి కలిగిస్తాయి.
ఉపవాసం: ఉదయం నుండి ఉపవాసం ఉండి ద్రవ పదార్థాలు లేదా పండ్లు మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల శరీరం తేలికగా మారి, ధ్యానానికి సహకరిస్తుంది.
రుద్రాభిషేకం: శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూతి, పండ్ల రసాలతో అభిషేకం చేయాలి.
బిల్వార్చన: త్రిదళం త్రిగుణాకారం.. అంటూ మూడు ఆకులు కలిగిన మారేడు దళాలను శివునికి సమర్పించడం వల్ల కోటి జన్మల పాపాలు తొలగుతాయని ప్రతీతి.



Click it and Unblock the Notifications