Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
Maha Shivratri 2022 Do's and don'ts:శివరాత్రి వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...
హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి అంకితమివ్వబడిన ఈ పండుగ మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.

మహా శివరాత్రి పండుగ ప్రతి ఏటా హిందూ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

లింగం ఉద్భవించిన ఈరోజున భోళాశంకరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఒక్కరోజున పరమేశ్వరుడిని స్మరించుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం, పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు ఎంతో గొప్పవి. శివ అంటే మంగళకరమని, పరమ మంగళకరమైనదే శివ స్వరూపమని చెబుతారు. ఈ సందర్భంగా మహా శివరాత్రి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులేంటి.. అస్సలు చేయకూడని పనులేంటి అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఉపవాసం ఉండాలి..
మహా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన అనంతరం పూజా గదిని శుభ్రం చేసుకుని శివ ప్రతిష్ట చేయాలి. పార్వతీపరమేశ్వరుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టకరం. ఈ పవిత్రమైన రోజున తనను పూజిస్తే తన పుత్రుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతాని సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడంటే ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు. ఈ పండుగ సమయంలో అంటే చతుర్దశి నాడు కచ్చితంగా ఉపవాసం ఉండాలి.

శివనామ స్మరణ..
మహా శివరాత్రి రోజున పూజా విధానాన్ని శ్రీక్రిష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. వాటిలో ఒకటి శివపూజ, ఉపవాసం, జాగారణ. వీటిలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటూ శివనామ స్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితు చెబుతారు. ఉపవాసం ఉండటం వల్ల శారీరక శుద్ధి జరుగుతుందని, జాగారణ చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయట.

చేయాల్సిన పనులు..
* మహా శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాలి.
* ‘ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి.
* శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి.
* శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి.
* మారేడు ఆకులతో ఇంట్లో, ఆలయంలో శివుడిని ఆరాధించాలి.
* ఈరోజున ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
* ఉపవాసం ఉండే వారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి.
* పురుషుడు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి.
* శివలింగానికి కచ్చితంగా జలాభిషేకం చేయాలి.
* మహా శివరాత్రి రోజున పేదలకు అన్నదానం, ఇతరుల దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
* శివుడికి చందనం, విభూదిని పెడితే సరిపోతుంది.
* నాగమల్లి పువ్వులంటే శివుడికి ఎంతగానో ఇష్టం. ఈ పువ్వులతో శివరాత్రి రోజున పూజ చేస్తే.. శివుని అనుగ్రహం దక్కుతుంది.

చేయకూడని పనులు..
* మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను ఎప్పటికీ సమర్పించకూడదు.
* మహా శివరాత్రి పండుగ రోజున శివ లింగానికి ప్యాకెట్ పాలు సమర్పించకూడదని గుర్తుంచుకోవాలి. ఆవు పాలు మాత్రమే శ్రేష్టమైనవని గుర్తుంచుకోవాలి.
* శివ లింగానికి అభిషేకం సమయంలో ఉపయోగించే పాల ప్యాకెట్లను నోటితో తెంచి ఆ పాలను అభిషేకం చేయరాదు.
* శివలింగానికి అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని తాకరాదు.
* అభిషేకం సమయంలో మన శరీరం నుండి వచ్చే చెమట గాని వెంట్రుకలు గాని శివలింగంపై పడకూడదు.
* మహా శివరాత్రి రోజున కలయికలో పాల్గొనకూడదు.
* మహా శివరాత్రి రోజున మద్యం, మాంసం తినకూడదు.
హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి అంకితమివ్వబడిన ఈ పండుగను 2022లో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. మహా శివరాత్రి పండుగ ప్రతి ఏటా హిందూ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
* మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను ఎప్పటికీ సమర్పించకూడదు.
* మహా శివరాత్రి పండుగ రోజున శివ లింగానికి ప్యాకెట్ పాలు సమర్పించకూడదని గుర్తుంచుకోవాలి. ఆవు పాలు మాత్రమే శ్రేష్టమైనవని గుర్తుంచుకోవాలి.
* శివ లింగానికి అభిషేకం సమయంలో ఉపయోగించే పాల ప్యాకెట్లను నోటితో తెంచి ఆ పాలను అభిషేకం చేయరాదు.
* శివలింగానికి అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని తాకరాదు.
* అభిషేకం సమయంలో మన శరీరం నుండి వచ్చే చెమట గాని వెంట్రుకలు గాని శివలింగంపై పడకూడదు.
* మహా శివరాత్రి రోజున కలయికలో పాల్గొనకూడదు.
* మహా శివరాత్రి రోజున మద్యం, మాంసం తినకూడదు.



Click it and Unblock the Notifications