Just In
- 1 hr ago
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- 2 hrs ago
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
- 3 hrs ago
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తోందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
- 4 hrs ago
మీ భాగస్వామి మీ చేతులను అలా పట్టుకుంటున్నారా? అయితే వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి...!
Don't Miss
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- News
పెళ్లి చేసుకోమ్మని అడగడమే పాపమా.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి గోడలో పాతిపెట్టిన కసాయి...
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Movies
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Makar Sankranti 2021 : సంక్రాంతి వేళ ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి.. చెడు ఫలితాలొస్తాయట...!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ప్రధానంగా భావించే పండుగలలో మకర సంక్రాంతి (Pongal) కూడా ఒకటి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
అయితే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్‌లో లోహారీ, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలోని బొగాలి బిహు, గుజరాత్లో ఉత్తరాయన్ (కైట్ ఫ్లయింగ్) మరియు రాజస్థాన్, కర్ణాటక, బీహార్ మరియు తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి అని పిలుస్తారు.
తమిళనాడులో "పొంగల్" గా జరుపుకుంటారు. కేరళలోని శబరిమలలో నివసించే అయ్యప్ప స్వామి ఈ రోజును 'మాగరవాలక్' గా జరుపుకుంటారు. ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు కచ్చితంగా చేయాలి.. మరికొన్ని పనులు అస్సలు చేయకూడదంట.. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి...
Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!
కచ్చితంగా చేయాల్సిన పనులు

పారే నీటిలో స్నానం..
మకర సంక్రాంతి పండుగ రోజున పారే నీటిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో లేదా పారే నీటిలో స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయలేని వారు పారే నీటిని ఇంట్లోకి ఓ బాటిల్ లో ఏదైనా పాత్రలో తీసుకొచ్చి మీరు స్నానం చేసే పాత్రలో వేసుకుని కూడా చేయొచ్చు.

సూర్య దేవుడి ప్రార్థన..
సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తరువాత, సూర్య దేవునికి నీరు అర్పించండి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. శివుడు, విష్ణువు మరియు లక్ష్మి దేవిని కూడా సంక్రాంతిపై శ్రేయస్సు కోసం పూజించవచ్చు. ఈ పవిత్రమైన రోజున మీరు సూర్య భగవానుని ఆశీర్వాదం పొందాలనుకుంటే, సాయంత్రం వేళలో ఏమి తినకుండా ఉండాలి.

దానం చేయండి..
మకర సంక్రాంతి రోజున దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పేదలకు ఆహారం, దుస్తులు ఇవ్వండి. గోమాతలకు ఏదైనా ఆహారం ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
Makar Sankranti 2021 : ఈ సంక్రాంతికి మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుందంట..!

నువ్వులతో వంటలు
ఈ సమయంలో చాలా మంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కోరుకుంటారు. ఇంట్లో నువ్వులు లడ్డు మరియు ఖిచ్డి తయారు చేసి పేదలకు పంపిణీ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తినండి. ఇవన్నీ మకర సంక్రాంతి రోజున మీకు శ్రేయస్సు తెస్తాయి. అలాగే నువ్వులతో రొట్టెలు, సకినాలు, ఇతర వంటకాలను తయారు చేసుకోండి.
చేయకూడని పనులు

స్నానం చేయకుండా తినకండి..
మనలో చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టీ తాగడం అలవాటుగా ఉంటుంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే, మకర సంక్రాంతి రోజున దానికి కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఈ పవిత్రమైన రోజున, స్నానం చేయకుండా అస్సలు ఏమి తీసుకోకండి. గంగానది లేదా మరే ఇతర నదిలో స్నానం చేసి విరాళాలు ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈరోజు అన్నపానీయాలు ముట్టాలి.

చెట్లను నరికివేయవద్దు
హిందూ మతంలో చెట్లను ప్రకృతి పవిత్రమైన అంశాలుగా పూజిస్తారు. చాలా చెట్లు కొన్ని దేవతలకు ప్రతీక అని నమ్ముతారు. అంతేకాక, మకరసంక్రాంతి కూడా పంట పండుగ కాబట్టి, ఆ రోజున మొక్కలను పూజిస్తారు. మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పూజిస్తూ జరుపుకునే పండుగ. ఈ రోజున, మీరు ఇంటి లోపల లేదా ఆరుబయట ఎలాంటి మొక్కలను కత్తిరించడం లేదా కోయడం వంటివి చేయకండి. ఇలా చేస్తే మీకు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతి పండుగ మరియు పచ్చదనం యొక్క వేడుక. అందువల్ల, కోత పనులను ఈ రోజుకు వాయిదా వేయాలి.
Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!

మత్తు పదార్థాలకు దూరంగా..
మకర సంక్రాంతి రోజున మీరు ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోకూడదు. మీరు ఈరోజు మద్యం, సిగరెట్లు మరియు గుట్కాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మసాలా ఆహారం తినవద్దు. అదే విధంగా మాంసాహారానికి కూడా ఈరోజు దూరంగా ఉండాలి. అయితే ఈరోజు, నువ్వులు, చిక్కీ మరియు ఖిచ్డి తినవచ్చు మరియు వీలైనంత దానం చేయాలి. ఈ రోజున భక్తులు సూర్య భగవానుని, శనిని ఆరాధిస్తారు. మకర సంక్రాంతి పండుగను సరళంగా జరుపుకోవాలి. ఆహారం నియమాలను కచ్చితంగా పాటించాలి.

బిచ్చగాళ్లను తిరిగి పంపకండి..
మీ చుట్టుపక్కల వారు మీ ఇంటికి భిక్షాటనకు వస్తే, వారిని మకర సంక్రాంతి రోజున, మాత్రం ఒట్టిచేతులతో అస్సలు తిరిగి పంపకండి. మీ స్తోమత మేరకు మీకు తోచినది ఏదో ఒకటి దానం చేయండి.

కోపంగా మాట్లాడకండి
మకర సంక్రాంతి రోజున సూర్యుని ఆశీర్వాదం కావాలంటే, మీరు అనాగరికతను వదులుకోవాలి. మకరసంక్రాంతి ఒక పవిత్ర పండుగ మరియు ప్రజలు కొత్త ఆరంభం కావాలని కోరుకుంటారు. కాబట్టి కోపాన్ని పాత్రలపై చూపడం లేదా మనుషులపై చూపడం వంటివి చేయకూడదు. అలా చేస్తే మీకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది మీ విజయానికి అవరోధంగా ఉంటుంది. కాబట్టి, మకర సంక్రాంతి రోజున ఎవరితోనూ కోపగించవద్దు. ఎవరితోనూ చెడుగా మాట్లాడకండి, అందరితో దయగా ప్రవర్తించండి.